Tomato Price: దేశవ్యాప్తంగా ఏప్రిల్ మరియు మే నెలలో వడగాలులు మరియు ఆకస్మిక వర్షాలకు టమాటా పంట దెబ్బతినడంతో టమాటా దిగుబడలు తగ్గి ధరలు ఒక్కసారిగా పెరగడంతో మన రాష్ట్రంలోని మదనపల్లి వ్యవసాయ మార్కెట్ లో ప్రస్తుతం కిలో 86 రూ నుంచి 124 రూ మధ్య పలుకుతోంది.
రాష్ట్రప్రభుత్వం వినియోగధరులకు ఉపశమనం కలిగించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశములతో గౌరవ మార్కెటింగ్ శాఖ మాత్యులు మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించి తక్షణమే వినియోగదారులకు ఉపశమనం కలిపించుటకు రైతుబజార్ల ద్వారా రాయితీ పై రూ.50/- లకు కిలో టమాటా విక్రయంచుటకు ఆదేశించటమైనది.
పై ఆదేశాలకు అనుగుణంగా మార్కెటింగ్ శాఖ పెరిగిన టమాటా ధరలు భారము వినియోగధరులకు ఉపశమనం కల్పించే దిశగా మదనపల్లి, పలమనేరు మరియు చిత్తూరు వ్యవసాయ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి రాష్ట్రములోని పలు ప్రధాన నగరాలు మరియు పట్టణ రైతుబజార్లలో రాయితీ పై కిలో రూ.50 కే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. కడప కర్నూలు జిల్లాలో బుధవారం శ్రీకారం చుట్టగా మిగిలిన జిల్లాలో గురువారం నుంచి విక్రయంచటం జరిగినది.
Also Read: Wheat Rava Idli Recipe: బరువు తగ్గడానికి సహాయపడే గోధుమరవ్వ ఇడ్లినీ అరగంటలో తయారు చేసేద్దామా .!
నేటికి 100 టన్నుల టమాటాలను రాయితీ పై ప్రధాన పట్టణ రైతుబజార్ల లో అందిచడమైనది. తదుపరి మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ద్వారా రోజుకు 50-60 టన్నుల టమాటాలు సేకరించి వినియోగదారులకు విక్రయంచుటకు లక్ష్యంగా నిర్దేశించుకుని ధరలు తగ్గే వరకు రాయితీ పై టమాటాను రైతుబజార్ల ద్వారా విక్రయంచుటకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టడమైనది. వినియోగధారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది.