జాతీయం

Essential Commodities: నిత్యావసర సరుకులు తక్కువ ధరకు పంపిణీ..

2
Essential Commodities
Essential Commodities Distribution

Essential Commodities: జులై నెల మొదటి వారం నుంచి నిత్యావసర సరుకుల ధరలు అని పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు వీటిని కొన్నడం చాలా భారంగా మారుతుంది. ఈ ధరలని అదుపులోకి పెట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ వాళ్ళు సామాన్య ప్రజలకు తక్కవ ధరకు నిత్యావసర సరుకులు అందించాలి అని అనుకుంటున్నారు.

ఇందులో బియ్యం, కందిపప్పు మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరకి అందించాలి అని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గారు తెలిపారు. వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో తక్కువ ధరకి నిత్యావసరాలు అమ్మాలి అని పౌరసరఫరాల శాఖ మంత్రి తెలిపారు. వ్యాపారులు కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకున్న సరుకులని ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలని చెప్పారు.

Also Read: Agricultural Marketing Problems: కొత్త పంటల మార్కెటింగ్లో రైతులు ఎదురుకుంటున్న సమస్యలు.!

Essential Commodities

Essential Commodities

నమోదు చేయడానికి ఈ వెబ్‌ సైట్‌ https://fcain foweb.nic.in/psp ని ఉపయోగించండి. నమోదు చేసుకున్న వస్తువులను ప్రత్యేక కౌంటర్ల ద్వారా సామాన్యులకి అందిస్తారు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ మినహాయింపుతో 24, 26 కిలోల ప్యాకింగ్‌ చేసి వస్తువులను అమ్ముతున్నారు. వినియోగదారుల నుంచి పన్నుతో కలిపి ధరను వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి, సరుకు నిల్వలు లేకపోవడం, ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి సరుకులను కొనుగోలు చేయడంతో ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఆఫ్రికా దేశం నుంచి కందుల దిగుమతి తగ్గింది. బీపీటీ, సోనా మసూరి బియ్యాన్ని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర వ్యాపారులు కొనుగోలు చేయడం కూడా ధరలు పెరగడానికి కారణం.

Also Read: Lantana Camara Health Benefits: అత్త కోడళ్ల చెట్టు… ఈ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి…

Leave Your Comments

Agricultural Marketing Problems: కొత్త పంటల మార్కెటింగ్లో రైతులు ఎదురుకుంటున్న సమస్యలు.!

Previous article

Gasagasalu: ఈ పంట సాగు చెయ్యాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.!

Next article

You may also like