Ashwagandha: ప్రకృతి అనేక రకాలతో ఆహారాల తో పాటు , చక్కటి ఔషధాలను కూడా ప్రసాదించినది. అశ్వగంధ అనే దాన్ని చాలా మంది చాలా రకాలుగా ఉపయోగిస్తారు. అశ్వగంధ పొడి స్ట్రెస్ ని నాచురల్ గా తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో బాగా కనిపించే సమస్య. ప్రతి దానికి టెన్షన్, ఒత్తిడి కి గురవుతున్నారు. ఈ రోజుల్లో వయసులో ఉన్న వారి దగ్గర నుండి ముసలి వారి వరకు ఎవరిని తీసుకున్న స్ట్రెస్,స్ట్రెస్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పని యొక్క ఒత్తిడిని తట్టుకోవాటానికి, మన మైండ్ ని బ్యాలన్స్ చేసుకొని, వాటి నుండి మన మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ తెలియక చిన్న విషయానికి కూడ స్ట్రెస్ కి లోనవుతాము.
వైరస్ ఇన్ఫెక్షన్ నుండి తప్పించుకోవడానికి చాలా మంది 2,3 వాక్సిన్స్ తీసుకునే ఉంటారు. యాంటి బాడీస్ వాక్సిన్ తీసుకోవడం వలన బాగా పెరిగి , ఆ వైరస్ బారి నుండి మన శరీరంను రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. కొందరిలో వాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ యాంటి బాడీస్ తక్కువగా పెరగవచ్చు.యాంటి బాడీస్ తక్కువగా తాయారు కావాటనికి మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం.అశ్వగంధ 9-10 రకాల కెమికల్స్ ని కలిగి ఉంది. ఇవన్ని యాంటిస్ట్రెస్ హెర్బ్ గా ఉపయోగపడుతున్నాయి.స్ట్రెస్ ని రెండు రకాలుగా తగ్గించడానికి అశ్వగంధ ఎంతగానో ఉపయగపడుతోంది. .2 రకాలు గా స్ట్రెస్ ని తగ్గిస్తుంది.
Also Read: Hibiscus Benefits: జుట్టు కు మంచిదని తెలిసిన ఒక ఆకు, ఒక పువ్వు – మందారం
మొట్టమొదటిగా మన శరీరంలో స్ట్రెస్ పెరగడానికి కారణమయ్యే కార్టిసొల్, అలాగే స్ట్రెస్ ని ట్రాన్ఫర్ చేసే కొన్ని రకాల ప్రోటీన్స్ ని ఈ అశ్వగంధ తగ్గిస్తుంది . స్ట్రెస్ కి కారణమయ్యే ప్రోటీన్స్ హీట్ షాక్ ప్రోటీన్ మరియు జె ఎన్ కె ప్రోటీన్ . ఇవి స్ట్రెస్ పెరగడానికి, స్ట్రెస్ ట్రాన్స్ఫర్ కి కారణమవుతున్నాయి. ఈ అశ్వగంధ లో ఉండే కెమికల్ కాంపౌండ్ ప్రోటీన్ ని కంట్రోల్ చేసి స్ట్రెస్ పెరగకుండా ఉండేలా చేసి, దీని ద్వారా నరాలను ఆక్టివెట్ చేసి మనలో ఉత్సాహనికి, నరాలకు ఉత్సాహన్ని ఇచ్చి మనం ఆక్టివ్ గా ఉండేలా చేస్తుంది. స్ట్రెస్ ని తగ్గించడం అలాగే నరాలకు ఆక్టివ్ చేయడం ఇది మొదటిది.
ఇక పోతే రెండవ ఉపయోగం మన శరీరంలో HPA యాక్సిస్ ఆక్టివిటి ని అశ్వగంధ తగ్గిస్తుంది. ఈ గ్రంథుల ఆక్టివిటి ని తగ్గించి స్ట్రెస్ ని నియంత్రిస్తుంది. కాబట్టి మానసిక ఒత్తిడికి గురయ్యే వారు ఈ అశ్వగంధ ను వాడొచ్చు. అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని పిలుస్తారు. మగవారిలో స్పర్మ్స్ కౌంట్ పెరగటానికి కూడా ఈ అశ్వగంధ ఎంతగానో ఉపయగపడుతోంది.
100 గ్రాముల అశ్వగంధలో ఉండే పోషకాలు: కార్బోహైడ్రేట్: 46.9 గ్రాములు,ప్రోటీన్: 3.7 గ్రాములు,శక్తి: 277 క్యాలరీస్, కొవ్వు: 0.3 గ్రాములు, సోడియమ్: 0.2 గ్రాములు.
వాడే విధానం:
ఒక టేబుల్ స్పూన్ అంటే 10-15 గ్రాములు పాలలో కలుపుకొని త్రాగవచ్చు. గోరు వెచ్చని నీళ్ళల్లో కలుపుకొని త్రాగవచ్చు. రోజుకి రెండు సార్లు తాగాలి. ఉదయం ఒకసారి అలాగే సాయంత్రం ఒకసారి.ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని , స్ట్రెస్ ని తగ్గించే పకృతి సిద్ధమైన మెడిసిన్.
Also Read: Composting At Home: వంటింటి వ్యర్థాలతో విలువైన సంపద – ఇంట్లోనే నాణ్యమైన కంపోస్ట్ తయారీ