ఆరోగ్యం / జీవన విధానం

బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాలు..

0

బొప్పాయి కాయని ఇంగ్లీష్ లో “ఫ్రూట్ ఆఫ్ ఏంజిల్స్” అంటారు. అంటే దేవదూతల ఫలమని అర్థం. ఈ ఫలం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. బొప్పాయిలో శరీరానికి అవసరమైన విటమిన్లు,ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయంటున్నారు నిపుణులు. బొబ్బయిలో పదార్థం, మెగ్నీషియం కేలరీల సంఖ్య తక్కువ. బొప్పాయి ఆకలిని నియంత్రిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. త్వరగా ఆకలి వేయదు. కాబట్టి తగ్గాలనే లక్ష్యంతో డైటింగులు, వ్యాయామాలు చేసేవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. బొప్పాయిలో కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ కె, అధిక మోతాదులో ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలు వున్నవారికి ఇది చాలా మంచిది. ఈ పండులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అంతేకాదు బొప్పాయిలో అల్సర్లను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.
బొప్పాయిలో ఉండే పపైన్, కిమోపపైన్ ఎంజైమ్ లు కడుపులో మంటను తగ్గిస్తాయి. ఈ ఎంజైమ్ లు గాయాలను త్వరగా మాన్పుతాయి. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి కూడా బొప్పాయిలో లభిస్తాయి.
జలుబు, జ్వరాలు రాకుండా బొప్పాయి నివారిస్తుంది. రోజూ బొప్పాయి తినడం కంటికి మంచిది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్స్ , ఫైటోన్యూట్రియంట్స్ వల్ల పెద్ద పేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లు వచ్చే ముప్పు తగ్గుతుంది.
చర్మ సంరక్షణకు బొప్పాయి ఎంతో ఉత్తమం. మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మంపై ముడతల నివారిణిగా పనిచేస్తుంది.

Leave Your Comments

విటమిన్ డి లోపం వలన కలిగే ఆరోగ్య నష్టాలు..

Previous article

మల్చింగ్ విధానంలో పుచ్చసాగు..

Next article

You may also like