Cashew Nuts Price: మన దేశంలో చాలా పంటలకి మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో మద్దతు ధర 1966-67లో మొదలు పెట్టిన ఇప్పటికి అన్ని పంటలకి కనీస మద్దతు ధర లేదు. మద్దతు ధర లేకపోవడం వల్ల దళారులు రైతులు పండించిన పంటకి వాళ్ళ ఇష్టం వచ్చిన ధర పెట్టికి రైతులను ఇబ్బంది పెడుతుంటారు. మనం రోజు ఇష్టంగా తిన్నె జీడిపిక్కలకు ఇప్పటికి కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించలేదు.
ఈ జీడిపిక్కలని తెల్ల బంగారంగా పిలుస్తారు. ఈ జీడిపిక్కలని శ్రీకాకుళం జిల్లాలో 50 వేల ఎకరాలలో రైతులు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళకి ప్రధాన జీవనోపాధి జీడిపిక్కలని సాగు చేయడం. ఈ జీడిపిక్కలకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు బాధ పడుతున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధర ఇంకా తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కానీ విదేశాల నుంచి దిగుమతులు చేయడం ఆగడం లేదు.
Also Read: Rice Under Threat: ప్రపంచాన్ని పోషించే వరి పంటకి ముప్పు.!
జీడిపిక్కలు సాగు చేయడానికి ఎక్కవ పెట్టుబడి అవసరం. ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల సరైన ధర లేనందున రైతులు చాలా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఒక బస్తాకి 80 కిలోలకి 7వేల ధర కూడా లేదు. ఈ సంవత్సరం మొదటిలో ఒక బస్తా 8500 వరకి ఉండేది, నెల రోజుల వరకి కూడా 8000 ఉండే ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన ధర వల్ల రైతులు జీడిపిక్కలను అమ్మకుండా ఇంటి దగ్గర నిలువ చేస్తూ గిట్టుబాటు ధర కోసం చూస్తున్నారు.
ప్రభుతం జీడిపిక్కలకు మద్దతు ధర ఇవ్వాలి అన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులతో కలిసి ప్రజా సంఘ నేతలు, ప్రజాప్రతినిధులు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి దళారులు జీడిపిక్కలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
Also Read: Cauliflower Cultivation: రంగు రంగుల కాలీఫ్లవర్ మీరు సాగు చెయ్యాలి అనుకుంటున్నారా.?