వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేనందుకు ఖరగ్ పూర్ ఐఐటీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ విభాగం కృషి చేస్తోంది. అందులో భాగంగా జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్ సాంకేతికతను కనిపెట్టింది. ఈ పద్ధతి కర్షకుడికి ప్రయోజనకరంగా ఉంటుందని మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనల్లో కీలకపాత్ర పోషించిన ఐఐటీ డైరెక్టర్ వీకే తివారీ, డాక్టర్ స్నేహా ఝూ. మట్టి సారాన్ని తెలుసుకుని అందులో ఆ వాతావరణానికి తగ్గట్టుగా పంటలు వేయడంలో వెనుకబడుతున్నారు. మట్టిని ప్రయోగశాలకు తీసుకెళ్లి ఆ భూమిలో నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్ శాతమెంతొ తెలుసుకుని ఏ పంట వేయాలో నిర్ణయించి, దానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేయడం శ్రమ, వ్యయంతో కూడుకున్న పని. అందుకే ప్రయోగశాలకు వెళ్లకుండా సొంత ఆలోచనలతో పంటలు పండించి ఆదాయార్జనలో ఎదురుదెబ్బలు తింటున్నారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్ పద్దతి కనుగొన్నట్లు వారు తెలిపారు.
హెక్టారు భూమిని 36 కమతాలుగా విభజించి జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్ ద్వారా సెన్సార్లను గుర్తించి ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ నకు పూర్తి వివరాలను పంపిస్తుందని స్నేహా ఝూ తెలిపారు. ఈ సమాచారం అన్నదాతకు విలువైందన్నారు. దీంతో ఏ పంట ఆ మట్టిలో వేస్తె లాభదాయకంగా ఉంటుందో తేలికగా చెప్పవచ్చన్నారు. ఎరువులు ఎంత మోతాదులో వాడాలో సూచనలు చేయవచ్చని తెలిపారు. ఈ పద్ధతి దేశ ఆహార భద్రత, నాణ్యత, ఆర్థికాభివృద్ధిలో గుణాత్మకమైన మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల కర్షకుడికి ఎరువుల ఖర్చు తగ్గడంతోపాటు అధిక మోతాదులో వాడకం వల్ల ఎదురయ్యే అనర్థాలు అదుపులోకి తేవచ్చన్నారు.
జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్.. ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు
Leave Your Comments