వ్యవసాయ పంటలు

Cashew Value Added Products: జీడిమామిడి పండుతో విలువ ఆధారిత ఉత్పత్తులు.!

0
Cashew Value Added Products
Cashew Value Added Products

Cashew Value Added Products: జీడిమామిడి మన దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న తోట పంటలలో ఒకటి. మన దేశంలో జీడిపిక్కల ఎగుమతి మరియు జీడి గింజల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఈ పంటను ప్రధానంగా జీడి గింజలు కొరకు మాత్రమే పండిస్తున్నారు. దీనివలన జీడి పిక్కతో పాటు వచ్చే జీడి పండు ఒక విలువైన ఉత్పత్తిగా పరిగణించట్లేదు. అందువలన సుమారు 5,73,000 మిలియన్‌ టన్నుల జీడి పండ్లు వృధాగా పడేస్తున్నారు. మిగతా పండ్ల వలె జీడి పండ్లలో కూడా చాలా పోషక విలువలున్నాయి. పూర్తిగా పండిన పండు రసంతో కూడి గాఢమైన వాసనతో మంచి చక్కెర సాంద్రతను, బలమైన రుచిని మరియు తక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్‌ ‘‘సి’’ అధికంగా ఉంటుంది, ఇది నారింజ రసం కంటే ఆరు రెట్లు ఎక్కువ మరియు పైనాపిల్‌ రసంలో కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.

అదేవిధంగా టానిన్లు, కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌ వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు థయామిన్‌, నియాసిన్‌ మరియు రిబోఫ్లావిన్‌ విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మంచి పోషక విలువలు ఉన్న కానీ ఈ పండు వినియోగం చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణాలు, ఎక్కువ సమయం నిల్వ ఉండక పోవడం, వగరైన రుచి, అదే విధంగా ఎక్కువ నీరు శాతం (85-90 %) మరియు చక్కెర శాతం (55-65%) ఉండడం వలన ఎక్కువగా సూక్ష్మజీవుల యద్దడికగురై తొందరగా పాడైపోతుంది. సరైన ప్రొసెసింగ్‌ పద్ధతులపై అవగాహన లేక జీడి పండుతో వచ్చే ఉత్పత్తులు తయారీపై శ్రద్ద తక్కువగా ఉంది. ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా స్వల్ప లేదా దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు జీడి పండు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ గురించి తెలుసుకుందాం…..

1.జీడి పండు రసం :
జీడిపండు రసం తయారీ విధానం చాలా సులభమైన పద్ధతి, పండిన జీడి పండును శుభ్రంగా కడగాలి. కడిగిన పండ్లను 80-850 సెం. ఉన్న వేడి నీళ్ళల్లో 7 నిమిషాలు ఉంచాలి. దీని తర్వాత 10 నిమిషాల పాటు 2 % ఉప్పు నీళ్ళలో ఉంచాలి. ఈ పద్ధ్దతుల వల్ల కొంతవరకు జీడిపండ్ల వగరు తగ్గుతుంది. తర్వాత, బాస్కెట్‌ ప్రెస్‌, స్క్రూ ప్రెస్‌ లేదా హైడ్రాలిక్‌ ప్రెస్‌ వాడి జీడిపండు నుండి రసం తీయవచ్చు. తీసిన 8 నుండి 10 లీటర్ల రసానికి పది గ్రాముల పాలీ వినైల్‌ పైరోలిడోన్‌ కలిపి మరియు వడపోత కోసం మస్లిన్‌ క్లాత్‌ ద్వారా వడపట్టాలి. వడపట్టిన రసం 20 నుండి 40 నిమిషాల తర్వాత స్థిరపడుతుంది. స్థిరపడిన రసానికి లీటరుకు 0.5 కిలోలు చక్కెర చొప్పున కలపాలి. చివరకు మొత్తం రసానికి 6 గ్రాముల సోడియం బెంజోయేట్‌ మరియు సిట్రిక్‌ యాసిడ్‌ వంటి ప్రిజర్వేటివ్‌లు కలపడం ద్వారా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

