తెలంగాణ

Rythu Bandhu Scheme: రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం – మంత్రి

2
Rythu Bandhu Scheme
Rythu Bandhu

Rythu Bandhu Scheme: రైతుబంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసారు. రెండో రోజు రూ.1278.60 కోట్లు విడుదల చేశామని మంత్రి ప్రకటించారు. 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు. రెండు రోజులలో 39,54,138 మంది రైతుల ఖాతాలలో 1921.18 కోట్లు జమ చెయ్యడం జరిగిందని 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని తెలిపారు.

రైతుబంధు ఖాతాలోకి 11వ విడతతో రైతుల ఖాతాలలో రూ.72,910 కోట్లకు చేరనున్నది. మొత్తంగా ఒక కోటి 54 లక్షల ఎకరాలకు సాయం అందనున్నది. 10 వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేయడం జరిగింది. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు వేయడం జరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Rythu Bandhu Scheme

Rythu Bandhu Scheme

ఈ సారి కొత్తగా మొదటిసారి రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంకు అకౌంటు వివరాలతో సంప్రదించాలని దేశంలో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

Rythubandhu Day 2

Minister Niranjan Reddy

రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగువిప్లవం మొదలయిందని సాగునీటి రాక, ఉచిత కరంటుతో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆహారశుద్ది పరిశ్రమలతో తెలంగాణ వ్యవసాయ రంగం రూపుమారనున్నదని ఆరుగాలం కష్టపడే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నదని మంత్రి తెలిపారు.

Leave Your Comments

Pulses Price: రోజు రోజుకి పెరుగుతున్న పప్పుల ధరలు.!

Previous article

Sesame Harvester Machine: నువ్వుల పంట కోతలకు కొత్త యంత్రం..

Next article

You may also like