ఉద్యానశోభ

ఆకుకూరల సాగు విధానం..

0

ఆకుకూరలు సమీకృత ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. రోజు తీసుకునే ఆహారంలో 125 గ్రాముల ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆకుకూరల సాగు ద్వారా అధిక లాభాలు సాధించవచ్చు.
పాలకూర:
ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోలు అవసరం. విత్తనబంతిలో 2 – 3 విత్తనాలు ఉంటాయి. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది.
గోంగూర:
ఆన్ గ్రా – 1,2 , భీమిలి- 2 రకాలు అనుకూలం. ఎకరానికి 6 కిలోల విత్తనాలు వసరం. సాధారణంగా 60 సెంటీ మీటర్ల దూరంలో ఇరువైపులా 15 – 20 సెంటీ మీటర్ల దూరంలో నాటుకోవాలి. ఎకరానికి 4 – 5 టన్నుల దిగుబడి వస్తుంది.
తోటకూర:
ఆర్ఎన్ఏ – 1, సీవో – 1, ఆర్క సుగుణ, రకాలు అనుకూలం. ఎకరానికి 800 గ్రాముల విత్తనాన్ని 10 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
నాటిన 20 – 30 రోజుల తర్వాత కట్టలుగా కట్టి విక్రయించాలి.
నీటి యాజమాన్యం:
డ్రిప్, స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని అందించడం ద్వారా 30 – 40 శాతం వరకు నీటి ఆదా చేయవచ్చు. దిగుబడి 15 – 20 శాతం పెరుగుతోంది. ఎండ తీవ్రతను తగ్గించడానికి సాధారణంగా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండాలి. అక్కడక్కడ ఒక వరుస ఆముదం మొక్కలు, మొక్కజొన్న మొక్కలు నాటాలి.

Leave Your Comments

పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

తాటిముంజుల ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like