జాతీయం

Onion Price Rise: నాలుగు రోజులుగా పెరుగుతున్న ఉల్లిపాయ ధర..

1
Onion Price Rise
Irradiation Onions Experiment

Onion Price Rise: కొన్ని రోజులుగా టమాటా ధర పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఉల్లిపాయ ధర కూడా పెరగడం చూస్తున్నాము. గత నాలుగు రోజుల నుంచి ఉల్లిపాయల ధర భారీగా పెరుగుతుంది. నాలుగు రోజుల క్రితం కిలో ఉల్లిపాయల ధర కిలో 15 రూపాయలు ఉండేది. ఇప్పుడు కిలో ఉల్లిపాయల ధర 30-40 రూపాయలు అమ్ముతున్నారు. ఉల్లిపాయల ధర రెండు రేట్లు నాలుగు రోజులోనే పెరిగింది.

ఉల్లిపాయ కట్ చేస్తే కళ్లలో నీళ్లు వచ్చేవి, ఇప్పుడు ఉల్లిపాయ రేట్ వింటే నీళ్లు వస్తున్నాయి. కూరగాయలు, పప్పులు, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలా అని పదార్థాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మన దేశ వంటలో తప్పనిసరిగా ఉల్లి, టమాటా, కూరగాయలను వాడుతారు, వీటి ధర రోజు రోజు పెరగడం సామాన్యులకి వీటిని కొన్నాడానికి ఆలోచిస్తున్నారు. ఈ ధరలు ఇలాగే పెరిగితే మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.

Also Read: Brush Cutter: బ్రష్ కట్టర్ రైతులు ఎలా వాడుకోవాలి..?

Onion Price

Onion Price Rise

ఉల్లిపాయల ధర మార్కెట్లో ప్రస్తుతం 25 శాతం పెరిగింది. ఉల్లిపాయలు మార్కెట్లో ప్రస్తుతం 1800-2000 రూపాయలు ఉంది. జూన్ నెల వరకు ఉల్లిపాయల ధర మార్కెట్లో 1200 ఉండేది.

ఈ సంవత్సరం మొదటిలో మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో ఉల్లిపాయల పంట ఎక్కువగా పండటంతో ఫిబ్రవరి నెలలో వీటి రేట్ బాగా తగ్గింది. అప్పుడు కిలో ఉల్లిపాయలు రూపాయి లేదా రెండు రూపాయలకి తగ్గింది. దీనితో రైతులు అందరూ నష్టపోయారు. ఇప్పుడు దిగుబడి తగ్గడంతో ఉల్లిపాయ ధర చాలా పెరిగింది. రాబోయే రోజులో ఉల్లిపాయ ధర కిలో 150-200 రూపాయలు అయిన కూడా ఆశ్చర్యం లేదు.

Also Read: Indian Oats Farming: ఈ కొత్త రకం పంటలో పాల కంటే 10 రేట్లు ఎక్కువ పోషక గుణాలు.!

Leave Your Comments

Brush Cutter: బ్రష్ కట్టర్ రైతులు ఎలా వాడుకోవాలి..?

Previous article

Yellow Chilli: పసుపు రంగు మిర్చిని మీరు చూశారా.!

Next article

You may also like