G20 Agriculture Ministers Meeting Today: హైదరాబాద్‌లో జూన్ 15-17 వరకి G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మన దేశాలకి చెందిన వ్యవసాయ మంత్రులు, విదేశ సంస్థల నుంచి 200 మంది డైరెక్టర్ జనరల్ ఈ G20 వ్యవసాయ సమావేశానికి వచ్చారు.
మొదటి రోజు జూన్ 15న స్టేట్ క్యాడర్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి గారు భారతదేశం వ్యవసాయం రంగాలలో సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ ప్రసంగం మొదలు పెట్టారు. ఈ ప్రసంగం తర్వాత వ్యవసాయ డిప్యూటీల మంత్రుల సమావేశం జరిగింది. డిజిటల్ టెక్నాలజీ,డిజిటల్‌గా డిస్కనెక్ట్ని వ్యవసాయంలో ఎలా వాడుకోవాలో చర్చించారు.
Also Read: Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగుకు ఊతమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

G20 Agriculture Ministers Meeting Today
రెండో రోజు జూన్ 16న వ్యవసాయ మంత్రులను, ఇతర మంత్రులని, ప్రతినిధులని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తన ప్రసంగంతో అందరిని స్వాగతించారు. ఈ రోజు సమావేశంలో ఆహార భద్రత,పోషకాహారం లోపాలు, సామూహిక వ్యవసాయం, వ్యవసాయంలో మహిళల ప్రధాన పాత్ర, మహిళలు చేసే వ్యవసాయం, సామూహిక జీవవైవిధ్యం, వాతావరణ పరిస్థితిలో మార్పులు, పరిష్కారాల గురించి మంత్రులు చర్చించారు.
మూడవ రోజు జూన్ 17న సమావేశాలు పూర్తి చేసే ముందు అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్, G20, ఇండియన్ ప్రెసిడెన్సీ ఫలితాలను తెకియజేస్తారు. ఆ తర్వాత ICAR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కి G20 సభ్యలు అందరూ వెళ్తారు.
Also Read: Cashew Nuts Price: తెల్ల బంగారంకి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలి.!