Tomato to Compete with Petrol Price: తాజాగా భారతదేశంలో అతిపెద్ద డిమాండ్ టమోటా కు దక్కుతుంది. గడిచిన రెండు నెలల నుంచి ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి తక్కువగా ఉండటంతో టమాటాకు అత్యధిక డిమాండ్ నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో అధిక వర్షాలు, కొన్ని రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల టమాటా ఉత్పత్తి చాలా తక్కువగా జరిగింది. ఈ క్రమంలో ప్రతి వంటింట్లో ప్రతిరోజు కూరల్లో వాడే టమోటా కు అధిక డిమాండ్ వచ్చింది.
ప్రస్తుతం ఒక కిలో టమాటా ధర 150 రూపాయల నుంచి 200 రూపాయలకు వరకు ఆయా రాష్ట్రాలను బట్టి ఉండటం గమనార్హం. ఈ డిమాండ్ నేపథ్యంలో కూరగాయలు అమ్మే బండ్ల వద్ద టమాటాల కోసం వచ్చే కొనుగోలుదారులు వారికి నచ్చిన కూరగాయలతో పాటు టమాటాలను కూడా కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో టమాటాల ను ఏరుకునేవారు కానీ ఇప్పుడు అది లేదు..
Also Read: Jafra Cultivation:పెట్టుబడి తక్కువ, నికర ఆదాయం.. జాఫ్రా సాగులో రైతు అనుభవాలు.!
టమాటాలకు బాడీగార్డ్ లు
దేశవ్యాప్తంగా కూడా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే టమాటా కొండెక్కి కూర్చుంది. తాజాగా పచ్చిమిర్చి ధర చుక్కలను తాకుతోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు బాడీ గార్డ్ లు ఉండేవారు. ప్రస్తుతం టమాటా కి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో ఒక కూరగాయల వ్యాపారి తాను అమ్ముతున్న కూరగాయల షాప్ కి ఇద్దరు బాడీగార్డులను నియమించుకొని వార్తల్లోకి ఎక్కారు.
సహజంగా తన వద్ద కొనుగోలు చేసే టమాటాలను ఏరుకునే అవకాశం ఇవ్వకుండా బాడీగార్డ్ లను పెట్టి వారి ద్వారా కూరగాయలు కాపాడుకోవడం తో పాటు అమ్ముతున్నాడు. కొనుగోలుకు వచ్చే వారిని టమాటాలు ఏరుకోకుండా ఈబాడీ గార్డులే రక్షణగా నిలుస్తున్నారు. అలాగే ఓ రైతు కేవలం టమాటాలు అమ్మి కోటీశ్వరుడయ్యారు. దీనిని బట్టి టమాటాలకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
టమాటా ధర పెరుగుదలకు కారణాలు
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు కారణంగా టమోటా పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు వల్లన దిగుబడి తగ్గింది.. దీంతో టమోటా ల సరాఫరా గణనీయంగా తగ్గిపోయింది.. ఈ నష్టాల కారణంగా రైతులు సాగు ను తగ్గించారు. దీని కారణంగా హోల్ సేల్ మార్కెట్ లో టమాట ధరలు రెట్టింపయ్యాయి..దానితో పాటు వర్షాలు కూడా టమాటా ధరలు పెరగడానికి కారణం అయ్యాయి.. దీంతో గుజరాత్ మహారాష్ట్ర లో పంట దిగుబడి తగ్గిపోతుంది..
Also Read: Gasagasalu: ఈ పంట సాగు చెయ్యాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.!