Telangana Rains: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాకాలం మొదటిలో వర్షాలు రాకపోవడంతో రైతులు పొలం దున్నలేదు, విత్తనాలు ఆలస్యంగా విత్తుకున్నారు. విత్తనాలు విత్తుకున్న తర్వాత కూడా వర్షాలు లేకపోవడంతో పంట పెరుగుదల తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి అని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఎక్కువ వర్షాలు రావడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ ఖమ్మం, మహబూబాబాద్, జంగం జిల్లాలు భారీ వర్షాలతో ముప్పు ఏర్పడే సూచనా ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
Also Read: Coco Peat and Coco Coir: కోకో పీట్, కాయిర్ ఎలా ఉపయోగించాలి.!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా రానున్న 48 గంటలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ అల్పపీడనం వల్ల అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల రైతుల పంటలు ఎక్కువగా నష్టం అవుతున్నాయి. ఎక్కువ వర్షాల వల్ల పొలంలోనే నీళ్లు నిలిచిపోవడం వల్ల కూడా పంటలు నష్టపోతాయి. పొలంలో నీళ్లు నిల్వకుండా లోత్తుగా ఉన్న ప్రాంతంలో చిన్న గుంతల తొవ్వుకొని వర్షం నీటిని అందులోకి వెళ్లేలా చేసుకుంటుంటే పంటలు ఎక్కువ వర్షాలకు దెబ్బ తిన్నావు.
Also Read: Cattle Rearing: వీటిని పెంచి నెలకి 50 వేల వరకు సంపాదించడం ఎలా.?