వార్తలు

అరవై ఏళ్ల వయస్సులో సేంద్రియ పద్ధతిలో టొమాటోలను సాగు చేస్తున్న కనక్ లత..

0

చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే మక్కువ లతకు. అయితే పెళ్లి, పిల్లల బాధ్యతలతో సమయం గడిచిపోయింది. బిడ్డలంతా జీవితంలో స్థిరపడ్డాక అరవై ఏళ్ల వయస్సులో వ్యవసాయం చేయడానికి నడుము కట్టింది. ఉన్న కొద్ది డబ్బుతో పొలం కొని సేంద్రియ పద్ధతిలో టొమాటోలను సాగు చేస్తూ లాభాలు గడిస్తోంది. ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కనక్ లత. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తోన్న ఆమె స్ఫూర్తి కథనమిది. విఠల్ పూర్ కు చెందిన కనక్ లత వాసుదేవ్ పాండే కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే వారు. 2017లో పదవీ విరమణ పొందడంతో దంపతులిద్దరూ కొన్నాళ్లపాటు ఆమెరికాలోని కొడుకు వద్దకు వెళ్లారు. పుట్టిన ఊరుపై మమకారంతో రెండేళ్లకే అక్కడి నుంచి వచ్చి సొంతూళ్లో స్థిరపడ్డారు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక కనక్ లత వ్యవసాయం చేయాలనుకుంది. అలా తన వద్ద ఉన్న నగదుతో ఒకటిన్నర ఎకరం భూమిని కొనుగోలు చేసి సేద్యానికి సిద్ధమైంది. రుణం తీసుకుని వ్యవసాయ కుంటుంబం నుంచి ఆమెకు సేద్యం చేయాలనే ఆసక్తి ఉండటంతో ఆ దిశగా అడుగులేసింది. మొదట్లో గోధుమ, టొమాటోలు పండించారు. అయితే మొదటి పంటలోనే నష్టాలు వాళ్లని వెక్కిరించాయి. ఇక్కడ కూరగాయలు పండించే బదులుగా పొలాన్ని ఎండబెట్టుకోవడం నయమన్నారు స్థానిక రైతన్నలు. వచ్చిన నష్టంతో చేతిలో ఉన్న నగదు కూడా అయిపొయింది. దాంతో ఒత్తిడికి గురయ్యారు. ఎలాగైనా ఇదే భూమిలో పంట పండించి అందరికీ చూపించాలనే పట్టుదల వచ్చింది. ఏదైనా కొత్తరకం వంగడాన్ని ఈ సారి ప్రయత్నించాలనుకున్నారు. ఆ దిశగా నాబార్డు ఆధ్వర్యంలో పనిచేసే ఓ సేంద్రియ వ్యవసాయ విభాగంలో శిక్షణ తీసుకున్నా మార్కెట్లో పేరున్న “దుర్గ్”, “ఆర్యామన్” రకాల టమాటో విత్తనాలు నాటారు. పులుసు తక్కువ, రసం ఎక్కువగా వుండే ఈ టొమాటోల దిగుబడి కూడా చాలా బాగుంది. అంతేకాదు, తొక్క దళసరిగా ఉండి, ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఈ రెండేళ్లలో పంట దిగుబడితోపాటు విక్రయాల్లోనూ లాభాలు వస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత లండన్, ఎమన్ దేశాలకూ వీటిని ఎగుమతి చేస్తున్నా అని చెబుతున్నారు లత.
రోజుకు ఏడు టన్నులు కనక్ లత పొలంలో రోజూ దాదాపు ఒక్కక్కదానిలో 25 కేజీల టొమాటోలు పడతాయి. అలా ఏడు టన్నులను పండిస్తోంది. ఖర్చులన్నీ పోగా నెలకు రెండున్నర లక్షల రూపాయల లాభం పొందుతోంది. దీంతో ఇరుగుపొరుగు రైతులు సేద్యంలో ఆమె సూచనలను పాటిస్తూ, అతి తక్కువ నీటిని ఉపయోగించి సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు. తోటి రైతులకు వ్యవసాయమేలా చేయాలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిన ఈమె ఇప్పుడు క్యాప్సికం, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూప్ట్స్ ను పండించడానికి శిక్షణ తీసుకొంటోంది. నూతన సాంకేతికతను వినియోగించి కనక్ లత చేస్తున్న వ్యవసాయాన్ని పులువురు ప్రముఖులు సందర్శించడమే కాదు, ప్రశంసలను కురిపిస్తున్నారు.

Leave Your Comments

తాటిముంజుల ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాలు..

Next article

You may also like