Trellis Method of Dragon: డ్రాగన్ ఫ్రూట్ మంచి పోషకాలు ఉన్న పండు. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే. ఇటీవలి కాలంలో డ్రాగన్ ఫ్రూట్ కొనే వారి సంఖ్య పెరిగింది. మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యం లో పండ్లకు ప్రాధాన్యత పెరుగుతుంది.ఆరోగ్య పరమైన లాభాల కోసం అనేక క్రొత్త రకాల పండ్ల తోటలు తెలుగు రాష్ట్రాలలో సాగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎక్కువగా సాగులో వున్న డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు . ఒకప్పుడు పండ్ల తోటలు అంటే మామిడి,జామ, ద్రాక్ష, బత్తాయి మాత్రమే కాని ఇప్పుడు విదేశీ పండ్లను సైతం అలవాటుగా పండిస్తున్నారు. ఎవరి క్షేత్రాలలో చూసిన ఎదో ఒక విదేశీ పండు ఉంటుంది.పెట్టుబడి ఎక్కువే అయినా రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు కి మొగ్గు చూపుతున్నారు.పెట్టుబడి చేతికి రావాలంటే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. కాని 2 సంవత్సరాలలోనే పెట్టుబడి తీసుకునేందుకు సాగులో క్రొత్త క్రొత్త పద్ధతులున్నాయి. ఆ పద్ధతులలో ఒకటే ట్రెల్లీస్ పద్దతి.
ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండేది. కిలో 300 రూపాయలు దాకా పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగును చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరంలోనో, అరేకరంలోనో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు కనిపిస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు పెట్టుబడి ఎక్కువే అయినా నాటిన 25 – 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. దింతో రైతులు సాగుకు మొగ్గు చూపారు. దిగుబడి పెరిగింది.మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కిలో ధర 100-200 పలుకుతోంది. కాని ఆన్ సీజన్ లో సాగు చేస్తే కిలో ధర 300 వరకు పలికే అవకాశం కలదు.
డ్రాగన్ ఫ్రూట్ రకాలు :
1) అమెరికన్ బ్యూటీ
2) తైవాన్ పింక్
3) సీయం రెడ్
4) మొరాకిన్ రెడ్
5) కొలంబియానా
6) డార్క్ స్టార్
7) డిలైట్
8) యెల్లో థాయ్
9) షుగర్ డ్రాగన్
10) లిసా
సాధారణ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఒక ఎకరాకు 2000 మొక్కలు పడతాయి. కాని ట్రెల్లీస్ పద్దతిలో ఒక ఎకరాకు 3000 మొక్కలు పెట్టుకోవచ్చు, 4000 మొక్కలు పెట్టుకోవచ్చు, 5000 మొక్కలు పెట్టుకోవచ్చు, ట్రెల్లీస్ పద్దతి – అల్ట్రా హై డెన్సిటీ విధానంలో 6000 మొక్కలు పెట్టుకోవచ్చు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కొంత మంది రైతులు హై డెన్సిటీ విధానంలో ఒక ఎకరాకు 8000 మొక్కలు పెట్టి కూడా సాగు చేస్తున్నారు.
Also Read: Raising Rabbits at Home: ఇంట్లోనే కుందేళ్ల పెంపకంతో లాభాలు
ఒక ఎకరాకు 3000 మొక్కలు పెట్టినచో, నాటిన మొదటి సంవత్సరం నుండే దిగుబడి వస్తది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొదటి సంవత్సరంలో ఒక ఎకరాకు 1.5 – 3.0 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు. రెండోవ సంవత్సరంలో ఒక ఎకరాకు 5-6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు. మూడోవ సంవత్సరంలో ఒక ఎకరాకు 8-10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు. ఇలా సంవత్సరం, సంవత్సరం పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుంది.కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర 100-200 రూపాయలు ఉంటది. ఆన్ సీజన్ లో అయితే కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర 300 రూపాయలు ఉంటది.మూడోవ సంవత్సరంలో ఒక ఎకరాకు 8-10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు కాబట్టి మార్కెట్ ధర 100 రూపాయలు ఉన్నా ఒక ఎకరాకు 10 టన్నులు అయితే అక్షరాల 10 లక్షల రూపాయలు వరకు ఆదాయం ఉంటది.
