పుచ్చకాయ ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఎండాకాలంలో పుచ్చపండు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజీలోకి వెళ్లిపోతుంటాం. అలాంటి సమయంలో వడ దెబ్బ తగిలి కళ్లు తిరిగి కిందపడుతుంటారు. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే శరీరంలో వాటర్ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆక్సిడెంట్లు, విటమిన్ – బి, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జీటాకెరోటీన్లు, ఆల్కలైన్, విటమిన్ – ఎ, విటమిన్ – బి6, విటమిన్ – సి, తదితరాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
పుచ్చకాయ రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. కాన్సర్ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయలలో వుంది. గర్భిణీ మహిళలకు తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనే లో కలిపి పుచ్చకాయ తింటే ఎంతో మంచిది. డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంది. బీపీ ని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. నాడీ వ్యవస్థ పని తీరుని ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది. కాల్షియం అధికంగా వున్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలు నయమవుతాయి.
పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments