Pulses Cultivation: మన దేశంలో 2.4 కోట్ల హెక్టార్లలో అనేక రకాల పప్పు ధాన్యాలు పండిస్తున్నారు. మన భారతదేశం నుంచి ఉత్పత్తి 1.4 కోట్ల టన్నులు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాలో 20 లక్షల హెక్టార్లు సాగు చేస్తున్నారు. దేశ సగటు ఉత్పాదకత హెక్టారుకు 600 కిలోలు ఉంది. మొత్తం ఆహార పంటల విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు 19 % పండిస్తున్నారు. దేశంలో ప్రధానంగా పప్పు పండించే రాష్ట్రల ఉత్పాదకత 700 ధాన్యాలు పండించే ప్రాంతాలు మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ 81 % వరకు ఉత్పత్తి చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పప్పు ధాన్యాలు పండించే జిల్లాలు గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, కర్నూలు, మహబూబ్ నగర్, అనంత పూర్ మొదలైనవి. దేశంలో పండే పప్పు ధాన్యాలలో ముఖ్యమైనవి మినుము, సెనగ, కంది, పెసర, మిగిలిన అన్ని రకాలు కలిపి కేవలం 40 శాతం మాత్రమే పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రధాన పప్పు ధాన్యపంటలుగా సెనగ, మినుము, పెసర, ఉలవలు, ఇతర పప్పు ధాన్యాలు పండిస్తున్నారు.
ప్రపంచంలో పప్పు ధాన్యాల అత్యధిక విస్తీర్ణంలో, ఉత్పత్తిలో మన దేశం మొదతిస్థానంలో ఉంది. ప్రపంచ పప్పు ఉత్పత్తిలో 25% మన
దేశంలోనే ఉత్పత్తి అవుతున్నది. అత్యధిక వినియోగం కూడా మన దేశంలోనే ఉంది. పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకొనే దేశాల్లో మన దేశానిదే అగ్ర స్థానం, మయన్మార్, పాకిస్తాన్, కెనడా, టాంజానియా, టర్కీ , ఆస్ట్రేలియా నుంచి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే 16 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ దిగుమతి శాతం ఇంకా ఎక్కువ పెరిగింది.
పప్పు ధాన్యపు పంటల ప్రాముఖ్యత:
1. పప్పు ధాన్యాలు ఆహారంలో మాంస కృతుల కొరతను తీర్చుతాయి. పెరిగే పిల్లలు నుండి వృద్ధుల వరకు తీసుకునే ఆహారంలో తగినంత మాంస కృతులు లేకపోతే పిల్లల్లో పెరుగుదల పెద్దల్లో శరీరం బలహీనంగా మారుతుంది.
2. ఈ పంటలో విటమిస్, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ A దాదాపు 3-4 శాతం ఉంటుంది.
3. రోజు రోజుకు మట్టి సారం తగ్గడం , సాగు భూములను మళ్ళీ పూర్వ స్థితికి తీసుకు రావడానికి అంతర పంటలు ఎంతో మేలు చేస్తాయి.
4. వాతావరణంలోని నత్రజనిని సంగ్రహించి వేరు ద్వారా నేలకు అందిస్తాయి.
5. ఆకులు కాడలు కుళ్ళి సేంద్రియ పదార్ధంగా మారి నేల భౌతిక, రసాయనిక లక్షణాలను పెంచుతుంది. ఈ సూక్ష్మ జీవుల అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ సూక్ష్మ జీవులు నిరంతరంగా వాటి జీవ కార్య కలాపాలు జరుపుకొంటూ నేలను గుల్ల పరచి, తేమను నిల్వ ఉంచుకొని, నేలలో గల పోషకాలను మొక్కలు వినియోగించు కొనే విధంగా మార్చుతాయి.
6. పప్పు ధాన్య పంటలు పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు.
7. పప్పు ధాన్యాల పంటలు సాగు చేయడం ద్వారా కలుపు పెరుగుదల తగ్గుతుంది.
8. పప్పు ధాన్యాల పంటలను సాగు చేయడం వల్ల నేల కోత అరికట్ట వచ్చు.
Also Read: 19th Academic Council Meeting: పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో 19వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం
పప్పు ధాన్యాల పంట సాగులో సమస్యలు:
వాతావరణ పరిస్థితులు:
1. పప్పు ధాన్యాల పంట సాగును 92% వరకు వర్షాధారంగా పండిస్తున్నారు.
2. పూత సమయంలో అధిక నీటికి, ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి కావడం జరుగుతుంది. అకాల వర్షాల వలన నీటి నిల్వ, నీటి ముంపుకు పంట గురికావడం జరుగుతుంది.
3. నేల కోతకు గురైన, సారవంతం కాని నేలల్లో పప్పు పంటలు పండించడం వలన తక్కువ దిగుబడి వస్తున్నాయి.
4. ఎత్తైన నీటి మట్టం ఉన్న ప్రాంతాల్లో పండించ దానికి పనికి రావు.
5. అధిక ఉత్పాదకత గల రకాలు లేకపోవడం వల్ల పంట దిగుబడి పై ప్రభావం ఉంది.
6. అధిక మోతాదులో కలుపు ఉధృతి ఉండడం వల్ల పప్పు పంటలు రైతులు సాగు చేయడం తగ్గించారు.
7. కోత తర్వాత గింజ నిల్వ సమయం లో పురుగులు ఆశించి నష్టం చేయడం
8. కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానంలో పప్పుని మంచిగా ఆరపెట్టాలి, లేకపోతే పంట నిల్వ ఉండే సమయం తగ్గుతుంది.
పప్పు ధాన్యాల పంటలు పండించడంలో ప్రధానమైన అంశాలు:
1. అనువైన తక్కువ కాల పరిమితి, అధిక దిగుబడి నిచ్చు వంగడాలను సాగు చేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోనికి తీసుకు రావడం వల్ల మంచి దిగుబడి వస్తుంది.
2. పప్పు పంటలు వర్షాధార, నీటి పారుదల క్రింద ఎక్కువగా జొన్న, సజ్జ వంటి పంటలు అంతర పంటగా, మిశ్రమ పంటగా సాగు చేయడం ద్వారా కొత్త పంటల మంచి దిగుబడి వస్తాయి.
3. అధిక దిగుబడిని ఇచ్చే రకాలను రూపొందించి విత్తనాభివృద్ధి చేయడం
4. దుక్కిలో భాస్వరం ఎరువులు వేయడం, విత్తన శుద్ధి చేయడం, రైజోబియం కల్చరు విత్తనానికి కలిపి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.
5. పప్పు ధాన్యాల పంటలను సారవంతమైన నేలలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు.
6. ప్రభుత్వం ద్వారా పప్పు పంటల విత్తనాలను, ఎరువులను, సబ్సిడీలో అందించడం ద్వారా రైతులకు ప్రోత్సాహం లభిస్తుంది.
7. పప్పు ధాన్యాల సాగు పద్ధతులను పూర్తిగా తెలుసుకొని సరైన సమయానికి పంటను విత్తుకోవడం, సరైన ఎరువులను వేయడం, సరైన కలుపు, నీటి యాజమాన్యం చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని వస్తుంది.
Also Read: PM Kisan 14th Installment Release Date: తొందరలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల..