జాతీయం

Ginger (Green) Mandi Prices: ఈ ప్రాంతంలో కిలో అల్లం 400 రూపాయలు..

1
Ginger
Ginger

Ginger (Green) Mandi Prices: గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు రైతులకు కొంత మందికి ఆనందాన్ని ఇస్తే, మరి కొంత మందికి బాధని ఇస్తున్నాయి. ఒక వైపు పెరిగిన టమాట ధరలు కొంత మంది రైతులను కోటీశ్వరులని చేస్తుంటే, మరి కొంత మంది రైతుల ప్రాణాలకే ముప్పుగా మారింది. ప్రస్తుతం టమాట ధర ఆకాశన్నంటుతుంటే, మరో వైపు అల్లం కూడా టమాట ధరల వైపుగానే వెళ్తుంది. ప్రస్తుతం కిలో అల్లం ధర 300- 400 రూపాయలుగా మార్కెట్లో అమ్ముతున్నారు.

మనదేశంలో అల్లం పంట ఎక్కువగా కర్ణాటక ప్రాంతంలో సాగు చేస్తారు. కర్ణాటక ప్రాంతం అల్లం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలో కిలో అల్లం 400 రూపాయలకు అమ్ముతున్నారు. నాన్ వెజ్ ధరలు తగ్గడం, ఈ అల్లం ధర పెరగడం నాన్ వెజ్ తినే ప్రజకు బడ్జెట్ మళ్ళీ పెంచింది. ఇంకా రానున్న రోజులో అల్లంలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: MTU-1262 Marteru Paddy Seed Variety: మార్టేరు వరి పరిశోధన స్థానం ఖాతాలో కి మరో నూతన వరి వంగడం.!

Summer Ginger Cultivation

Ginger (Green) Mandi Prices

కర్ణాటక రాష్ట్ర రాజ్య రైతు సంఘం మైసూరు జిల్లా యూనిట్లో 60 కిలోల అల్లం బస్తాను రూ.11 వేలకు రైతులు అమ్ముతున్నారు. గత సంవత్సరం ఒక బస్తా 2000 నుంచి 3000 వేల రూపాయలు ఉండేది. ఇప్పుడు అల్లం ధర ఆకస్మికంగా పెరగడం వల్ల అల్లం పంట సాగు చేసిన రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.

కర్ణాటక రాష్ట్రం మైసూరు, మల్నాడు జిల్లాలో రైతులు పెద్ద మొత్తంలో అల్లం సాగు చేస్తారు. అల్లం ధరలు పెరగడం రైతులకి వరంగా మారింది. ఇక్కడి రైతులు అల్లం పంటని అమ్ముకొని మంచి ఆదాయం పొందుతున్నారు. రానున్న రోజులో టమాట ధరలతో పాటు అల్లం ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Pearl Millet Farming: సజ్జ పంట సాగు విధానం..

Leave Your Comments

Pearl Millet Farming: సజ్జ పంట సాగు విధానం..

Previous article

Solar Powered Fan to Grill Corn: 75 సంవత్సరాల మహిళ అద్భుతమైన ఆలోచన..

Next article

You may also like