జాతీయం

Gasagasalu: ఈ పంట సాగు చెయ్యాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.!

2
Gasagasalu Plant
Gasagasalu Plant

Gasagasalu: వంటలో వాడే గసగసాల పేరు అందరికి తెలిసి ఉంటుంది. గసగసాలను భారత దేశ వంటలో ఒక సుగంధ ద్రవ్యంగా వాడుతున్నారు. ఈ గసగసాలకి మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ పంటని సాగు చేయడానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పంట నుంచి వచ్చే ఒక ద్రవం ఎక్కువగా ఔషధాల్లో వాడుతారు. ఈ ద్రవం హెరాయిన్ మూలం కలిగి ఉండటంతో ప్రభుత్వ లైసెన్స్ ద్వారా మాత్రమే ఈ పంటని పండించాల్సి ఉంటుంది.

ఈ గసగసాల మొక్క ఒక మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కకి తెల్లటి పువ్వులు పూస్తాయి. పువ్వులు రాలిపోయాక వాటికి కాయలు వస్తాయి. ఈ కాయలు దానిమ్మల ఉన్నాయి. ఈ కాయలని డోడా, కాయ పై లేయర్ని పోషత్ అని పిలుస్తారు. ఈ పంటని ఎక్కువగా సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ నెల వరకు విత్తనాలు విత్తుకుంటారు.

విత్తనాలు పొలంలో విత్తుకునే ముందు పొలాన్ని బాగా దున్నుకోవాల్సి ఉంటుంది. ఈ గసగసాల పంటకి పొలాన్ని బాగా లోత్తుగా దున్నుకోవాల్సి ఉంటుంది. సాధారణ పంట పొలం పండించడానికి దున్నే లోత్తు కంటే 3-4 % ఎక్కువ లోత్తుగా దున్నాల్సి ఉంటుంది. పొలం దున్నడం పూర్తి అయ్యాక, పొలానికి ఎక్కువ మొత్తంలో నీళ్లు ఇవ్వాలి. తర్వాత కల్టివేటర్ ద్వారా పొలాన్ని 2-3 సార్లు దున్నుకోవాలి. తర్వాత రోటరీ టిల్లర్ ద్వారా పొలం మొత్తం సమానంగా చేసుకోవాలి.

Also Read: Essential Commodities: నిత్యావసర సరుకులు తక్కువ ధరకు పంపిణీ..

Gasagasalu

Gasagasalu

సమానంగా చేసుకున్న పొలంలో గోబర్ ఎరువులు లేదా వెర్మికంపోస్టు లేదా వానపాములను కలపాలి. లైసెన్స్ ఉన్న రైతులకి మాత్రమే ప్రభుత్వం నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా విత్తనాలని ఇస్తుంది. విత్తనాలని పొలంలో విత్తుకున్నాక పొలాన్ని దున్నుకోవాలి. 7-8 రోజులు నీటిని ప్రతి రోజు అందించాలి. మొలకగా వచ్చాక కూడా 15-20 రోజుల వరకు నీటిలో పొలాన్ని ఇవ్వాలి. ఈ పంటకి ఎక్కువ మొత్తం నీళ్లు అవసరం ఉంటుంది.

విత్తనాలు వేసిన 95-110 రోజులో పువ్వులు రావడం మొదలు అవుతుంది. పువ్వులు వచ్చిన 15 రోజులో కాయలు వస్తాయి. ఈ కాయలని ఒక ప్రత్యేకమైన బ్లేడ్ సహాయంతో గాట్లు పెట్టాలి. ఈ గాట్లు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చ్ మొదటి వారం వరకు మాత్రమే పెట్టాలి. కేవలం మధ్యాహ్నం 2 p.m నుంచి 4 p.m సమయంలో మాత్రమే గాట్లు పెట్టాలి. ఈ గట్టు నుంచి ఒక ద్రవం వస్తుంది. ఈ ద్రవం రాత్రి మొత్తం వస్తూనే ఉంటుంది. ఈ ద్రవాన్ని లాటిక్స్ లేదా నల్ల మందు అంటారు.

