Oil Palm Cultivation: అత్యధిక నూనె దిగుబడిని ఇచ్చే తోట పంట ఆయిల్ పామ్.. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ పంటకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఒక్కసారి ఈ పంటను నాటితే 40 సంవత్సరాల వరకు దిగుబడినిస్తాయి. మూడవ సంవత్సరానికి ఫలసాయం మన చేతికి వస్తుంది..ఎనిమిది సంవత్సరాల తర్వాత నుంచి 10 టన్నులు,15 టన్నులు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.. ఆయిల్ పామ్ సాగుకు ముఖ్యమైనది నీరు.. ఇది తోటలకు సంవృద్దిగా ఉండాలి.. ఈ సాగు మొదటి నుంచి సమగ్ర యాజమాన్యం పాటిస్తే మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు…
సమగ్ర యాజమాన్యం పద్ధతులు పాటించాలి..
కోస్తా జిల్లాలలో శరవేగంగా విస్తరిస్తున్న తోట పంట ఆయిల్ పామ్.. నూనెగింజలలో అత్యధిక రీకవరీ కలిగిన ఏకైక పంటగా ఆయిల్ పామ్ పేరుగాంచింది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఇసుక భూముల్లో కూడా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. దీర్ఘకాల పంట అయినా ఈ తోటలో మొక్క నాటిన దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకుంటే మంచి దిగుబడులను పొందవచ్చు..ఈ పంటకు ఉద్యానశాఖ రాయితీలు అందించి ప్రోత్సహిస్తుంది.
సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆధిక దిగుబడులు పొందవచ్చు. త్రికోణ ఆకారం లో ఎకరాకు 57 మొక్కలు అవసరం అవుతాయి.. ఏడాదికి మూడు, నాలుగు సార్లు ఎరువులు మొక్కలకు అందించాలి.. మొక్క వయస్సును బట్టి మనం పొషకాలను అందించాలి.. నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి.. మొక్కకు మొక్కకు మద్యలో 9 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కలుపు నివారణ, నీటి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.. చెట్టు వయస్సు పెరిగే కొద్దీ దిగుబడిలో వృద్ధి చెందుతుంది..
Also Read: Oil Prices: నూనె ధరలు భారీగా తగ్గుతున్నాయి.!
ఉద్యానశాఖ పలు రాయితీలు
అత్యధిక నూనె రికవరీ కలిగి ఏకైక పంటగా ఆయిల్ పామ్ పేరు ప్రసిద్ది. అందుకే ఉద్యానశాఖ పలు రాయితీలు అందిస్తుంది… మొదటి రెండు సంవత్సరాలకు దిగుబడి ఉండదు… అందుకు మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర పంటలు వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.. దీనివల్ల కలుపు సమస్య తక్కువగా ఉంటుది.. మూడవ సంవత్సరం నుంచి కొమ్మలు బాగా విస్తరిస్తాయి.. అందుకనే మొక్కల మధ్య నీడ ఎక్కువగా ఉండటం వల్లన కలుపు సమస్య ఉండదు. ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా కోకో పంట వేస్తే ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. నరికిన కొమ్మలను చెట్ల దగ్గర పెడితే అవి మొక్కలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతాయి..ముఖ్యంగా నీటి యాజమాన్యంలో జాగ్రత్తలు వహించాలి…
ఆయిల్ పామ్ కు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చెట్టు వయస్సు పెరిగే కొద్దీ దిగుబడులు పెరుగుతాయి. ఉద్యానశాఖ పలు రాయితీలను కల్పించడంతో రైతులు ఈ దీర్ఘకాల పంటను ఎంచుకుంటున్నారు. ఒక్కసారి నాటితే 40 సంవత్సరాల దాక మనం దిగుబడులను పొందవచ్చు. ఈ పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం తో ఇరు తెలుగు రాష్ట్రాలు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నాయి.
Also Read: Red Gram: వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంట కంది.!