Hibiscus Benefits: అందరికీ దేవుడి కోసం పూజ దగ్గర పెట్టే మందార పువ్వులు గురించి తెలుసు.మందార పువ్వులు చూడటానికి ఆక్షణీయంగా ఉండటమే కాకుండా జుట్టు ఊడకుండా, జుట్టు సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యంగానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం చుండ్రు అని చెప్పవచ్చు మందారలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఇది చుండ్రును తగ్గిస్తుంది. అందువల్ల మందారం చుండ్రు వంటి సమస్యలు తగ్గిస్తుంది.మందార పువ్వులు,ఆకులు రెండు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. మందార పువ్వులు,మందార ఆకులు వలన జుట్టు కు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
మందార పువ్వుల వలన జుట్టు కు కలిగే ప్రయోజనాలు :
హెయిర్ ఫోలికల్ రెస్ట్ ఎక్కువ తీసుకోకుండా , ఊడిపోయిన స్థానంలో క్రొత్త వెంట్రుకలను త్వరగా ఉత్త్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పువ్వులు ముఖ్యంగా మూత్రం సాఫీగా అవ్వటానికి ఉపయోగిస్తారు.
మందార ఆకులు వలన జుట్టు కు కలిగే ప్రయోజనాలు :
మన జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రొటిన్ . ఈ మందార ఆకులు కెరాటిన్ అనే ప్రొటిన్ ఉత్పత్తి కి అద్భుతంగా పనికి వస్తాయి. అందుకే జుట్టు పెరుగుదలకు ఈ మందార ఆకులు బాగా సహాయపడతాయి.
Also Read: Composting At Home: వంటింటి వ్యర్థాలతో విలువైన సంపద – ఇంట్లోనే నాణ్యమైన కంపోస్ట్ తయారీ
వాడే విధానం:
1) మందార పువ్వులు గ్రైండ్ చేసుకొని, కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని జుట్టు కి పట్టించి ఒక 20 – 25 నిమిషాలు ఉంచుకొని జుట్టును వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మందార పువ్వులలో వుండే మెడిసినల్ ప్రోపార్టీస్ వలన జుట్టు నల్లగా, ఒత్తుగా, మృదువుగా పెరుగుతుంది. అలాగే జుట్టు ఊడకుండా, ఊడిన జుట్టు మళ్ళీ రావడానికి ఈ పద్దతి ఉపయోగపడుతుంది.
2) అలాగే దేవుడి దగ్గర పెట్టే పూలు వాడిన తర్వాత పడేయకుండా ఎండబెట్టి వాటిని పొడి చేసి జుట్టు కు ఉపయోగించవచ్చు.
3) 8-10 మందార పువ్వులు, 8- 10 మందార ఆకులు తీసుకొని వాటిని పెస్ట్ చేయాలి. ఇలోపు స్టౌవ్ మీద కొంచెం కొబ్బరి నూనె వేడి చేసుకోండి. ఈ మందార పువ్వులు,ఆకుల మిశ్రమాన్ని ఆ నూనెలో వేసి 2-3 నిమిషాలు మరిగించాలి. తరువాత ఫిల్టర్ చేసి వచ్చిన తైలాన్ని జుట్టుకు పట్టించి 10 నిమిషాలు మర్ధన చేసుకోని అరగంట ఉంచి జుట్టు వాష్ చేసుకోండి.మందార పువ్వులు, ఆకులలో వుండే మెడిసినల్ ప్రోపార్టీస్ అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి , జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, ఊడకుండా ఉండటానికి , జుట్టు విరిగి పోకుండా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుంది.
4) మందార ఆకులు పెస్ట్ చేసుకోని జుట్టుకు పట్టించి, ఒక అరగటసేపు ఉంచి తరువాత జుట్టు వాష్ చేసుకోవాలి.
ఇలా చేయటం వలన మందార పువ్వులలో,ఆకులలో వుండే మెడిసినల్ ప్రోపార్టీస్ వలన జుట్టు నల్లగా, ఒత్తుగా, మృదువుగా పెరుగుతుంది. అలాగే జుట్టు ఊడకుండా, ఊడిన జుట్టు మళ్ళీ రావడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
Also Read: Turmeric Crop Processing: పసుపు పంటని ఎలా ప్రాసెస్ చేయాలి..