డ్రాగన్ ఫ్రూట్ ఎడారి మొక్క కాబట్టి నీటి అవసరం తక్కువ. డ్రిప్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఉండాలి. వారానికి ఒకసారి ఒక గంట సేపు నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఎండాకాలం కూడా నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు. ఆన్ సీజన్ లో మొక్కకు కావలసిన 14 వెలుతురు కోసం లైట్స్ పెట్టీ డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేయాలి.ఆన్ సీజన్ లో కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర 300 రూపాయలు ఉంటుంది. విద్యుత్ బల్బులకు ఒక ఎకరాకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది.ఎకరాకు 500 బల్బులు అవసరం. 4 మొక్కలకు ఒక బల్బ్ పెట్టాలి. రోజుకు 4 గంటలు లైటింగ్ ఇస్తే సరిపోతుంది. కరెంటు బిల్లు ఎకరాకు 10,000 వరకు వస్తుంది.
ట్రెల్లీస్ పద్దతి – అల్ట్రా హై డెన్సిటీ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు :
అల్ట్రా హై డెన్సిటీ అంటే ఎకరాకు 2000 వేల మొక్కలు పెట్టిన చోట 6000 వేల మొక్కలు నాటడం. సాధారణ పద్ధతిలో మొదటి ఏడాది 2 టన్నుల దిగుబడి వస్తే ఈ పద్ధతిలో 5-6 టన్నుల దిగుబడి వస్తుంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా 2 సవంత్సరాలలో చేతికి వస్తుంది.ఆ తరువాత వచ్చేది మొత్తం నికర ఆదాయమే.ఎకరాకు 8-10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.సాధారణ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఒక ఎకరాకు 2000 మొక్కలు పడతాయి. కాని ట్రెల్లిస్ పద్దతిలో 3000 మొక్కలు పెట్టుకోవచ్చు, 4000 మొక్కలు పెట్టుకోవచ్చు, 5000 మొక్కలు పెట్టుకోవచ్చు, ట్రెల్లీస్ పద్దతి – అల్ట్రా హై డెన్సిటీ విధానంలో 6000 మొక్కలు పెట్టుకోవచ్చు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కొంత మంది రైతులు హై డెన్సిటీ విధానంలో ఒక ఎకరాకు 8000 మొక్కలు పెట్టి కూడా సాగు చేస్తున్నారు.
ఒక ఎకరాకు అల్ట్రా హై డెన్సిటీ విధానంలో 6000 మొక్కలు పెట్టినచో, మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొదటి సంవత్సరంలో ఒక ఎకరాకు 5-6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు. రెండోవ సంవత్సరంలో ఒక ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు. రెండు సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.మూడోవ సంవత్సరంలో ఒక ఎకరాకు 18 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం కలదు.
ఈ పద్ధతిలో 250 స్థంబాలు 10 అడుగులవి, 250 స్థంబాలు 6 అడుగులవి ఒక ఎకరా డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అవసరం. మల్చింగ్, డ్రిప్ విధానం పాటించి మొక్కలు నాటుకోవాలి. మధ్యలో వున్న ఖాళీ ప్రదేశం లో అంతర పంటలు కూడా కూరగాయలు లాంటివి సాగు చేసుకోవచ్చు. ఏప్రిల్ నుండి సీజన్ స్టార్ అవుతుంది, నవంబర్ వరకు ఫ్రూట్ ఇస్తది.
Also Read: Chilli Nursery Management: మిర్చి నారును ఏ నెలలో పోసుకుంటే ఆధిక దిగుబడులు వస్తాయి.!