తెలంగాణ

Tomato Price: పెరుగుతున్న కూరగాయల ధరలు.. కిలో టమాటా 100 రూపాయలు

1
Hybrid Tomato Seed Production
Tomato Price Increase

Tomato Price: రోజు రోజుకి పరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్య ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. గత వరం వరకు చికన్ ,మటన్ పెరగడం చూశాము, ఇప్పుడు అవి కాస్త తగ్గడం ప్రారంభం మొదలు అవ్వగానే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. గత నెల రోజుల నుంచి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు చికన్ ,మటన్ ధరలు అందుకోవాలి అని పోటీ పడుతున్నట్టు ఉంది.

బయట ధరలు చూస్తుంటే పోటీ నిజంగానే ఉంది అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం టమాటా ధర కిలో 100 రూపాయలు ఉంది. రెండు నెల క్రింద కిలో టమాటా 8-10 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాదాపు 10 రేట్లు పెరిగింది. ప్రతి కూరగాయల ధర కిలో 80-100 రూపాయలకి పెరిగింది. ఆకుకూరలు కూడా ఒక కట్ట 5 రూపాయలు ఉండేది ఇప్పుడు 20 రూపాయలకి ఒక కట్ట అమ్ముతున్నారు.

Also Read: Rythu Bandhu: 70 లక్షల మంది రైతులకు వానాకాలం రైతుబంధు – నేటి నుండి రైతుల ఖాతాలలో జమ

సామాన్యులు 200 రూపాయలకి వారంకి సరిపోయే కూరగాయలు కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకొని వెళ్లిన ఒక వారంకి సరిపోయే కూరగాయలు కొన్నలేని పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి ముఖ్యంగా మే నెలలో పడిన అకాల వర్షాలు. ఈ వర్షాల వల్ల రైతులకి పంట దిగుబడి తగ్గింది. పండించిన పంట కూడా నాణ్యతగా లేదు.

కూరగాయల ధరలు ఇలా పెరుగుతున్నాయి అంటే పప్పు, నూనె ధరలు పెరిగి ప్రజల పై నెల గడవాలి అంటే పెద్ద భారంగా మారేలా ఉంది. రాబోతున్న రోజులో అని ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పప్పు, నూనె, కూరగాయలు అని ధరలు పెరగటంతో ప్రజలు ఏం కొన్నలేని పరిస్థితి వచ్చేల ఉంది.

Also Read: Peace of Mind Tips: మానసిక ప్రశాంతత లేదా? అయితే ఇది మీకోసమే.!

Leave Your Comments

Rythu Bandhu: 70 లక్షల మంది రైతులకు వానాకాలం రైతుబంధు – నేటి నుండి రైతుల ఖాతాలలో జమ

Previous article

Pulses Price: రోజు రోజుకి పెరుగుతున్న పప్పుల ధరలు.!

Next article

You may also like