Weather Forecast: జూన్ నెల పూర్తి కావడానికి వచ్చింది కానీ ఇప్పటికి వర్షాలు రాలేదు. రైతులు దుక్కి దున్ని విత్తనాలు విత్తడానికి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం జూన్ నెల వరకు రైతులు విత్తనాలు విత్తుకోని కలుపులు, పంటకి పురుగుల మందులు పిచుకరీ చేశారు. ఈ సంవత్సరం వర్షాలు కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. ఈ వర్షాకాలం ఇంకో రెండు, మూడు రోజులో మొదలు అవుతుంది అని పొర్ఫెస్సోర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకి చెపుతుంది. విత్తనాలు విత్తుకునే సమయం దాటిపోలేదు అని విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
ఈ నెల కేరళకి వచ్చిన రుతుపవనాలు మన రాష్ట్రంలో జూన్ 8న వచ్చేవి కానీ గుజరాత్లో తుఫాన్ ఏర్పడం ద్వారా మన రాష్ట్రానికి రుతుపవనాలు రావడం ఆలస్యం అవుతుంది. ఈ సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు సాధారణం ఉంటాయి అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇంకో రెండు, మూడు రోజులో కురిసే వర్షాలకు విత్తనాలు విత్తుకోవడానికి శాస్త్రవేత్తలు రైతులకి కొన్ని సలహాలు ఇస్తున్నారు.
వరి పంట వేసుకోవాలి అనుకున్న రైతులు ఇప్పుడు నారు పోసుకొని, తక్కువ పంట కాలం ఉన్న వరి రకాన్ని ఎంచుకోవాలి.తక్కువ వరి కాలం ఉన్న వరిని నాటుకోవడానికి పొలం దున్నుకొని లేదా దున్నకుండా వేసుకోవచ్చు.
Also Read: Smart Agriculture: స్మార్ట్ వ్యవసాయంతో కోటి రూపాయల టర్నోవర్.!
పత్తి పంట విత్తనాలు జులై 20 వరకు విత్తుకోవచ్చు. నేలని బట్టి విత్తనాలని 50-70 మిల్లీమీటర్లు విత్తుకోవాలి. పత్తి విత్తనాలు వర్షాలు వచ్చాకనే విత్తుకోవాలి. పత్తితో పాటు అంతర పంటగా కందులు. మినుములు వేయడం ద్వారా రైతులకి మంచి లాభాలు వస్తాయి.
కంది పంట అంతర పంటగా లేదా కాష్ క్రాపగా పొలంలో వేసుకోవచ్చు. ఈ పంట విత్తనాలు ఆగష్టు 15 వారికి విత్తుకోవచ్చు. కందిని అంతర పంటగా వేసుకోవాలి అనుకుంటే కందితో పాటు పెసర, మినుములు, వేరుశనగ, పత్తి, వేసుకోవచ్చు.
మొక్కజొన్న పంట జులై 15 వారికి విత్తుకోవచ్చు, నీళ్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో వేయకూడదు. మొక్కజొన్న పంట సాళ్ల పద్దతిలో వేసుకుంటే మొక్కల మధ్య గాలి, వెలుతురు వెళ్లి మొక్కలు బాగా పెరిగి, మంచి దిగుబడి వస్తుంది.
పెసర, మినుము, సోయాచిక్కుడు విత్తనాలు జూన్ ఆకరి నుంచి జులై 15 వరకు విత్తుకోవచ్చు. వరుసల మధ్య దూరం ఎక్కువగా నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది. అంతర పంటగా ఆముదము, పొద్దు తిరుగుడు పూవు, ఉలవలు వేసుకోవడం ద్వారా రైతులకి మంచి లాభాలు వస్తాయి.
అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు విశ్వవిద్యాలయం శాత్రవేత్తలు చెప్పిన సలహాలు కాస్త ఊరట లభించింది. రైతులు వర్షాల కోసం ఎదురుచూపులు ఆడిపోయే, పొలం పనులకి సిద్ధం కావాలి.
Also Read: Heatwaves: పంటల పై వడగాలుల ప్రభావం.!