తెలంగాణ

Rythu Bandhu: 70 లక్షల మంది రైతులకు వానాకాలం రైతుబంధు – నేటి నుండి రైతుల ఖాతాలలో జమ

1
Rythu Bandhu Scheme
Rythu Bandhu Scheme

Rythu Bandhu: వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికిరాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.

70 లక్షల మంది రైతులకు వానాకాలం రైతుబంధు నిధులను నేటి వాళ్ళ ఖాతాలలోకి తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ సారి కొత్తగా 5 లక్షల లబ్ధిదారులు జాబితాలోకి చేరారు. లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన సుమారు 4 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వడం జరుగుతుంది. ఈ వానాకాలం సీజన్ లో రైతుల ఖాతాలలో మొత్తం రూ.7720.29 కోట్లు జమకానున్నది. గతంలోకన్నా ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం ఈ సారి పడుతున్నది.

రైతుబంధు ఖాతాలోకి 11వ విడతతో రైతుల ఖాతాలలో రూ.72,910 కోట్లకు చేరనున్నది. మొత్తంగా ఒక కోటి 54 లక్షల ఎకరాలకు సాయం అందనున్నది. 10 వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేయడం జరిగింది. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు వేయడం జరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Also Read: Peace of Mind Tips: మానసిక ప్రశాంతత లేదా? అయితే ఇది మీకోసమే.!

Rythu Bandhu

Rythu Bandhu

ఈ సారి కొత్తగా మొదటిసారి రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంకు అకౌంటు వివరాలతో సంప్రదించాలని దేశంలో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు.

రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ఆప్యాయతకు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి సరఫరా నిదర్శనాలుగా నిలిచాయని అన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగులోకి రాలేదని విషం కక్కిన విపక్షాలు తమిళనాడు, కర్ణాటక, కేరళలు బియ్యం సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలు చూసి కళ్లు తెరవాలని అన్నారు.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం నిర్మాణం మూలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో సాగు పెరిగి అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి సాధ్యమయిందని బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను కొనసాగిస్తున్నారు. ఖర్చు ఎంతయినా సరే రైతు నష్టపోకూడదన్నది కేసీఆర్ ఆలోచన మంత్రి తెలిపారు.

Also Read: Post-Harvest Safety Measures in Mango and Cashew: మామిడి, జీడి మామిడి తోటల్లో కోత అనంతర చర్యలివే :

Leave Your Comments

Peace of Mind Tips: మానసిక ప్రశాంతత లేదా? అయితే ఇది మీకోసమే.!

Previous article

Tomato Price: పెరుగుతున్న కూరగాయల ధరలు.. కిలో టమాటా 100 రూపాయలు

Next article

You may also like