తెలంగాణ

Minister Niranjan Reddy: తెలంగాణలో కూరగాయల సాగుపై దృష్టి – మంత్రి

0
Minister Niranjan Reddy said that the focus should be on vegetable cultivation in Telangana
Minister Niranjan Reddy said that the focus should be on vegetable cultivation in Telangana

Minister Niranjan Reddy: తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సచివాలయంలోని వ్యవసాయశాఖ మంత్రి కూరగాయల సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించారు,

మారుతున్న అవసరాలపై దృష్టి సారించాలి

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు కూరగాయల విస్తీర్ణం పెరగాలన్నారు. నెలవారీగా రాష్ట్రంలో కూరగాయల వినియోగం,సాగు, ఉత్పత్తి, సాగు చేసే సన్న, చిన్నకారు రైతులపై మరోసారి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఆధికారులకు సూచించారు. కూరగాయల సాగులో మారుతున్న అవసరాలపై దృష్టి సారించాలని, విత్తనాల ధరలు, మార్కెట్లో కూరగాయల ధరలు, సాగుకు అవసరమైన సౌకర్యాలపై ఏం చర్యలు తీసుకోవాలి. నిల్వకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, స్వల్పకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలన్నారు.

Also Read: Tomato Farmer: టమాట పంటతో ఒకరోజులోనే లక్షాధికారులు అవుతారు..

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

సాగు పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు నూతన జిల్లా కేంద్రా పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెంపొందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆధికారులను కోరారు. సాగు పెంపుకోసం అవసరమైన మౌలిక సదుపాయలపై సూచనలు చేయాలని ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఆచరణాత్మక విధానాలను పరిశీలించాలని అన్నారు. వీటన్నింటి పై వివరణాత్మక నివేదిక, సూచనలు ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో కూరగాయల సాగుకు ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శి సత్య శారద, జాతీయ విత్తన సంస్థ ప్రాంతీయ అధికారి బ్రిట్టో తదితరులు పాల్గొన్నారు.

Also Read: The World’s Most Expensive Cow: ఆంధ్రప్రదేశ్లో పెరిగే ఈ ఆవులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది..

Leave Your Comments

Tomato Farmer: టమాట పంటతో ఒకరోజులోనే లక్షాధికారులు అవుతారు..

Previous article

Maize Cultivation: మొక్క జొన్న పంట ఎలా సాగు చేయాలి..

Next article

You may also like