Primary Agricultural Co-operative Societies: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (రిజిస్టరు సహకార సంఘం) తన సభ్యులకు రుణ సాయం, ఇతర సేవలనందిస్తుంది. సాధారణంగా పి.సి.యస్‌లు సభ్యులకు ఈ క్రింది సదుపాయాలను కలుగజేస్తాయి.
. నగదు లేదా ఇతర రూపంలో వనరులు సదుపాయాలు.
. అద్దె చెల్లింపు ద్వారా వ్యవసాయ పనిముట్లు.
. నిల్వ సౌకర్యం.
కొన్ని పిసిఎస్. యస్‌లు రైతుల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా సాయపడుతున్నాయి. సాధారణంగా పి.సి.యస్‌లు సభ్యుల రుణ అవసరాలను తీరుస్తుంటాయి. అయితే రైతులకు ఇతర సేవలను కూడా అందించాల్సిన అవసరమైంది. రైతులు అన్ని అవసరాలను తీర్చేవిధంగా వీటిని ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి లాభాలు చేకూరాలంటే, రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ప్రోత్సహించటమే కాకుండా నిల్వలో నష్టాలు తగ్గించడానికి తమ ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వ చేసుకోడానికి, అరువు ఖాళీని పూరించడానికి తనఖా పెట్టుకొని రుణాలివ్వాలి.
కాలానుగుణంగా తలసరి భూకమతాల పరిమాణం తగ్గిపోతున్న తరుణంలో రైతులు వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేయడం వ్యయంతో కూడుకున్నపని. అంతే కాకుండా ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన అనేక నూతన ఆవ్కిరాలను రైతుల పొలాల్లోకి తీసుకురావాలసిన అవసరం ఎంతైనా ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక దిగుబడి, వంగడాల వాడకం పంట దిగుబడులను పెంచుతాయి.
చాలా మంది రైతులు తమ తక్షణ రుణ అవసరాల కోసం తమ వ్యవసాయ ఉత్పత్తులను నష్టానికి అమ్ముకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సన్న, చిన్నకారు రైతులు తమ ఉత్పత్తులను నిల్వచేసుకొని, వాటిని తాకట్టు పెట్టుకొని రుణాలు పొందడానికి సరైన నిల్వసౌకర్యాలు లేవు.
Also Read: Nursery Management Training Program: ఉద్యాన పంటల్లో నర్సరీ యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం.!
రైతులకు ఈ సౌకర్యాలను కలిగించడానికి పి.ఎ.సి. యస్‌లు ముఖ్య పాత్రవహిస్తాయి. పి.ఎ.సి.యస్ వాణిజ్య పరిధిని ఏర్పడటానికి, అద్దె చెల్లించి వ్యవసాయ పనిముట్లను వాడుకోవడానికి, కావలసిన వనరులను కలిపి కొనుగోలు చేయడానికి, ‘‘నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసీట్ సిస్టం’’ ప్రకారం నాణ్యత గల గిడ్డంగి నిల్వ సామర్ధ్యం పొందడానికి పి.సి.యస్‌లు అదనపు సేవలందించాలి. ఈ ప్రకారం పి.ఎ.సి.యస్‌లు రైతులకు ఈ క్రింది సౌకర్యాలను కలిగించాలి.
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం (ఆగ్రో – స్టోరేజి సెంటర్) :
ప్రస్తుతం నిల్వ సౌకర్యాన్ని పెంచడం లేదా కొత్త గోడౌన్ నిర్మాణంతోపాటు గోడౌన్ అక్రెడిటేషన్ చేయించి, నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసీట్ సిస్టం క్రింద వేర్‌హౌస్ రసీదులివ్వడానికి ఇది అవకాశం కలిగిస్తుంది. ఈ రసీదుల ఆధారంగా రైతులు తాము నిల్వ చేసుకున్న ఉత్పత్తులపై రుణం పొంది తదుపరి పంటకాలంలో పంటలు పండిరచుకోవచ్చు. ఈ విధంగా రైతులు తమ పంటలను నిల్వ ఉంచుకొని మూలధన స్థితికిబ్బంది లేకుండా గిట్టుబంటు ధరలను పొందవచ్చు.
వ్యవసాయ సేవా కేంద్రం (ఆగ్రో -సర్వీస్ సెంటర్) :
ఫవర్ టిల్లర్, ల్యాండ్ రెవలర్, రోటరీ స్ల్లాషర్, మూవర్స్, సీడ్ డ్రిల్లర్, మల్టీ క్రాప్ ప్లాంటర్, ఫ్యాడీ ట్రాన్స్ ప్లాంటర్, స్ప్రేయర్స్, కంటైనర్ హార్వెస్టర్ మొదలైన వ్యవసాయ యంత్రాలను కొని రైతులకు అద్దెకివ్వాలి. ఈ యంత్రాలపై వచ్చే అద్దె పి. ఎ.సి. యస్ సంపాదన.
ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ :
1. ప్రైమరీ ప్రాసెసింగ్ :
సార్టింగ్, గ్రేడిరగ్ యూనిట్, వ్యాక్సింగ్ / పాలిషింగ్ యూనిట్, ప్రీి కూలింగ్ చాంబర్స్ మొదలైనవి.
2. సెకండరీ ప్రాసెసింగ్ : ఉత్పత్తుల విలువ పెంచడం.
ఉదా : మినీ రైస్‌మిల్, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ మొదలైనవి.
వ్యవసాయ సమాచార కేంద్రం : భూమి, నీరు, పరీక్షా కేంద్రం, డబ్బు చెల్లించి సేవలు పొందడానికి నిపుణుల ప్యానెల్ ఏర్పాటు, జ్ఞానాన్ని వ్యాపింపచేసే కేంద్రం, రైతులకు శిక్షణనిచ్చే ఏర్పాటు, పరీక్షా కేంద్రాల, నిపుణుల సలహాలు మొదలైనవి.
ఆగ్రి-ట్రాన్సోపోర్టేషన్`మార్కెటింగ్ సదుపాయాలు :
ఉత్పత్తులను సంపాదించుట, ఉత్పత్తులను చేర్చుట లేదా ప్రాసెసింగ్, రూరల్ మార్ట్ ఏర్పాటు చేయడం మొదలైనవి మార్కెటింగ్ చేస్తున్న లేదా చేయదలుచుకున్న పి.ఎ.సి.యస్ లు ఈ ఛానెల్‌ను ఏర్పరుచుకొని రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్గించవచ్చు.
Also Read: Rice Cultivation Methods: వరి సాగు లో వివిధ రకాల విత్తే పద్ధతులు మరియు వాటి యొక్క పూర్తి వివరణ