Soap Nuts: అందరికి జుట్టు అంటే ఇష్టం. మార్కెట్లో దొరికే రసాయన షాంపూలు వాడటం వల్ల జుట్టు రాలిపోయె సమస్య ఎక్కువగా చూస్తున్నాము. జుట్టు బాగా పెరగడానికి రసాయన షాంపూలు కాకుండా కుంకుడుకాయలు వాడుకునే వాళ్ళు. జీవితం సైక్లిక్ పద్దతిలో వెళ్తూ మళ్ళీ అందరం పాత పద్ధతులని వాడుకుంటున్నాము. మంచి జుట్టు కోసం అందరూ మళ్ళీ కుంకుడుకాయలని వాడుతున్నారు. నల్గొండ జిల్లా, పోలేపల్లి గ్రామం పద్మ రెడ్డి రైతు కుంకుడు కాయల తోటని సాగు చేస్తున్నారు.
ఈ తోటని ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది కానీ గత 5-6 సంవత్సర నుంచి కుంకుడు కాయలకి మంచి డిమాండ్ ఉంది. పద్మ రెడ్డి గారికి ఉన్న 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు కాయల చెట్లు నాటుకున్నారు. తోట ప్రారంభించిన మూడు సంవత్సరాలు డ్రిప్ వాడుకొని తోటకి నీళ్లు అందించారు.
కుంకుడు కాయలకి డిమాండ్ తగ్గిపోవడంతో కొన్ని సంవత్సరాలు ఈ తోటని పాటించుకోకున్నా కూడా 3-4 లక్షల వరకు లాభాలు వస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరిగినప్పటి నుంచి మళ్ళీ కుంకుండు కాయల తోటని చూసుకుంటున్నారు.
Also Read: Rabbit Farming: కుందేళ్ల పెంపకంతో ఇంత లాభముంటుందా? ఈజీగా లక్షల ఆదాయం!
ఒక చెట్టుకి 50-100 కిలోల దిగుబడి వస్తుంది. ఈ చెట్లకి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. రోజుకి ఒక్కసారి నీళ్లు అందిస్తే చాలు. ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు కూడా అవసరం ఉండదు. దిగుబడి చాలా మంచిగా వస్తుంది. ప్రస్తుతం కిలో కుంకుడు కాయలు 70 రూపాయలు అమ్ముతున్నారు. 70 క్విన్టల్స్కి 5-6 లక్షల వరకు లాభాలు వస్తాయి.
కుంకుడు కాయలాగానే కాదు వీటి పొడికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది . వీటిని పొడి చేసి వ్యాపారాలు విదేశాలలో కూడా వ్యాపారం చేస్తున్నారు. ఈ మధ్య వ్యాపారులు రైతులతో కాంట్రాక్టు పద్దతిలో కూడా కుంకుడు కాయల సాగు చేస్తున్నారు. దానితో రైతులకి రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది, మంచి లాభాలు పొందవచ్చు.
Also Read: Soya Chunks Disadvantages: ఇవి రోజు తింటే మీ ప్రాణనానికి ప్రమాదం.!