Commercial Mushroom Cultivation:మన దేశంలో చాలా మంది రైతులు తాను పండించిన పంట పెట్టుబడి కూడా రావడం లేదు అని బాధపడుతున్నారు. మరి కొంత మంది రైతులు వ్యవసాయంలో అద్భుతాలు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీ వాడుకుంటూ, చాలా తక్కువ పెట్టుబడితో బీహార్ రైతు రామచంద్ర మూడు నెలల్లో రెండు లక్షల ఆదాయం పొందారు. రామచంద్ర గారు కేవలం 6 వేలు పెట్టుబడి పెట్టి వాణిజ్య పంటని సాగు చేస్తూ మంచి లాభాలని పొందుతున్నారు.
రామచంద్ర గారు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని వాడుకుంటూ పుట్టగొడుగులను సాగు చేస్తున్నారు. బీహార్ ప్రభుత్వం హార్టికల్చర్ మిషన్ పథకంతో మొలకెత్తిన పుట్టగొడుగులను బ్యాగ్‌లతో అమ్ముతుంది. మార్కెట్లో ఒక మొలకెత్తిన పుట్టగొడుగుల బ్యాగ్ 70 వరకి అమ్ముతున్నారు. బీహార్ ప్రభుత్వం 90 శాతం సబ్సిడితో 6 రూపాయలకే రైతులకి ఇస్తుంది. ఈ మొలకెత్తిన పుట్టగొడుగులను తీసుకొని వచ్చి ఒక చీకటి గదిలో పది రోజుల పాటు సాగు చేయాలి. పది రోజులో పుట్టగొడుగులను కట్ చేసి మార్కెట్లో అమ్ముకోవాలి.
Also Read: Shatavari Health Benefits: శతావరి చూర్ణం తీసుకోవటం వలన స్త్రీలలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రామచంద్ర గారు ఈ పథకం సబ్సిడీ ద్వారా ఒక బ్యాగ్ 6 రూపాయలకి 100 బ్యాగ్లు కొని చీకటిగా ఉండే ఒక పాక లాంటింది ఏర్పాటు చేసారు. ఈ పుట్టగొడుగులకు రోజుకి రెండుసార్లు నీళ్లు ఇవ్వాలి. ఒక బ్యాగ్ మొలకెత్తిన పుట్టగొడుగులు 10 రోజులో 3-4 కిలోలు అవుతాయి. మూడు నెలలో 6 వేలు పెట్టుబడి తెచ్చిన పుట్టగొడుగులకి రెండున్నర లక్షలు లాభం పొందారు.
మార్కెట్లో ఈ పుట్టగొడుగులు కోలి 70-80 వరకి కొంటున్నారు కానీ రిటైల్‌లో అమ్ముతే కిలో 100-150 వరకి అమ్ముకోవచ్చు. రామచంద్ర గారు రిటైల్‌లో పుట్టగొడుగులను అమ్ముతూ మంచి లాభాలని పొందుతున్నారు. బీహార్ ప్రభుత్వ హార్టికల్చర్ మిషన్‌ను ఎవరైనా వాడుకోవచ్చు. ప్రభుత్వ వెబ్ సైట్ లాగిన్ అయ్యాక ఆధార్ కార్డు, మీ ఫొటో, మష్రూమ్ ట్రైనింగ్ సర్టిఫికెట్, లేఅవుట్ ప్లాన్, ఎస్టిమేషన్ దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు 15 రోజుల్లో తనిఖీ చేసి వ్యవసాయ కేంద్రం నుండి 90 శాతం సబ్సిడీతో 100-200 వరకి పుట్టగొడుగుల మొక్కలను తీసుకొని సాగు చేయవచ్చు.
Also Read: Agricultural Equipments: రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పరికరాల గురించి తెలుసా.!