Peace of Mind Tips: శారీరిక సమస్యలతో పోలిస్తే మానసిక సమస్యలు కూడా రోజు రోజుకి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. మనసు బాగోక పోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది అందరికీ కూడా, ఏమిటంటే, ఉద్యోగాలు అండి, వ్యాపారాలoడి వాటి వలన మానసిక ఒత్తిడి అండి అని చెప్తున్నారు. ఈ బిజీ లైఫ్ లో ఇదంతా సర్వసాధారణం అండి అంటున్నారు. మానసిక సంబందమైన సమస్య ఉండటం వలనే శారీరిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మనస్సు బాగోకపోవటం వలనే సగం రోగాలకు కారణం అని డాక్టర్లు కూడా చెప్తున్నారు.
అసలు మనస్సు బాగోకపోతే రోగాలు ఏలా వస్తాయో తెలుసుకుందాం
మీ శరీరం లో జీవక్రియ అంతా కూడా మారిపోతుంది మైండ్ బాగొనప్పుడు . కేవలం మనస్సు బాగోకపోతే ఒక్క భాగానికి సంబంధం కాదు అండి. ఎందుకంటే అది హెడ్ క్వార్టర్ , ఎందుకంటే శరీరం మొత్తాన్ని కoట్రోల్ చేస్తుంది కాబట్టి. మనస్సు బాగోకపోతే అన్నిటినీ గాడి తప్పేలా చేస్తుంది. అందుచేత కoట్రోలిoగ్ సిస్టమ్ దెబ్బతింటే మొత్తం శరీరం కoట్రోల్ తప్పుతుంది.
ఎప్పుడైతే మీకూ కోపం, చిరాకు, టెన్షన్, ఒత్తిడి, భయాందోళనలకు గురవుతున్నారో మీ లోపల విడుదలయ్యే చెడు హార్మోన్స్ వెంటనే మీ శరీరంలో పనులన్నీటిని మార్చేస్తాయి. ఎప్పుడు అయితే మీ మానసిక స్థితి బాగోలేదొ అప్పుడు వెంటనే శ్వాస నాళాలు సన్నగిల్లుతాయి.శ్వాస నాళాలు సన్నగిల్లటం వలన గాలి తక్కువగా వెళ్తుంది. దీని వలన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. నీరసం వస్తది. అలసట అవలింతలు వస్తాయి. ముఖంలో కాంతి తగ్గుతుంది. ఒక్క చిన్న మార్పు వలన ఎన్ని అనర్థాలో.
Also Read: Kharif Rice Cultivation: ఖరీఫ్ వరి నారుమడి యాజమాన్యం, తయారీలో మెళకువలు.!
మీ మనస్సు బాగోకపోతే రక్త నాళాలు ముడుచుకుపోతాయి. దాని వలన రక్త ప్రసరణ తగ్గి ఆహారం, గాలి, నీరు సరిగ్గా వెళ్ళవు. మనస్సు బాగోలేదు అంటే చెడు హార్మోన్స్ ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ చెడ్డ పదార్ధాలు అన్ని విష పదార్థాలుగా మన శరీరం పై దాడి చేస్తాయి. అందువలన అన్ని గ్రంధులు గాడి తప్పుతాయి.
ఓవరీస్ సరిగ్గా పనిచేయవు.థైరాయిడ్ సమస్యలు వస్తాయి. మనస్సు బాగోకపోతే వీర్య కణాలు సరిగ్గా ఉత్పత్తి కావు. మెదడు లో కొన్ని రకాల హాని కలిగించే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవన్ని రక్తంలో కలిసిపోతాయి. అందుచేత హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. కుటుంబాన్ని యజమాని ఏలా నడిపిస్తాడో ఈ హార్మోన్స్ శరీరాన్ని అలా మంచిగా పనిచేసేలా డైరెక్షన్ ఇస్తాయి. ఈ డైరెక్షన్ సరిగ్గా వెళ్ళటం ఆగిపోతది హార్మోన్స్ డిస్టర్బ్ అవటం వలన. అందుచేత శరీర అవయవాలు. ఎక్కువగా గాడి తప్పటం జరుగుతుంది. అందుకే మనస్సు బాగోకపోతే ఇటువంటివి అన్నీ శరీరo పై ఇన్డైరెక్ట్ గా పడుతూ వుంటాయి.
మనస్సు బాగోనప్పుడు ఆలోచనలు చాలా వేగంగా వస్తాయి,కoట్రోల్ ఉండవ్, మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. అందుకే ఏ పని చేసినా తప్పు చేస్తాం. ఏ అలోచన చేసినా మంచి ఆలోచన రాదు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మనస్సు బాగోకపోవటం అనేది,శరీరం బాగోకపోవటం అనే దానికంటే ఎక్కువ నష్టoను కలిగిస్తుంది. శారీరిక ఆరోగ్యంతో
పాటు మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. శారీరిక ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిన మానసిక ఆరోగ్యం బాగొకపోతే ఏం ప్రయజనం ఉండదు. మనస్సు బాగుంటేనే తిన్నది అరుగుతది, వంటికి పడతది, ఆహారం అంతా కూడా రక్తంగా మారుతుంది, జీవక్రియలు సజావుగా సాగుతాయి మనస్సు బాగుంటే.
అందుకే ఆ మనస్సును మీరు మంచిగా ఉంచుకోవాలి అంటే ఎం చేయాలి?
• ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలి
• నా మనస్సు ను నేను మార్చుకోవాలి.
• నా ఆలోచన సరళిని నేను మార్చుకోవాలి. నెగటివ్ ఆలోచనలు రాకూడదు. వచ్చిన వాటిని యాక్షన్ లోకి తీసుకెళ్ళకూడదు.
• నేను రోజులో ఎప్పుడు కంగారు పడకూడదు.
• నేను రోజులో ఎప్పుడు భయ పడకూడదు.
• నేను రోజులో ఎప్పుడు ఒత్తిడి కి గురికాకూడదు.
• నేను రోజులో ఎప్పుడు కోపం, చిరాకు తెచ్చుకోకూడదు.
• మీరు మానసిక ఆరోగ్యం కోసం ఉదయం లేవగానే నేను ఈ రోజు ఏం జరిగినా చాలా కామ్ గా, కూల్ గా ఉంటాను,లేదంటే అలా కాదని నేను కోపం తెచ్చుకున్నా,భయపడినా, ఒత్తిడి కి గురయిన, శరీరంలో చెడు హార్మోన్లు విడదలయ్యే అవకాశం కలదు తద్వారా నా ఆరోగ్యము క్షీణించును అని అనుకోవాలి. మనకి మనమే నేను ఇట్ల అవ్వాలి అనుకుంటూ ఉంటే మానసికంగా చాలా మార్పు వస్తుంది.
Also Read: Moringa Seeds: మునగ విత్తనాల సాగులో మంచి లాభాలు..