2. జీడిపండు స్క్వాష్‌ :
వడపట్టిన లీటరు రసానికి 2 కిలోలు చొప్పున చక్కెరను కలిపి వేడి చేయాలి. బాగా మరిగించిన తరువాత చివరిలో 6 గ్రా. సోడియం బెంజోయేట్‌ మరియు 100 గ్రా. సిట్రిక్‌ యాసిడ్‌ వంటి ప్రిజర్వేటివ్‌లను కలపాలి. చక్కెర మరియు సిట్రిక్‌ యాసిడ్‌ యొక్క సాంద్రతను ఒకే స్థాయిలో నిలపడం ద్వారా జీడిపండు స్క్వాష్‌ను ఎక్కవ రోజుల పాటు నిల్వ చేయవచ్చు. ఒక గ్లాసు రసం చేయడానికి స్క్వాష్‌ని మూడు వంతుల నీటితో పలుచన చేసి వాడుకోవచ్చు.

3. జీడిపండు సిరప్‌ :
వడపోసిన జీడి పండు రసానికి 1 లీటరుకు 3 కిలోల పంచదార కలుపుకొని తక్కువ సెగతో వేడి చేయాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు మిశ్రమాన్ని నిరంతరం కదిలించాలి. అప్పుడు 15 గ్రా. సిట్రిక్‌ యాసిడ్‌ను చిన్న పరిమాణంలో తయారు చేసిన సిరప్‌తో కరిగించుకొని మిగతా మిశ్రమానికి కలుపుకోవాలి. ఒక గ్లాసు రసాన్ని తయారు చేయడానికి, సిరప్‌ని ఐదువంతుల నీటితో పలుచన చేసి వాడుకోవచ్చు.

4.ఫెన్నీ :
ఫెన్నీకి 2009లో గోవా నుండి ప్రత్యేక ఆల్కహాలిక్‌ పానీయంగా జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రేషన్‌ లభించింది. అది జీడి పండు రసాన్ని పులియబెట్టడం మరియు స్వేదనం ప్రక్రియకు ద్వారా తయారు చేస్తారు. ఇందులో భాగంగా పండిన జీడి పండును సేకరించి, రసం తీసి, పులియబెట్టి, స్వేదనం ప్రక్రియకు గురిచేస్తారు. ఫెన్నీలో ఇథనాల్‌ (42.85%), ఎసిటిక్‌ ఆమ్లం (12.28%), ఇథైల్‌ అసిటేట్‌ (55.97%), ఎసిటాల్డిహైడ్‌ (18.28%), ఫర్ఫ్యూరల్‌ (3.22%) మరియు కాపర్‌ (1.04%) ప్రధాన అంశాలు.

5. జీడిపండు వైన్‌ :
తాజాగా పండిన, కలుషితాలు మరియు సూక్ష్మజీవులు లేని జీడిపండలను తీసుకొని, శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. తరువాత, ఈ జీడి పండులో టానిన్‌లు ఉంటాయి, దానిని తగ్గించడానికి చర్య తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి, టానిన్‌ తగ్గడం కోసం జీడి పండ్లను 5 శాతం ఉప్పు ద్రావణంలో 2-3 రోజులు ముంచి ఉంచాలి. తరువాత 15 నిముషాల పాటు 15 శ్రీప వద్ద ఆవిరిలో ఉడికించాలి. ఈ ఆవిరి ప్రక్రియను ప్రెజర్‌ కుక్కర్‌ లేదా ఆటోక్లేవ్‌ ఉపయోగించి కొనసాగించవచ్చు. ఆవిరితో ఉడికించిన యాపిల్స్‌ను స్క్వీజర్‌ లేదా గ్రైండర్‌ ఉపయోగించి చూర్ణం చేసి, గరిష్ట రసంను సేకరించి, మస్లిన్‌ క్లాత్‌ని ఉపయోగించి ఫిల్టర్‌ చేయాలి . ప్రిజర్వేటివ్‌ సోడియం మెటాబై సల్ఫైట్‌ 1గ్రా./లీటరు రసంలో కలుపుతారు. లీటరుకి 1 కిలో చక్కెర మరియు 6 గ్రా. టార్టరిక్‌ యాసిడ్‌ 17 డిగ్రీల బ్రిక్స్‌కు చేరుకునే వరకు నిరంతరం కదిలించడంతో రసం తయారీ పూర్తి అవతుంది. సక్కరోమైసస్‌ సెరివేసియే బయానస్‌ అనే బాక్టీరియాను 2 శాతం తయారు చేసిన మిశ్రమానికి కలిపి గది ఉష్ణోగ్రత వద్ద (28G3 డి.సెం.) వరుసగా 6 రోజుల పాటు పులియబెట్టాలి. చివరి దశలో ఉత్పత్తి యొక్క మొత్తం చక్కెరల శాతం 2-30 బ్రిక్స్‌ కలిగి ఉండేలా చూసుకోవాలి.

6. జీడిపండు వెనిగర్‌ :
జీడి పండు వెనిగర్ను రెండు దశల్లో అనగా ఆల్కహాలిక్‌ పులియబెట్టడం, ఆమ్ల పులియబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. మొదట స్టార్టర్‌ ద్రావణాన్ని సిద్ధం చేయడానికి 2 గ్రా. ఈస్ట్‌ని 20 మి.లీ కొబ్బరి నీళ్లలో కలిపి 12 గంటల పాటు ఉంచాలి.

Also Read: Edula Reservoir: పాలమూరు – రంగారెడ్డిలో ఏదుల పంప్ హౌస్ రెడీ – మంత్రి

Cashew Nut Cultivation: జీడిమామిడి సాగులో ప్రవర్థనం మరియు నాటడంలో మెళుకువలు.!

Cashew Value Added Products

Cashew Value Added Products

జీడి పండు జ్యూస్‌ను శుద్ది చేయడానికి 1 లీటరు జీడి పండు రసంలో స్టార్టర్‌ ద్రావణంతో పాటు 5 గ్రా ఉడికించి చల్లబడిన సగ్గుబియ్యపు జావ జోడిరచలి. ఈ ద్రావణాన్ని పన్నెండు రోజుల పాటు ఆల్కహాలిక్‌ పులియబెటడం కోసం గాజు సీసాలలో పోసి, కాటన్‌ ప్లగ్గింగ్‌తో మూత పెట్టాలి. దానితో మొదటి దశ పులియబెట్టే ప్రక్రియ పూర్తవుతుంది. పన్నెండు రోజుల తర్వాత, పులియబెట్టిన రసాన్ని వడపోత ద్వారా ఇరుకైనమూతగల గాజు సీసాలలో లేదా మట్టి కుండలో పోసి, ఆపై ఆమ్ల పులియబెట్టడం కోసం మూడుసార్లు తల్లి వెనిగర్‌తో కలుపుతారు. ఈ గాజు సీసాలను 15 రోజుల పాటు మస్లిన్‌ క్లాత్‌తో కట్టి, గాలి వెళ్లేలా ఉంచుతారు. ఈ జ్యూస్‌ను శుభ్రమైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రలో ఫిల్టర్‌ చేసి, వేడినీటిలో 10 నిమిషాలు ఉంచడం ద్వారా పాశ్చరైజ్‌ చేసి, 16వ రోజున చల్లార్చి సీసాలో ఉంచితే 5 నుంచి 6 శాతం ఆమ్లత్వం వున్న వెనిగర్‌ లభిస్తుంది.

జీడిపండు మరియు వాటి ఉత్పత్తులలో మంచి విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. సరైన ప్రాసెసింగ్‌ మరియు తయారీ ప్రమాణాల ద్వారా జీడిపండు ఉత్పత్తుల యొక్క ముఖ్యమైన పోషక లక్షణాలను మరియు నాణ్యతను పెంచుకోవచ్చు. ఈ ఉత్పత్తులు జీడి గింజలతో పాటు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తాయి.

Also Read: Stray Cattle Menace: ఉత్తర ప్రదేశ్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్న విచ్చలవిడి పశువులు

Leave Your Comments

Edula Reservoir: పాలమూరు – రంగారెడ్డిలో ఏదుల పంప్ హౌస్ రెడీ – మంత్రి

Previous article

Monsoon Cultivation: వర్షాకాల సాగుకి సూచనలు.!

Next article

You may also like