రైతులు

Agricultural Marketing Problems: కొత్త పంటల మార్కెటింగ్లో రైతులు ఎదురుకుంటున్న సమస్యలు.!

2
Agricultural Market
Agriculture

Agricultural Marketing Problems: రైతులు ఈ మధ్య కాలంలో బ్లాక్ రైస్ ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇంటర్నెట్లో ఈ పంట గురించి తెలుసుకొని మరి కొంత మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. కొత్త పంటలు పండించి వాటిని ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులని మహబూబ్ నగర్ జిల్లా, స్టేషన్ గొల్లపల్లి గ్రామంలో శ్రీశైలం రైతు పండించిన పంటని మార్కెటింగ్ చేయలేక ధాన్యాలు పండించకుండా ఇప్పుడు వాణిజ్య పంటలు పండిస్తున్నారు.

శ్రీశైలం రైతు గత రెండు, మూడు సంవత్సరాలు బ్లాక్ రైస్, రక్తశాలి, నవరా, చిట్టి ముత్యాలు వంటి పంటలు పండించారు. ఈ పంటలని మొత్తం సేంద్రియ పద్దతిలో పండించారు. ఈ పంటలకి గోవు అమృతం, ఆవు పేడ ఎరువులు మాత్రమే వేసి పండించారు. మొదటి సంవత్సరంలో దిగుబడి అంతగా రాలేదు. రెండో సంవత్సరం నుంచి దిగుబడి పెరిగింది.

ఈ నాలుగు రకాల ధాన్యాన్ని 15 నుంచి 20 ఎకరాలు సాగు చేశారు. మొదటి సంవత్సరంలో సేంద్రియ ఎరువులు వాడిన దిగుబడి ఎక్కువ రాకపోవడంతో పెరుగు మజ్జిగల మర్చి పంటకి పిచికారీ చేశారు. మజ్జిగ పిచికారీ చేయడం వల్ల కూడా దిగుబడి పెరిగింది. కానీ ఒక ఎకరంలో కేవలం 7 క్వింటాల దిగుబడి మాత్రమే వచ్చింది.

Also Read: Drum Seeder: డ్రమ్‌ సీడర్‌ సాగు ఎంతో మేలు…

Agricultural Marketing Problems

Agricultural Marketing Problems

పండించిన పంటకి మార్కెట్లో మంచి ధర ఉన్న కూడా గ్రామంలో ఉండటం వల్ల పంట ఎగుమతి చేయడానికి ఇబ్బంది. ఈ బ్లాక్ రైస్, రక్తశాలి, నవరా, చిట్టి ముత్యాలు కొనుగోలు చేసే వాళ్ళు కూడా 5-6 కిలోలు మాత్రమే అడుగుతున్నారు. ఇంత తక్కువ ఎగుమతి చేయడం కూడా రైతులకి కూడా ఇబ్బంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే రైతు శ్రీశైలం గారు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పంటలకి ఎక్కువ డిమాండ్ మహారాష్ట్ర, కర్ణాటక, ముంబయి ప్రాంతాల్లో ఉంది.

పండించిన పంటకి మార్కెటింగ్ చేసుకోలేక, పెట్టిన పెట్టుబడి మాత్రమే రావడంతో ఈ సంవత్సరం వాణిజ్య పంటలో పత్తి పంట సాగు చేస్తున్నారు. పత్తి వంటి పంటలను పండిస్తే మార్కెట్లో అమ్ముకోవడం కూడా చాలా సులువు. అందుకని ఇంటి అవసరాల వరకు మాత్రమే బ్లాక్ రైస్, రక్తశాలి, నవరా, చిట్టి ముత్యాల పంటలు పండిస్తున్నారు. ఈ పంటల గురించి ఇంకా సమాచారం కోసం లేదా పంట కొనుగోలు చేయడానికి 9502624662 నెంబర్ సంప్రదించండి.

Also Read: Lantana Camara Health Benefits: అత్త కోడళ్ల చెట్టు… ఈ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి…

Leave Your Comments

Drum Seeder: డ్రమ్‌ సీడర్‌ సాగు ఎంతో మేలు…

Previous article

Essential Commodities: నిత్యావసర సరుకులు తక్కువ ధరకు పంపిణీ..

Next article

You may also like