ఆరోగ్యం / జీవన విధానం

Rajasthani Churma Laddu: గోధుమ పిండితో చేసే చుర్మా లడ్డూలను ఎప్పుడైనా తిన్నారా? అయితే తయారీ విధానం మీ కోసం

3
Rajasthani Churma Laddu
Churma Laddu

Rajasthani Churma Laddu: చుర్మా లడ్డూలను “చుర్మా” తీపి గోధుమ పిండి మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టడం ద్వారా తయారు చేస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రజలు గోధుమ పిండిలో వేయించిన చుర్మా బాల్స్ ని మెత్తగా రుబ్బి, నెయ్యి, బెల్లం లేదా పంచదారతో కలిపి చుర్మాను తయారు చేస్తారు.

చుర్మా లడ్డులను తినే ముందు మైక్రోవేవ్‌లో కొన్ని సెకన్లపాటు ఉంచి, బ్రేక్ ఫాస్ట్ తినే సమయంలో తినేసేయొచ్చు. ఈ వంటకం రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ వంటకం పూర్తి అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది. ఇప్పడు మనం చర్చించుకునే ఈ వంటకం ఆరుగురికి సరిపోతుంది. తయారీ కావాల్సిన పదార్థాలను తెలుసుకుందాం.

వంటకం: రాజస్థానీ
మొత్తం సమయం (నిమిషాలు): 40
సర్వింగ్స్: 6

కావలసిన పదార్ధాలు :
మొత్తం గోధుమ పిండి/ఆటా – 2.5 కప్పు
బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి – సరిపోయేంత
బెల్లం – 1 కప్పు
యాలకుల పొడి – 1 స్పూన్

Rajasthani Churma Laddu

Rajasthani Churma Laddu

తయారీ విధానం :

ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని బొంబాయి రవ్వని కలపాలి. అర (½) కప్పు నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అవసరమైనంత నీరు పోసి గట్టి పిండిలా మెత్తగా చేసుకోవాలి. చిన్న కుడుములు చేయడానికి పిండిని విభజించుకోవాలి. కడాయిలో తగినంత నెయ్యి వేడి చేసి, కుడుములు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. వాటిని చాలా తక్కువ మంట మీద కనీసం 5-7 నిమిషాలు వేయించాలి. చివరగా, వాటిని అర నిమిషం పాటు అధిక మంట మీద వేయించాలి.

ఆ తరువాత వాటిని పూర్తిగా చల్లబరచాలి. చల్లారిన తర్వాత, వాటిని చేతులతో మెత్తగా నలిపి, ఒక గిన్నెలోకి మార్చాలి. దాని తరువాత నాన్ స్టిక్ పాన్ లో 1 కప్పు నెయ్యి వేసి వేడి చేసి, అందులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి. మెత్తగా కలిపిన నూరిన మిశ్రమానికి కరిగించిన బెల్లం వేసి, చేతులతో బాగా కలపాలి. మిక్సింగ్ చేసేటప్పుడు చేతులకు నెయ్యి రాయడం మర్చిపోవద్దు . తీపి సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేయాలి. తీపి సరిపోకపోతే చక్కర పొడి ని వేసుకుని కలుపుకోవాలి. పచ్చి యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మీకు నచ్చిన ఆకారంలో లడ్డులుగా చుట్టుకోవాలి. ఆ లడ్డులను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

Also Read: Tomato Staking Method:స్టేకింగ్ పద్దతిలో టమాటా సాగు ఎలా చేయాలి.. ?

Leave Your Comments

Tomato Staking Method:స్టేకింగ్ పద్దతిలో టమాటా సాగు ఎలా చేయాలి.. ?

Previous article

Telangana Government: పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గిరిజన రైతులకు వరాలు!

Next article

You may also like