ఆంధ్రప్రదేశ్

AP Speaker Tammineni Seetharam: పంటకు గరిష్ట మద్దతు ధర అందిస్తున్నది వైసీపీ సర్కార్ లోనే.!

2
AP Speaker Tammineni Seetharam
AP Speaker Tammineni Seetharam

AP Speaker Tammineni Seetharam: పంట ఉత్పాదకాలను పెంచేందుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రాథమిక రంగంగా గుర్తించబడే వ్యవసాయ రంగానికి పెద్ద పేట వేసేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు..వ్యవసాయ భూములు సంబంధించి యాజమాన్య హక్కులు పక్కాగా నిర్ధారించేలా ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వం అంతిమ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలస గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని,రూ. 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని స్పీకర్ ప్రారంభించారు.

AP Farmers

Ap Farmers

రైతన్నల కళ్లల్లో ఆనందం

పండించిన పంటకు గరిష్ట మద్దతు ధర అందించి, రైతన్నల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సేద్యం పట్ల రైతుల్లో ఆసక్తి కలిగించేలా చేయగలిగినట్టు తెలిపారు. ఖరీఫ్,రబీ సీజన్లో రైతులు పూర్తిగా సాగుకు సమాయత్తం అవుతున్నారంటే, రైతు భరోసా కేంద్రాలు.. రైతులను చైతన్యవంతులను చేయటం ద్వారా సాధ్యం అయ్యిందన్నారు. విత్తనాలు వేసిన నాటి నుండి, ఆధునిక సేద్యం చేయటంలో రైతులకు వీటి ద్వారా సహకారం మరువలేనిదన్నారు. విత్తనాల సరఫరా, సబ్సిడీతో కూడిన ఎరువులు ఆర్ బి కే ల ద్వారా రైతులకు అందజేయడం జరిగిందన్నారు.

Also Read: Laser Weeding Robot: గంటకు రెండు లక్షల కలుపు మొక్కలను తీసేస్తున్న లేజర్ గన్.!

AP CM Jagan

AP CM Jagan

పంటలను కూడా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి, మేలైన మద్దతు ధర వచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ప్రధాన భూమిక వహిస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యe వ్యవసాయ సాగుకు ప్రతనుకూల పరిస్థితుల నుండి సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేలా సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్న ఘనత వైయస్సార్ దేనని అన్నారు. తండ్రి నుండి తనయుడి వరకు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిన విషయం మరువరాదన్నారు. గ్రామంలో సచివాలయం ద్వారా అందుతున్న సేవలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు.స‌చివాల‌యం ద్వారా క‌ల్పిస్తున్న సేవ‌ల‌ను గ్రామ‌స్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అన్నారు. స‌చివాల‌య సిబ్బందికి గ్రామ ప్రజ‌లు పూర్తిగా స‌హ‌క‌రించి వారు కోరిన స‌మాచారం అందించాల‌న్నారు.

AP Speaker Tammineni Seetharam

AP Speaker Tammineni Seetharam

మ‌ధ్య‌వ‌ర్తుల‌కు తావులేకుండా మద్దతుధర

స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్లు ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేలా సేవలందించాలన్నారు. వారు ప్రభుత్వానికి క‌ళ్లు, చెవులు వంటి వార‌ని పేర్కొన్నారు. ఎలాంటి అవినీతికి, మ‌ధ్య‌వ‌ర్తుల‌కు తావులేకుండా ముఖ్యమంత్రి జ‌గ‌న్ నేతృత్వంలోని ప్రభుత్వం నేరుగా ల‌బ్దిదారులకే ప‌థ‌కాల సొమ్మును అంద‌జేస్తుంద‌ని, గ‌త ప్రభుత్వానికి, ఈప్రభుత్వానికి ప‌థ‌కాల అమ‌లులో గ‌ల తేడాను ప్రజ‌లు గుర్తించాల‌ని స్పీకర్ కోరారు. ప్రభుత్వ సేవలు గ్రామాల్లో విరివిగా అందుతున్నాయి అంటే,, అది గ్రామ సచివాలయాలు స్థాపన ద్వారా సాధ్య పడిందన్నారు.గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా లభిస్తున్నాయన్నారు.

Also Read: Trellis Method of Dragon: ట్రెల్లీస్ పద్దతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు

Leave Your Comments

Laser Weeding Robot: గంటకు రెండు లక్షల కలుపు మొక్కలను తీసేస్తున్న లేజర్ గన్.!

Previous article

Umran Regi Pandu: లాభాలు కురిపిస్తున్న ఉమ్రాన్ రేగు పండు సాగు

Next article

You may also like