Coco Peat and Coco Coir: రైతులు విత్తనాలని నారు మడిగా చేసుకొని, తర్వాత ఆ నారుని పొలంలో నాటుకుంటారు. ఎక్కువ శాతంగా మొక్కలు పెంచాలి అనుకుంటే ఇలా చేస్తున్నారు అందరూ. మట్టిలో పెంచడం వల్ల మట్టిలోని కొన్ని రోగాలు మొక్కకి వచ్చే అవకాశం ఉంది. మట్టి ద్వారా మొక్కకి రోగాలు రాకుండా ఉండడానికి, మొక్క తొందరగా పెరగడానికి ఈ మధ్య కాలంలో కోకో పీట్ వాడుతున్నారు. కోకో పీట్ టెర్రస్ గార్డెనింగ్, గ్రో బ్యాగ్ ఫార్మింగ్, నర్సరీలలో ఎక్కువగా వాడుతున్నారు. ఈ కోకో పీట్కి మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి హైదరాబాద్, మేడ్చెల్ ప్రాంతంలో ఎం.ఎస్ కోకో పీట్ అండ్ కాయిర్ పరిశ్రమ ప్రారంభించారు.
కోకో పీట్ అండ్ కాయిర్ తయారు చేయడానికి కొబ్బరి బోండాలని తీసుకొని వస్తారు. ఈ కొబ్బరి బోండాలని మెషిన్లో వేయడం ద్వారా కోకో, కోయిర్ రెండు వైపుల నుంచి వస్తాయి. మంచి నాణ్యమైన కోకో పీట్ కోసం జల్లెడలో వేసి తీయాలి. ఈ కోకో పీట్ మూడు గ్రేడ్గా ఉంటాయి. మన అవసరాని బట్టి ఈ పరిశ్రమ వాళ్ళు మనం ఏ గ్రేడ్ కోకో పీట్ వాడితే మంచిది అని వాళ్లే చెపుతారు.
మెషిన్ నుంచి వచ్చిన కోకో పీట్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు డీకంపోజ్ చేస్తారు. ఎక్కువ రోజులు డీకంపోజ్ చేసిన కోకో పీట్ ఎక్కువ ధర ఉంటుంది. నాణ్యమైన కోకో పీట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కోకో పీట్ విత్తన కంపెనీ వాళ్ళు విత్తన అంకురోత్పత్తి పరీక్షకు, భూమి పరిశీలన పరీక్షకి వాడుతారు. విత్తన కంపెనీ వాళ్ళు ఏ గ్రేడ్ కోకో పీట్ వాడుతారు. బి గ్రేడ్ కోకో పీట్ నర్సరీలో వాడుతారు. సి గ్రేడ్ కోకో పీట్ మట్టిలో కలిపి రైతులు వాడుతారు.
Also Read: Cattle Rearing: వీటిని పెంచి నెలకి 50 వేల వరకు సంపాదించడం ఎలా.?
కోకో పీట్లో ఎలక్ట్రో కనెక్టివిటీ 0.5 నుంచి 1.5 వరకు ఉంటుంది. కోకో పీట్ తయారు చేసే ముందు వరకు ఎలక్ట్రో కనెక్టివిటీ 3 ఉంటుంది. కోకో పీట్ తయారు చేశాక ఈ కోకో పీట్కి ప్రతి రోజు నీటిని ఇవ్వాలి. అందువల్ల కోకో పీట్లోని యాసిడ్, ఉప్పు నీటి నుంచి బయటికి వెళ్లిపోతాయి. కోకో పీట్ అవడటం వల్ల మట్టిని వదులుగా చేస్తుంది. అందువల్ల మట్టిలోకి వేర్లు ఎక్కువ లోత్తు వరకు వెళ్తుంది. మొక్క వేర్ల సంఖ్య కూడా పెరగడం వల్ల మొక్క భూమిలో మంచిగా పెరుగుతుంది.
కోకో పీట్ నీటిని ఎక్కువ తీసుకుంటుంది. దాని వల్ల మొక్కకి నీళ్లు లేని సమయంలో కూడా ఈ కోకో పీట్ నీటిని అందిస్తాయి. ఈ కోకో పీట్లో నైట్రోజన్ ఉంటుంది , ఇది మొక్క పెరుగుదలకి ఎక్కువగా అవసరం అవుతుంది. కాయిర్ ఎక్కువగా బొమ్మలు తయారీలో వాడుతారు. కాయిర్ సోఫా సెట్ తయారీలో, సెల్లింగ్లో వాడుతారు. కోకో పీట్, కోయిర్ గురించి ఇంకా ఎక్కువ విషయాలు లేదా వీటిని కొనుగోలు చేయాలి అనుకుంటే 9666135189 నెంబర్ సంప్రదించండి.
Also Read: Pulses Adulteration Test: మార్కెట్లో కల్తీ పప్పు ఎలా తయారు చేస్తున్నారు.?