Pearl Millet Farming: సజ్జలని పెర్ల్ మిల్లెట్, బుల్రష్ మిల్లెట్ అని కూడా అంటారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో సజ్జ పంట 1.45 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సుమారు 1.50 లక్షల టన్నుల ఉత్పత్తిని పండిస్తున్నారు. ఎకరాకు దాదాపు దిగుబడి 4 క్వింటాళ్ళు వరకు వస్తుంది.
వాతావరణం:
1. సజ్జ పంటను వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయవచ్చు. సజ్జ పంట వాతావరణంలోని ఉష్ణోగ్రత, నీటి
అందుబాటులో పంట సాగు చేస్తే మంచి దిగుబడిని వస్తుంది.
2. సజ్జలో వివిధ రకాలు ఫోటో సెన్సిటివ్గా ఉంటుంది. అందువల్ల ఈ పంట ను వివిధ కాలాల్లో సాగు చేయవచ్చు.
3. ఈ పంటకు తక్కువ వర్ష పాతం 400-500 ఎం. ఎం ఉండాలి, పొడి వాతావరణం అవసరం.
4. పంట ఏపుగా పెరిగే దశలో తేమ గల వాతావరణం, వర్ష పాతం, మంచి సూర్య రశ్మి ఉండాలి.
5, పంట పూత దశలో వర్షానికి గురి కాకుండా చూసుకోవాలి. వర్షం ఉన్నట్లయితే పుప్పొడి వర్షం నీళ్ళలో కొట్టుకొని పోవడం, పరాగ సంపర్కం తక్కువగా ఉంటుంది. దాని వల్ల దిగుబడి తగ్గుతుంది.
6. పక్వ దశలో పొడి వాతావరణంతో కూడిన అధిక సూర్య రశ్మి అవసరం.
7. సజ్జ పంట నీటి కొరతని బాగా తట్టుకొంతుంది. కాని అధిక వర్ష పాతం, మంచును తట్టుకోలేదు.
నేలలు:
1. తేలిక నుండి మధ్య రకం నేలల్లో సాగు చేసుకోవచ్చు.
2. నీరు ఇంకే మురుగు నీరు పోయే వసతి గల నేలలు అనుకూలము.
విత్తే సమయం: ఖరీఫ్ – జూన్, జూలై, వేసవి – జనవరి
విత్తన మోతాదు: ఎకరాకు 1.6 కిలోలు
విత్తన శుద్ధి: రెండు గ్రాముల ఉప్పు ఒక లీటర్ నీటి ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాలు ఉంచి విత్తుకోవాలి. ఆరిన కిలో విత్తనానికి 3 గ్రాముల ‘థైరామ్’ను కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తే దూరం: వరుసల మధ్య 45 సెంటి మీటర్, మొక్కల మధ్య 12 నుండి 15 సెంటి మీటర్ల దూరం ఉండాలి. ఎకరానికి 60 వేల మొక్కలు వచ్చేలా విత్తనాలు వేసుకోవాలి.
నాటడం: నారు పోసి పదిహేను రోజుల వయసు గల నారు మొక్కలను నాటవచ్చు.
నీటి యాజమాన్యం:
1. సజ్జ పంట దుబ్బు చేసే దశ, పిలక దశ, పూత దశ, పాలు పోసుకోను దశ మొదలైన దశలు కీలకమైనవి. ఈ సమయంలో నేలలో తగిన తేమ ఉండాలి.
2. మొక్కలను 30 రోజుల వయసులో ఎకరానికి రెండు టన్నులు వేరుశెనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా భూమిలోని తేమను ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు.
కలుపు నివారణ/అంతర కృషి:
1. విత్తిన రెండు వారాలలోపు కలుపు తీసివేయాలి.
2. విత్తిన వెంటనే లేదా రెండు, మూడు రోజుల్లో అట్రజిన్ 50% పొడి మందు ఎకరానికి 400-600 గ్రాముల వరకు 200 లీటర్లు నీటిలో కలిపి తేమ ఉన్నపుడు పిచికారి చేయాలి.
3. 25,30 రోజులప్పుడు అంతర పంటలు వేసుకోవచ్చు.
పంట కోత:
సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. రెండు లేదా మూడు దశల్లో కంకులు కోయాల్సి వస్తుంది. కోసిన కంకులను బాగా ఆరబెట్టి కట్టెలతో లేదా ట్రాక్టర్తో గాని నూర్పిడి చేసి గింజలను వేరు చేయవచ్చు. గింజలను బాగా ఆరబెట్టి నిలువ చేయాలి. అప్పుడప్పుడు గింజలను ఎండ బోసినట్లయితే పురుగుల బారి నుండి కాపాడ వచ్చును.
Also Read: