వార్తలు

“టాకింగ్ టు ప్లాంట్స్” అనే కాన్సెప్ట్ తో యువదంతులు ఫార్మింగ్..

0

వ్యవసాయంలో పెరిగిన టెక్నాలజీ వాడకం, నూతన ఫార్మింగ్ విధానాలు, ఆర్గానిక్ సాగుపై పెరుగుతున్న అవగాహన.. ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, యువత ఫార్మింగ్ పై దృష్టి సారించేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తోంది. ఈ మేరకు సాంకేతికతను సరైన రీతిలో ఉపయోగించుకుని మార్కెటింగ్ చేయడం తెలిస్తే వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేయవచ్చని ఎంతోమంది యువ రైతులు ఇప్పటికే నిరూపించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన భార్యాభర్తలు సచిన్, శ్వేత తమ వ్యవసాయ క్షేత్రంలో “సింప్లీ ఫ్రెష్” బ్రాండ్ తో కూరగాయలు పండిస్తున్నారు. ఈ క్రమంలో మొక్క మొక్కకు, విత్తు విత్తుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ “పెస్టిసైడ్ ఫ్రీ వెజీస్” అందిస్తున్న వారి ఫామ్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దర్బార్వార్.. ఇంజనీరింగ్ తర్వాత, దాదాపు 18 సంవత్సరాల పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు.భారీ మొత్తంలో సంపాదిస్తూ విదేశాల్లో హై ఫై లైఫ్ లీడ్ చేస్తున్నా.. మనసు మాత్రం ఇండియాపైనే ఉండేది. ఇక్కడకు రావాలని ఉన్నా, వచ్చాక ఏం చేయాలన్న విషయంపై సచిన్ కు క్లారిటీ లేకపోయేది. అయితే అప్పటికే ఆస్ట్రేలియాలో రైతులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఫార్మింగ్ లో మంచి దిగుబడులు సాధించడం సచిన్ ను ఆకర్షించింది. ఇదే తరహాలో తాను కూడా వ్యవసాయంలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే “టాకింగ్ టు ప్లాంట్స్” అనే కాన్సెప్ట్ తో 2013 లో హైదరాబాద్, శామీర్ పేటలోని పది ఎకరాల స్థలంలో తన భార్య శ్వేతతో కలిసి “సింప్లీ ఫ్రెష్” ను ప్రారంభించాడు. రసాయనాలు, పురుగు మందులు లేని పోషకాహారం అందించడమే లక్ష్యంగా సేంద్రియ విధానంలో పండించిన శుభ్రమైన తాజా కూరగాయలు అందిస్తున్నారు. దీన్ని ధృవీకరించేందుకు సింప్లీ ఫ్రెష్ కు క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టి వినియోగదారులందరికీ ఓపెన్ యాక్సెస్ ఇచ్చారు. ప్రతి ప్యాకెట్ ప్యాకెట్ పైగల క్యూఆర్ కోడ్ ను వినియోగదారులు వెబ్ సైట్ లో స్కాన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
టెక్ సాయంతో వ్యవసాయ క్షేత్రంలోని వాతావరణాన్ని నియంత్రించిన సచిన్ ప్రతీ దశలో మొక్క పెరుగుదలను మానిటర్ చేయడంతో పాటు మొక్కలకు అందిస్తున్న న్యుట్రిషన్స్ ను రికార్డ్ చేశాడు. అని ఎంతమేరకు మొక్కకు చేరుతున్నాయి దానివల్ల లాభముందా లేదా అని చెక్ చేయడంతో పాటు గ్రీన్ హౌజ్ లోని వాతావరణానికి మొక్కలు ఎలా స్పందిస్తున్నాయో పరిశీలించేవాడు. ఈ క్రమంలో తన కాన్సెప్ట్ పై మరింత తెలుసుకోవడానికి వీలుగా వృక్ష శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, రైతులు ఇతరులతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఈ మేరకు మొక్కలు 12 వేర్వేరు పోషకాలను తీసుకుంటాయని, వాటి పెరుగుదల దశ ఆధారంగా ఆయా పోషకాలు అవసరమవుతాయని తెలుసుకున్నాడు. కాగా వేసవిలో మనం ఆయిలీ గ్రీసీ పదార్థాలకు ఎలా దూరంగా ఉండాలనుకుంటున్నామో మొక్కలు కూడా వేసవి నెలల్లో పర్టిక్యులర్ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంటాయని గ్రహించాడు. ఇలా మొక్కలకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ అర్థం చేసుకోవడానికి సచిన్, శ్వేత టెక్నాలజీ సాయం తీసుకున్నారు. ఇండియాలో ఫామ్ ఏర్పాటు చేసే ముందు ఆస్ట్రేలియా లో ఓ ప్రోటోటైప్ (నమూనా) తయారు చేశాం. మొదటి ప్రాజెక్ట్ లో భాగంగా ఇండియాలో 4 ఎకరాల కూరగాయలు, హెర్బ్స్ మొక్కలను పెంచారు. నాణ్యత, తాజాదనంతో కూడిన కూరగాయలను కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. అందులోనూ ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడటం లేదు. ఇలా పండించిన వాటిని సూపర్ మార్కెట్లు, హోటళ్ల తో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న వివిధ సంస్థలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఇక ఔషధ సంస్థలతో కలిసి పనిచేసేటప్పుడు వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మొక్కలు అందించాలి. ఈ విషయంలో వాళ్ళు ఓ క్యూఆర్ బెస్ట్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీని ఆధారంగా ఎవరు విత్తనాలు వేశారు, ఆ సమయంలో ఏ వాతావరణ పరిస్థితులు ప్రబలంగా ఉన్నాయి.. దాని నిర్వహణ ఎలా ఉంది, పండించినప్పుడు బరువు ఎంత ఉంది, మొదలైన సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.
14 రకాల పాలకూరలు, 10 రకాల మూలికలతో పాటు టమోటా, క్యాప్సికం, మిరియాలు, వివిధ మైక్రోగ్రీన్స్ తో తొలిసారిగా మా సింప్లీ ఫ్రెష్ ప్రస్థానం మొదలైంది. మేము ప్రతి మొక్కను సూక్ష్మంగా ప్రొఫైల్ చేశాం. డే వన్ నుంచి పంట కోసే భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో వాటి పోషక అవసరాలను అర్థం చేసుకున్నాం. పుట్టినప్పటి నుంచి పిల్లలు ఎదిగే వరకు వారి న్యుట్రిషన్ నీడ్స్ మారుతుంటాయి. అదే విధంగా మొక్కలకు కూడా వాటి లైఫ్ సైకిల్ క్రమంలో వేర్వేరు పోషకాలు అవసరమవుతాయి. 2018 నుంచి పసుపు, అల్లం, అశ్వగంధ కూడా పండిస్తున్నాం. సిద్ధిపేటలోని పట్లలో 150 ఎకరాల విస్తీర్ణం లో మా సింప్లీ ఫ్రెష్ ను 2018 లో విస్తరించాం. ప్రతి రోజూ 8 వేల కిలోల వెజిటేబుల్స్ ఉత్పత్తి చూసున్నాం. ఇక మా సంస్థలో మొత్తంగా 170 మంది ఉద్యోగులుండగా స్థానికులకే అవకాశాలు కల్పించాం అని సింప్లీ ఫ్రెష్ కో ఫౌండర్ చెప్పారు.

Leave Your Comments

చీడపీడల నుంచి పంటను కాపాడుకునేందుకు కొత్త ఆవిష్కరణ..

Previous article

జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్.. ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు

Next article

You may also like