ఒక కాయ నుంచి 1.5 గ్రాముల లాటిక్స్ వస్తుంది. ఈ లాటిక్స్ తర్వాత రోజు ఉదయం 4 a.m నుంచి 5 a.m సమయంలోనే ఒక ప్రత్యేకమైన కత్తి ద్వారా సేకరిస్తారు. ఈ లాటిక్స్ సూర్యోదయం అవకముందే సేకరించాలి. లాటిక్స్ సేకరించి నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి అందించాలి. ఆ లాటిక్స్ బరువుని బట్టి రైతులకి డబ్బులు ఇస్తారు.

ఈ పంటని సాగు చేయాలి అనుకున్న రైతులు పంట విత్తనాల దశ నుంచి పంట పూర్తి అయేవరకు పొలంలో చెప్పులు లేకుండా తిరగాలి. ఈ పంటకి లైసెన్స్ మన దేశ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారు. రైతులు తీసుకున్న లైసెన్స్ ప్రతి 2-3 సంవత్సరాలకి రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్స్ ఇచ్చే ముందు ప్రభుత్వం కొన్ని కండిషన్స్ చెప్పి ఒక ఒప్పందం రాపించుకుంటుంది. రైతులు గసగసాల పంట సాగు ఎంత మొత్తంలో చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా ఒక కుంట భూమిని ఎక్కువ సాగు చేసిన లైసెన్స్ రద్దు చేసి, కఠినమైన శిక్షలు విదిస్తుంది.

ఎంత లాటిక్స్ కావాలి అనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 5.9 గ్రాముల లాటిక్స్ కావాలి అంటే రైతులు అంత పరిమాణంలో కచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఆ రైతు లైసెన్స్ రద్దు చేస్తుంది. కొన్ని సార్లు 2-4 గ్రాములు తేడా వచ్చిన ఏమి కాదు. పంట పూర్తి అయ్యాక లేదా దిగుబడి లేకపోతే పంటని తగలపెట్టాలి. తగల పెట్టున తర్వాతనే రైతులకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది.

ఒక హెక్టర్ పొలానికి 7-8 కిలోల విత్తనాలు విత్తుకోవాలి. ఒక కిలో విత్తనాలు 150-200 రూపాయలు ఉంటుంది. ఒక హెక్టర్ నుంచి 50-60 కిలోల లాటిక్స్ వస్తుంది. ఒక గ్రామ లాటిక్స్ 1800 రూపాయలుగా ప్రభుత్వం రైతులకి ఇస్తుంది. ఈ కాయల నుంచి గసగసాల గింజలు వస్తాయి. ఈ గసగసాలు ఒక క్వింటాల్ 1.5 లక్షల రూపాయల ధర మార్కెట్లో ఉంది. ఈ పంటని ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో సాగు చేస్తారు. ప్రపంచం మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్ 85% గసగసాల పంట సాగు చేస్తుంది. మన దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. ఈ పంట నుంచి రెండు రకాల ఆదాయంతో రైతులు ధనవంతులు అవుతున్నారు.

ఈ పంట నుంచి తీసిన లాటిక్స్ నుంచి మోకాళ్ళ నొప్పుల మందులు, షుగర్ వ్యాధి మందులు తయారు చేస్తారు. మైగ్రేన్ , తలనొప్పి వైద్యంలో వాడుతారు.

Also Read: Agricultural Marketing Problems: కొత్త పంటల మార్కెటింగ్లో రైతులు ఎదురుకుంటున్న సమస్యలు.!

Leave Your Comments

Essential Commodities: నిత్యావసర సరుకులు తక్కువ ధరకు పంపిణీ..

Previous article

Jafra Cultivation:పెట్టుబడి తక్కువ, నికర ఆదాయం.. జాఫ్రా సాగులో రైతు అనుభవాలు.!

Next article

You may also like