Chitti Potti Paddy Farming: వర్షాకాలం వచ్చింది అంటే రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేయాలి అనుకుంటారు. యాసంగిలో కంటే ఎక్కువగా వానకాలం వరి పంటని ఎక్కువగా సాగు చేస్తారు. ఈ వర్షాకాలంలో వర్షాలు ఆలస్యంగా రావడంతో శాస్త్రవేత్తలు తక్కువ కాలంలో పండించే వరి సాగు చేయమని చెప్పారు. తక్కువ కాలంలో సాగు చేయడానికి వరిలో జీన్స్ కంపెనీ వాళ్ళు కొత్త వరి రకం చిట్టి పొట్టి అని పేరుతో అమ్ముతున్నారు. ఈ రకం సూర్యాపేట జిల్లాలో ఎర్రగట్టు గ్రామం రైతులు ఎక్కువగా సాగు చేస్తూ, మంచి దిగుబడితో పాటు లాభాలను కూడా పొందుతున్నారు.
ఈ చిట్టి పొట్టి రకం ముఖ్యమైన ప్రత్యేకత వల్ల ఎక్కువ ప్రసిద్ధిలో ఉంది. ఈ రకం ఎక్కువ వర్షం, గాలులకి తట్టుకొని ఉంటుంది. పంట కొత్త సమయంలో అకాల వర్షాలకి కూడా వరి గింజలు రాలవు. పంట చేను ఎక్కువ నీటిలో మునిగిపోయిన తొందరగా పాడు కాదు. వేరే వరి రకంలో ఒక మొలకకి 15-20 పిలకలు వస్తే ఈ చిట్టి పొట్టి రకంలో 40-50 పిలకలు వస్తాయి. ఎక్కువ పిలకలు రావడంతో కూడా పంట దిగుబడి పెరుగుతుంది.
Also Read: Cow Dung Bricks: పర్యావరణాన్ని కాపాడుకునే పద్దతిలో కొత్తగా.. ఆవు పేడ టైల్స్.!
ఈ రకం ఎక్కువ ఎత్తు కూడా పెరగదు దాని కారణంగా గింజలు రాలిపోయే అవకాశం కూడా తగ్గుతుంది. వరి పంటకి ముఖ్యమైన సమస్య దోమకాటు బాధ కూడా ఉండదు. రైతులు వరి పిలకాలని నట్టు వేస్తే ఎక్కువ కూలీ ఖర్చు ఉంటుంది అని వరి విత్తనాలు విస్తారంగా చల్లుకొని సాగు చేస్తున్నారు.
వర్షాకాలంలో ఈ రకం 10 ఎకరాలో సాగు చేస్తే 42 సంచుల దిగుబడి వచ్చింది. ఒక సంచి ధాన్యం 75 కిలోలు ఉంటుంది. ఈ చిట్టి పొట్టి రకం పంట కాలం 125 రోజులు మాత్రమే. వేరే వాటితో పోలిస్తే 10-15 రోజుల ముందే కోతకి వస్తుంది. ఈ ధాన్యం మార్కెట్లో ఒక సంచి 2300 రూపాయలకి రైతులు అమ్ముతున్నారు. వేరే రకాలతో పోలిస్తే 3-4 క్వింటాల్ ఎక్కువ పండుతుంది. ఈ రకం తెగులు కూడా తట్టుకుంటుంది. దీని కారణంగా ఈ వరి రాకని ఎక్కువగా సాగు చేస్తున్నారు. జీన్స్ కంపెనీ చిట్టి పొట్టి వరి రకం విత్తనాలు కావాలి అనుకున్న వాళ్ళు 9100053035 నెంబర్ సంప్రదించండి.