NHB Training Program: వాణిజ్యస్థాయిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు రాబట్టగలిగే పంటలు పండిస్తారని, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అమలుపరుస్తూ .. కొత్త కొత్త మెళుకువలు అవలంబిస్తారనే ఉద్దేశంతో నేషనల్ హార్టికల్చర్ బోర్డు వారు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
కృషి విజ్ఞాన కేంద్రం, మదనాపురంలో “జాతీయ ఉద్యాన పంటల సంస్థ పథకాల పై అవగాహన/ శిక్షణ కార్యక్రమం” మరియు “ఉధ్యాన పంట ల సాగు – రైతు ఆదాయము రెట్టింపు” అను అంశం ల పై ఒక రోజు శిక్షణా కార్యక్రమము, శనివారం (జూన్ 24 వ తేదీ) న జరుగుతుంది.
Also Read: Drone Pilot Training: వ్యవసాయానికి ప్రత్యేకమైన డ్రోన్స్ తయారీ.!

NHB Training Program
ఈ శిక్షణా కార్యక్రమము లో National Horticulture Board, Hyderabad వారు, వాణిజ్య స్థాయి లో కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు మొదలైన ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు, పాలి హౌజ్ ల లో సాగు చేయాలనే రైతులకు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలనుకునే రైతులకు, పండ్లు కూరగాయలు ఎగుమతి చేయాలనుకునే రైతులకు, ఉద్యాన పంటల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే వ్యాపారవేత్తల కు కేంద్ర ప్రభుత్వం, NHB ద్వారా ఇచ్చే పథకాల గురించి, సబ్సిడీ ల గురించి, ఉద్యాన పంటల సాగు లో మెలుకువ ల గురించి రైతు లకు వివరిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమము లో ఉచిత బోజన వసతి, టీ, స్నాక్స్ కలదు. ఆసక్తి గల రైతులు, శని వారం ఉదయం 10:00 గంటలకు కే.వి.కే మదనాపురం కు రాగలరు.
Also Read: Chekurmanis: పోషకాల నిలయమైన కొత్త పంట చెకుర్మనిస్ సాగు వివరాలు.!