గుడ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. గుడ్లను ప్రతిరోజూ మితంగా తినాలని లేకపోతే అనర్ధాలు తప్పవంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే రోజుకు మూడు గుడ్లు తినవచ్చనేది వైద్య నిపుణుల వాదన. గుడ్డు తినడం వల్ల కండరాల ఫిట్ నెస్ పెరుగుతుందని పేర్కొంటున్నారు. గుడ్లు మీ రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. దీంతోపాటు బరువును తగ్గించడంలో చాలా ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున ప్రతిరోజూ మూడు గుడ్లు తింటే బలంగా ధృడంగా తయారు కావొచ్చని పలు రోగాల నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
గుడ్లలో విటమిన్ – డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా తయారు చేస్తుంది. అందుకే గుడ్లను ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటిగా పరిగణిస్తారు. గుడ్లలో కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ – ఎ, విటమిన్ – ఇ, విటమిన్ – కె, విటమిన్ – బి6 వంటి పోషకాలు వున్నాయి. రోజుకు మూడు గుడ్లు తింటే మీ ఆరోగ్యానికి చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ తింటే అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని ఇది పరిశోధనలో వెల్లడైందని పేర్కొంటున్నారు. కావున ఈ రోజు నుంచే మీరు కూడా ఆహారంలో మూడు గుడ్లు మేలని అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఎల్ డి ఎల్ బ్లడ్ కొలెస్ట్రాల్ తో పోలిస్తే గుడ్లు శరీరానికి మరింత శక్తినిచ్చే పోషకాలని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్లలో ట్రిప్టోఫాన్, టైరోసిన్ ఉంటాయి. అదనంగా గుడ్లలో అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. కావున ఇవి గుండె జబ్బుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
గుడ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments