వ్యవసాయ పంటలు

Kharif Rice Cultivation: ఖరీఫ్ వరి నారుమడి యాజమాన్యం, తయారీలో మెళకువలు.!

2
Traditional Rice Cultivation Methods
Kharif Paddy Cultivation

Kharif Rice Cultivation: నేరుగా వరి విత్తే పద్ధతులు చాలా ప్రాంతాలలో ఆచరణలో ఉన్నా , చాలా మంది రైతులు నారుమడులను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగు నీటి లభ్యత తక్కువగా వున్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వేదజల్లుతారు. నీటి లభ్యత అధికంగా వున్న రైతులు దమ్ము చేసి నారుమడులు పోస్తున్నారు . నారుమడి తయారీలో ఏ మాత్రం అశ్రద్ధ వహించిన యాజమాన్య లోపం తలెత్తిన నారు అంతా పనికిరాకుండా పోవడమే కాకుండా, సీజన్ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది.

మరి ఆరోగ్యవంతమైన నారు అందిరావలంటే యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో తెలుసుకుందాం. రైతులు నారుమడి వెసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి విత్తనం ఎంపిక దగ్గరనుంచి నారుమడి తయారీ , నారు ఎదుగుదల మొదలగునవి. ముఖ్యంగా 25-30 రోజుల నారుమడి యాజమాన్యం అనేది మన ప్రధాన పంట దిగుబడి పై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి నారుమడి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

విత్తన ఎంపిక:
• ముఖ్యంగా విత్తన ఎంపిక అనేది ఆ ప్రాంతాలకు అనుకూలమైన వంగడాలను ఎంచుకోవాలి.
• ఎంచుకునేటప్పుడు కూడ పురుగులు, తెగుళ్లను
తట్టుకునే రకాలను ఎంచుకోవాలి.
• మేలైన అధిక దిగబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి.

•నారుమడి మునగకుండా కొంచెం ఎత్తుగా ఉండేలా తయారు చూసుకోవాలి.

•నారుమడి తయారు చేసుకునేటప్పుడు ముందు నాట్లు ఏ విధానంలో వెళ్తున్నాం అంటే యాంత్రిక విధానంలో వెళ్తున్నామా? లేదంటే కూలీలతో వేసుకునే విధానంలో వెళ్తున్నామా? బెంగాలీ ప్లాంటింగ్ విధానంలో వెళ్తున్నామా అనే దాన్ని బట్టి విత్తన మోతాదు నిర్ణయించుకోవాలి.

విత్తన శుద్ధి:
విత్తన్నాన్ని నానబెట్టడానికి ముందు విత్తన శుద్ధి తప్పని సరిగా చేసుకోవాలి.భూమి ద్వారా గాని, గాలి ద్వారా గాని, నీటి ద్వారా గాని తెగుళ్ళు వచ్చే అవకాశం కలదు.
మెట్ట నారుమడి వేసుకునే రైతు సోదరులు విత్తన శుద్ధి ఏలా చేయాలో తెలుసుకుదాం

• విత్తన శుద్ధి పొడి విత్తానానికి అయితే కార్బెండజిమ్ 3 గ్రాములు ఒక కిలో విత్తానానికి తగినంత నీటితో కలిపి (అనగా కార్బెండజిమ్ పొడి విత్తనాలకు అంటుకునే విధంగా) 24 గంటలు తర్వాత నారిమడిలో చల్లుకోవాలి.
దంప నారుమడి వేసుకునే రైతు సోదరులు విత్తన శుద్ధి ఏలా చేయాలో తెలుసుకుదాం

• విత్తన శుద్ధి తడి విత్తానానికి అయితే కార్బెండజిమ్ 1 గ్రాము ఒక కిలో విత్తానానికి ఒక లీటరు నీటిని ఉయోగించి కలిపి, ఆ ద్రావణంలో విత్తాన్నాని 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండేకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుంది.

Also Read: Plastic Mulching: ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేల నాణ్యత, పంట దిగుబడి ఎలా తగ్గుతుంది.!

Yasangi Rice Cultivation

Kharif Rice Cultivation

నారుమడి పెంపకం 2 రకాలు:
1) దంప నారుమడి
2) మెట్ట నారుమడి

1)దంప నారుమడి:
ఎంపిక చేసుకున్న పొలంలో సాంప్రదాయక పద్దతి లో ఎకరానికి 4-5 సెంట్ల విస్తీర్ణంలో నారుమడి పోసుకోవాలి. అదే బెంగాలీ నాటు విధానంలో అయితే ఎకరానికి 2 సెంట్ల విస్తీర్ణంలో నారుమడి పోసుకోవాలి. దంప నారుమడి తాయారు చేసుకునేటప్పుడు రైతులు ముఖ్యంగా నీరు పెట్టి, 4-5 రోజులు నిల్వకట్టి తర్వాత బాగా దమ్ము చేసుకోవాలి. దమ్ములో అవసరాన్ని బట్టి ఎరువులు వేసుకోవాలి. వరి నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ముచేసి చదును చేయాలి. నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారు చేస్తే మంచిది.

ఐదు సెంట్లు నారుమడికి వేయవలసి ఎరువుల మోతాదు :
4 కిలోల యూరియా( 2కిలోలు విత్తనం చల్లేముందు, మరో 2కిలోలు విత్తిన 12-14 రోజులకు), DAP 2.5 నుండి 3 కిలోల ( దమ్ములో వేసుకోవాలి) మరియు 1-2 కిలోలు పొటాష్ నిచ్చే ఎరువులను దమ్ములో వేసుకోవాలి.

మండేకట్టి అప్పుడప్పుడే మొలక వస్తున్న విత్తన్నాన్ని నారుమడిలో కొద్ది మేర నీరు 1-2 అంగుళాలు మాత్రమే నీరు ఉండేలా చూసుకుని, విత్తాన్నాన్ని చల్లుకోవాలి. చల్లిన 6 గంటలు తర్వాత ఆ నీటిని తీసివేసినట్లైతే విత్తనం సమానంగా పడి నూటికి 90% మొలక వచ్చే అవకాశం కలదు.నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు ఆరుతడిగా నీరు ఇచ్చి , తర్వాత పలుచగా నీరు కట్టాలి.జింకు లోప నివారణకు లీటరు నీటికి 2గ్రా జింకు సల్ఫేటు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి.

దంప నారుమడిలో సస్యరక్షణ:
విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3G గుళికలు
సెంటు నారుమడిని160 గ్రా|| చొప్పున వేయాలి లేదా క్లోరిపైరిఫాస్ 2 ml లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడి కి 160 గ్రా|| కార్బోప్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు వుంచి చల్లాలి.

2)మెట్ట నారుమడి :
బాగా 2-3 సార్లు దున్ని, చదును చేసుకొని ఒక ఎకరానికి 20-25 కిలోల విత్తనం చల్లి, దానిపై చదును చేసుకొని నీరు పెట్టిన, వర్షం పడినా మొలక వస్తుంది. మొలక వచ్చిన వారం రోజుల తర్వాత ఒక సెంటు నారుమడి కి 0.5 కిలోల యూరియా , 0.5 కిలోల mop వేసుకోవాలి. ఆఖరిగా తీసేముందు 0.5 కిలోల యూరియా , 0.25 కిలోల mop ఒక సెంటు నారుమడి కి వేసుకుంటే ఆరోగ్యవంతంగా నారు పెరుగుతుంది. నారుమడి లో కలుపు సమస్య ఉంటే తదనుగుణంగా కలుపు నివారణ చేయాలి. సస్యరక్షణ దంప నారుమడిలోలాగే పాటించాలి.

Also Read: Moringa Seeds: మునగ విత్తనాల సాగులో మంచి లాభాలు..

Leave Your Comments

Plastic Mulching: ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేల నాణ్యత, పంట దిగుబడి ఎలా తగ్గుతుంది.!

Previous article

Vannamei Prawns: వర్షాకాలంలో వెన్నామీ రొయ్యల చెరువులలో జాగ్రత్తలు, చెరువుల తయారీ మరియు నీటి నాణ్యత

Next article

You may also like