Lantana Camara Health Benefits: ప్రకృతిలో అనేక చెట్లు ఉన్న వాటి ఉపయోగాలు మనకి తెలియదు. పిచ్చి చెట్లు అనుకునేవి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆ చెట్లు మన ఆయుర్వేద ఔషధాల్లో వాడుతారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్లలో తలంబ్రాల చెట్టు ఒకటి. ఈ చెట్టుని అత్త కోడళ్ల చెట్టు లేదా లాంటానా కెమెరా అని కూడా పిలుస్తారు. ఈ మొక్క వేర్బెనసీఏ అనే జాతికి చెందింది. ఇప్పటి వరకు ఈ చెట్టు గురించి ఎవరికి తెలియదు. కానీ ఈ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ చెట్టు ఎలాంటి మట్టిలో అయిన పెరుగుతుంది. కానీ ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాల్లో దీని పెరుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రలో ఈ చెట్టు బాగా పెరుగుతుంది. తలంబ్రాల చెట్టు సంవత్సరం మొత్తం పెరుగుతూనే ఉంటుంది. ఈ చెట్టు ఆకులు, పువ్వలు, కొమ్మలు అని ఆయుర్వేదంలో వాడుతారు.
ఈ తలంబ్రాల చెట్టు ఆకులని చికెన్ పాక్స్, కుష్టి, ఉబ్బసం తగ్గించడానికి వాడుతారు. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఆకుని లేపనంగా తయారు చేసుకొని వాడితే తొందరగా తగ్గుతుంది. ఈ చెట్టులో యాంటీ మైక్రోబియల్, యాంటిసెప్టిక్ థర్మల్ ఉండటం ద్వారా వ్యాధులని తొందరగా తగ్గిస్తుంది. చర్మం పై దెబ్బలు తగ్గడానికి కూడా వీటి ఆకులని వాడుతారు.
Also Read: Ashwagandha: ఒత్తిడి మరియు టెన్షన్ ను తగ్గించే అతి గొప్ప ఔషధం – అశ్వగంధ
పాము కాటు లేదా అదైన విష కీటకాలు కుట్టిన ఈ తలంబ్రాల చెట్టు ఆకుల రసం ఆ చోట రాస్తే విషాన్ని తొందరగా శరీరంలోకి వెళ్లనివ్వదు. మోకాళ్ల నొప్పులకు ఈ ఆకులని కట్టుగా కడితే నొప్పులు తొందరగా తగ్గుతాయి. ఈ ఆకుల ఆవిరి రోజు వేసుకుంటే ఊపిరితితుల జబ్బులు నివారించుకోవచ్చు.
ఈ చెట్టు ఆకులని ఎండపెట్టి పొగగా వేస్తే దోమలని నివారించవచ్చు. ఈ తలంబ్రాల చెట్టు ఆకులని కషాయంగా తయారు చేసి మట్టిలో హాని కీటకాలని తొలగిస్తుంది. ఈ చెట్టు వల్ల మనుషులకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ చెట్లని మేకలు, ఆవులు లేదా ఇతర పశులవులు ఎక్కువ మొత్తంలో తింటే వాటి ప్రాణానికి హరికరం.
Also Read: Hibiscus Benefits: జుట్టు కు మంచిదని తెలిసిన ఒక ఆకు, ఒక పువ్వు – మందారం