Pulses Rate: మనం తినే రోజు ఆహారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలు ఏ ఆహార పదార్థాలని కొనుగోలు చేసి తిన్నె పరిస్థితిలో లేరు. ఈ మధ్య కాలంలో పప్పుల ధర ఆకాశాన్ని తాకుతుంది. పప్పుల ధరని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బృంధాలతో చర్చలు చేశారు. ఈ సంవత్సరం 10 లక్షల టన్నులు కంది పప్పుని దిగుమతి చెయ్యాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దానితో పాటు పప్పు నిల్వ చెయ్యడానికి కోల్డ్ స్టోరీజ్ నిర్మించాలి అని చర్చించారు.
ఈ సంవత్సరంలో అకాల వర్షాలు, వేడి గాలుల వల్ల కంది సాగు దిగుబడి చాలా ప్రాంతాల్లో తగ్గింది. పప్పులే కాదు కూరగాయలు, మన నిత్యావసర వస్తుల ధర పెరిగిపోవడం జరిగింది. రోజు రోజుకి కంది పప్పు ధర పెరుగుతూనే ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో 30-40 రూపాయలు పెరిగి, దంతో ఇప్పుడు కంది పప్పు ధర 160-170కి వచ్చింది. ఇంత ధరతో సామాన్య ప్రజలు కంది పప్పు తిన్నాలి అన్న ఆలోచనలో కూడా లేదు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 7. 90 లక్షల టన్నుల కంది పప్పు ఉత్పత్తి తగ్గింది. ఈ సంవత్సరం 45.50 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 34. 30 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింది. ఈ సంవత్సరం దుగుబడి తక్కువ ఉండటంతో కంది పప్పు సాగు పెంచాలి అని రైతులకి చెప్పారు. దానితో పప్పు నిల్వ పరిమితి పెంచడానికి చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. ఈ సంవత్సరం 10 లక్షల టన్నులు వరకు దిగుమతి చెయ్యాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసిన పప్పును పర్యవేక్షించడానికి కమిటీని కూడా నిర్ణయం తీసుకున్నారు.
మన దేశంలో పప్పుకి ఉన్న డిమాండ్‌కి ఉత్పత్తి జరగడం లేదు. ప్రతి సంవత్సరం మన దేశం కంది పప్పు దిగుమతి పెంచుతూనే ఉంది. ఈ ఏడాదిలో భరత్ ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుల దిగుమతి దేశంగా గుర్తించారు. ఆఫ్రికా, మయన్మార్, కెనడా దేశాల నుంచి మన దేశం అత్యధికంగా పప్పులను దిగుమతి చేసింది. మన పెద్ద వాళ్ళు అప్పు చేసి పప్పు కుడు తిన్నామన్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పప్పు కుడు తిన్నాలి అంటే కచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సామాన్యుడి పరిస్థితి.
Also Read: Desert Vegetable Farming: ఎడారిలో కూరగాయల సాగుకి 5 లక్షల లాభాలు ఎలా.!?