Bamboo Rice: భారతదేశంలో ఎక్కువగా అన్నం ప్రధాన ఆహారంగా తింటారు. అన్నం కావాలంటే బియ్యం పండించాలి. వరి పంట నుంచి మాత్రమే బియ్యం వస్తాయి అన్ని మన అందరికి తెలుసు. ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే వెదురు చెట్ల నుంచి కూడా బియ్యం వస్తాయి. ఈ సంగతి ఇప్పటి వరకి ఎవరికి తెలియదు. వరి పంట లాగానే వెదురు చెట్లకు పూత వచ్చి, తర్వాత కంకులు వస్తాయి. సాధారణంగా వెదురు మొక్క పూత పూయదు. వెదురు మొక్క 50 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూత పూస్తుంది. పూతపూశాక వెదురు బియ్యం కంకులు వచ్చి, వెదురు చెట్టు చనిపోతుంది. వెదురు చెట్లు తన జీవిత కాలం మొత్తంలో ఒక్కసారి పూత పూస్తుంది.
అడవిలో ఉండే గిరిజనులు ఎక్కువగా వెదురు బియ్యాన్ని సేకరించి జాగ్రత్తగా దాచుకుంటారు. వెదురు బియ్యం రుచికరమైన, బలవర్ధక ఆహారం. వరి బియ్యం, గోధుమల కంటే తియ్యగా, ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే గిరిజనులు వెదురు బియ్యని దాచుకొని అవసరం ఉన్నపుడు వాడుకుంటారు. కొంతమంది గిరిజనులు అధిక ధరకు అమ్ముకొని ఆదాయ చేసుకుంటారు. అడవుల్లో అరుదుగా దొరకడం, ఎక్కువ పోషక విలువలు ఉండడంతో వెదురు బియ్యం తిన్నాడనికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అందుకే వెదురు బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వెదురు బియ్యం మార్కెట్లో కిలో 500 రూపాయలు వరకి దొరుకుతున్నాయి. ఈ బియ్యం అమెజాన్ , ఫ్లిప్ కార్ట్, ఈ కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు.
ఈ బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ బియ్యం తింటే రక్తంలో కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. ఈ బియ్యంలో విటమిన్ బీ6, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వరి బియ్యం, గోధుమ కంటే ఈ బియ్యంలో ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉంటాయి. కీళ్లు, వెన్ను నొప్పి సమస్యలకి కూడా ఈ బియ్యం మంచిగా పనిచేస్తాయి.
తమిళనాడు , మధ్యప్రదేశ్ , మంగళూరు, కేరళలో గిరిజనులు వెదురు బియ్యాన్ని అడవుల నుంచి తీసుకొని వచ్చి వ్యాపారులతో అమ్ముకొని మంచి ఆదాయం పొందుతున్నారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, కంపెనీలు కూడా అడవుల్లోని వెదురు బియ్యాన్ని గిరిజనుల నుంచి తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి సూపర్ మార్కెట్‌లలో, ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఈ వెదురు బియ్యం వ్యాపారులకి లక్షల్లో ఆదాయం చేసుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు గిరిజనుల నుంచి కిలో 100-150కి కొని మార్కెట్లో కిలో 500కి అమ్ముకుంటున్నారు. ప్రాసెసింగ్ చేసి సూపర్ మార్కెట్లు, ఈ కామర్స్ సైట్లలో అమ్ముకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు.
Also Read: Pineapple Farming: రైతులకి లక్షల్లో ఆదాయం ఇస్తున్న ఈ పంట.!