Sugarcane Knots: పూర్వ కాలంలో రైతులు సాగు చేసిన పంటలో నాణ్యమైన విత్తనాలని దాచుకొని, మళ్ళీ పంట కాలంలో ఆ పంట ధాన్యాన్ని విత్తనాలుగా విత్తుకునే వాళ్ళు. ఇప్పుడు ఉన్న రైతులు వాళ్ళు పండించిన పంట మొత్తం అమ్ముకొని, మళ్ళీ పంటకి బయట నుంచి విత్తనాలని కొని పొలంలో విత్తుతున్నారు. ప్రతి సారి విత్తనాలని కొనడం వల్ల రైతులకి పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. సంగారెడ్డి జిల్లా రైతులు ఒక్కసారి పండించిన పంటలో కొంత భాగం ఉంచి మళ్ళీ పంటకి విత్తనాలుగా వాడుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో రైతులు ఎక్కువగా చెరుకు పంటని పండిస్తారు. ఈ జిల్లలో రైతులకి దగరలో చెరకు ఫ్యాక్టరీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానితో ఇక్కడి రైతులు ఎక్కువగా చెరుకు పంటని పండిస్తారు. చెరుకు పంట కోతకి రావడానికి 10-11 నెలల సమయం పడుతుంది. మొదటి సారి రైతులు చెరుకు సాగు చేసే పంటని ప్లాంటేడ్ లేదా ల్యాపా పంట అంటారు.
Also Read: Summer Banana Garden: ఎండాకాలం అరటి తోటని ఎలా ప్రారంభించాలి.?
ఈ ల్యాపా పంట కోతకి వచ్చాక, వచ్చిన దిగుబడిలో కొంత భాగం చెరుకుకు ఉన్న ఆకులని చేతులతో తీయ్యాలి. పరికరాలతో చెరుకు ఉన్న ఆకులు తెస్తే, చెరుకు ఉన్న కన్ను భాగం పోతుంది. ఆ కన్ను భాగం పోతే అవి పొలంలో నాట్టుకోవడానికి రాదు. ఆకులు తీసాక చెరుకు గడను ఒకటి లేదా రెండు కనులు వచ్చేలా కట్ చేసుకోవాలి.
ఈ చెరుకు ముక్కలని పొలంలో వేసే ముందు పొలానికి బాగా నీళ్లు పట్టాలి. పొలం కొంచం బురదగా ఉన్నపుడు ఈ చెరుకు ముక్కలని పొలంలో కొంచం దూరంగా వేసుకొని కాలుతో పొలంలోకి తొక్కాలి. ఈ చెరుకు ముక్క 4 ఇంచెస్ లోత్తులో వేసుకోవాలి. ఇలా నాటుకున్న చెరుకు ఒక వారంలో మొక్కలు రావడం మొదలు అవుతాయి.
రెండో సారి నాటిన పంటని మోడెమ్ లేదా రోటున్ పంట అంటారు. ఈ రోటున్ పంటలో ల్యాపా పంట కంటే 5-6 టన్నుల వరకు ఎక్కువ దుగుబడి వస్తుంది. ఇలా ఒక్కసారి పండించిన పంటని మళ్ళీ పంటకి విత్తనాలుగా నాటుకోవడం ద్వారా పెట్టుబడి కూడా తగ్గుతుంది. రైతులకి మంచి లాభాలు వస్తాయి.
Also Read: Snake Gourd Farming: రైతులను ధనవంతులను చేసే పొట్లకాయ సాగులో మెళుకువలు.!