Integrated Parthenium Management: ఆ మొక్క చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. చిన్న చిన్న నక్షత్రాలు లాగా ఉన్న ఈతెల్లటి పూలు, చామంతి ఆకులను పోలిన ఆకులతో చూడడానికి అలంకరణ మొక్క లాగా కనిపిస్తుంది. అది ఒక కలుపు మొక్క. వయ్యారి భామ, పిచ్చి మాసపత్రి, కాంగ్రెస్ మొక్క, గడ్డి జాతి అని దీనికి అనేక పేర్లు ఉన్నాయి. బీడు భూములు, ఖాళీ ప్రదేశాలు, రోడ్డు పక్కన, రైల్వే ట్రాక్ ల ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ మొక్క పంటచేలలో విపరీతంగా వ్యాపిస్తూ రైతులకు సవాల్ ను విసురుతుంది. అధిక విత్తనోత్పత్తి సామర్థ్యం కలిగి పంట, నష్టం కలిగించడానికి కారణం అవుతుంది. పంటలకు పశువులకు కాకుండా మానవాళి పై ఈకలుపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పలు రకాల చర్మవ్యాధులకు, ఎలర్జీకి కూడా కారణం అవుతుంది..
ఆగస్టు 16 నుండి 22 వరకు వయ్యారిభామ నిర్మూలన వారోత్సవాలు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేసే అన్ని రకాల పంటలలో ఇది ఒక్క కలుపుమొక్క, గడ్డిజాతి. గుంపులు గుంపులుగా పెరిగి పంటలు ఎదగకుండా చేసి రైతులను నష్టపరుస్తుంది. ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆగస్టు 16 నుండి 22 వరకు వయ్యారిభామ నిర్మూలన వారోత్సవాలను దేశమంతా దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులందరికి ఈ కలుపు మొక్కలు ఎలా నివారించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తారు.. రైతులందరూ కూడా ఈకార్యక్రమంలో పొల్గొన్ని దీనిని ఎలా అంతం చేయాలి అని తెలుసుకుని పంటలను కాపాడుకోవాలని ఆధికారులు అంటున్నారు..
Also Read: Portable Solar Pump: పోర్టబుల్ సోలార్ పంప్ ఎలా వాడాలి..
వేర్లు నుండి కూడా విషపదార్థాలు: వయ్యారిభామ ఏక వార్షిక కలుపు మొక్క. ఈ మొక్క నుండి 15000-20000 విత్తనాలు రాలే అవకాశం ఉంది. ఈ కలుపు మొక్క రెండు నెలల్లో తన జీవిత కాలాన్ని పూర్తి చేసుకొని వేలకొద్ది విత్తనాలు రాల్చడంతో ఇది సమస్యాత్మకంగా మారింది. దీనివల్ల పంటలే కాకుండా పశువులకు, మనుషులకు కూడా నష్టం వాటిల్లుతుంది. దీని ద్వారా 40 నుంచి 60 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. వయ్యారిభామ వేరు నుండి కూడా విషపదార్థాలు వెలువడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.. దీని వల్లన చర్మ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా పశువులు గ్రాసం తో పాటు ఈ గుడ్డు కూడా తింటే పాల దిగుబడులు తగ్గిపోతాయి..
నివారణ పద్ధతులు
పంటలకు, పశువులకు, మనుషులకు ఈ కలుపు మొక్క వల్లన అన్ని నష్టాలు ఉన్నాయి కాబట్టి మనం దీనిని నివారించుకోవాలంటే కొన్ని పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏమిటి అంటే పూత దశకు రాగానే తీసేయాలి. ఎందుకంటే మొక్క నుండి కొన్ని వేల విత్తనాలు విడుదల అవుతాయి. అలా చేయడం వల్లన విత్తనోత్పత్తి అరికట్టవచ్చు. దానిని చేతితో తీయకూడదు. తిస్తే మనకు ఎలర్జీ వస్తుంది. బ్లౌజులు తొడుగుకొని తీయాలి.. వీటి నివారణకు మార్కెట్ లో పురుగు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని పిచికారి చేసి నిర్మూలించవచ్చు. పంట వేసిన దగ్గర నుండి కోత కోసే వరకు కలుపు మొక్కలు రాకుండా అరికట్టాలి. అప్పుడే మనం అధిక దిగుబడులను పొందగలము.
Also Read: Eradication of Parthenium Weed: నిమ్మ తోటల్లో పార్థీనియం కలుపు నిర్మూలన.!