Desert Vegetable Farming: ఎడారిలో పంటలు పాండవు అని అందరూ అనుకుంటారు. కాని రాజస్థాన్ రైతు సత్యనారాయణ ఎడారిలో కూడా వ్యవసాయం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. మనకి రాజస్థాన్ అన్నగానే ఎడారి, ఒంటె, టెర్రకోట హస్తకళలు గుర్తు వస్తాయి. ఈ రైతు అందరికి బిన్నంగా ఎడారిలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండిస్తూ మంచి లాభాలని పొందుతున్నారు. వ్యాపారాలు ఎడారిలో కూడా ఇసుకను అమ్ముతూ వ్యాపారం చేసే వారిని వ్యాపారస్తులు అన్నే రోజు నుంచి రైతులు ఎలాంటి ప్రదేశంలో అయినా వ్యవసాయం చెయ్యగలరు అని సత్యనారాయణ రైతు నిరూపించారు.
సత్యనారాయణ అతనికి ఉన్న భూమిలో పొట్లకాయ, గుమ్మడి, బెండ కాయ సాగు చేస్తున్నాడు. అందరూ పచ్చగా, తాజాగా ఉండే కూరగాయలని కొన్నాడానికి ఇష్టపడుతారు. ఈ రైతు తన పంట పొలానికి మంచి నీళ్లు వాడుకుంటూ, సేంద్రీయ పద్దతిలో కూరగాయలను పండిస్తారు. అందుకే ఇతని పొలంలోని కూరగాయలు తాజాగా, మంచి రుచితో ఉండడంతో అందరూ ఇతని దగ్గరే కూరగాయలు కొన్నాడానికి ఆసక్తి చూపుతారు.
Also Read: Damask Rose Oil: ఈ పూవ్వుల నూనె కిలో 12 లక్షలు..
పంటలు వేసే ముందు పొలాన్ని రెండు, మూడు సార్లు దున్ని తర్వాత నాలుగు నుంచి అయిదు ట్రాక్టర్ల సేంద్రీయ ఎరువును పొలంలో వేసి మల్లి దున్నుతాడు. ఆ తర్వాత పొలంలో విత్తనాలు విత్తుతారు. బెండకాయ 15-20 సెంటి మీటర్ల దూరంలో విత్తుతారు. సొరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ 100 సెంటి మీటర్ల దూరంలో విత్తుతారు. విత్తనాలు విత్తిన తర్వాత రోజు పోలంకి తగ్గినంత నీళ్లు అందించాలి. ఈ కూరగాయ పంటలు 50 రోజులో కోతకి వస్తాయి.
మూడు నెలలు తర్వాత కూరగాయలు పంటలు అని ఉత్పత్తికి వస్తాయి. ఈ కూరగాయలు అమ్ముకొని రోజుకి పెట్టుబడి తీసాక 1000-1500 వరకు లాభాలు వస్తాయి. దిగుబడి బాగున్నా రోజు 2000-3000 వేలు వరకి లాభాలు వస్తాయి. ఈ కూరగాయల సాగుతో సంవత్సరానికి పెట్టుబడి పోను 5 లక్షల వరకు లాభాలు వస్తున్నాయి. ఈ రైతు పండించిన కూరగాయలను రుచి బాగుండడంతో స్థానికులు ఎక్కువగా ఈ రైతుతో కూరగాయలు కొంటున్నారు.
Also Read: Intercropping: అంతర పంటలు – ఆవశ్యకత