The World’s Most Expensive Cow: భారతదేశంలో ఆవును గోమాతగా పూజిస్తారు. ఆవులకి చాలా ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. ఆవు పాలు, ఆవు పేడ ఇలా ప్రతి ఒకటి మనం ఆయుర్వేద మందుల తయారీలో వాడుతారు. శివుడు కంఠంలో విషం దాచుకున్నట్లు, ఆవు విష పదార్థాలు తిన్ననా కూడా వాటిని తన శరీరంలో దాచుకొని మనకి స్వచ్ఛమైన పాలని మాత్రమే ఇస్తున్నది. కానీ ప్రపంచంలోనే అంత్యంత ఖరీదు అయిన ఆవు మన దేశంలో ఉంది అని మీకు తెలుసా…?
ఇప్పుడు ఈ ఆవులు విదేశాలకి కూడా తీసుకొని వెళ్లారు. వయాటినా-19 FIV మారా ఇమోవిస్ అనే జాతి ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్త్రం, నెల్లూరు జిల్లాకి చెందింది. ఇప్పుడు ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదుకి అమ్ముతున్నారు. ఈ ఆవులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆవులు ఎలాంటి వాతావరంలో అయిన వాటి శరీరం అనుకూలంగా మార్చుకుంటాయి.
Also Read: Telangana Rains: తెలంగాణాలో భారీ వర్షాలు – రెడ్ అలెర్ట్ ప్రకటన
వయాటినా-19 FIV మారా ఇమోవిస్ ఆవులు పాలు కూడా ఎక్కువ ఇస్తాయి. ఈ ఆవుల పాలలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆవులు తెల్లగా ఉంటూ, వాటి శరీరం మెరుస్తూ ఉంటుంది . ఆవులకి భుజాలపై మూపురం ఉంటుంది. ఆవుల చర్మం వదులుగా ఉన్నటు కనిపించిన, చాలా ధృడంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న తట్టుకుంటాయి. ఈ ఆవులకి రక్తం పీల్చే కీటకాలు నుంచి కూడా ఎటువంటి హాని ఉండదు.
ఈ ఆవులు బ్రెజిల్‌లో 1.44 మిలియన్ల డాలర్లు అమ్ముతున్నారు. మన దేశ కరెన్సీలో 11 కోట్ల రూపాయలు విలువ. ప్రస్తుతం ఈ ఆవులు 4.3 మిలియన్ల డాలర్లు అమ్ముతున్నారు. మన దేశ కరెన్సీలో 35 కోట్ల రూపాయలు విలువ. నెల్లూరు జిల్లా నుంచి బ్రెజిల్‌కు ఈ ఆవులని పంపారు. ఇప్పుడు ఈ ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మారింది. ప్రపంచం మొత్తం ఈ జాతి ఆవులు దాదాపు 16 కోట్ల వరకు ఉన్నాయి అని సమాచారం.
Also Read: Coco Peat and Coco Coir: కోకో పీట్, కాయిర్ ఎలా ఉపయోగించాలి.!