Vanilla Crop: వ్యవసాయరంగంలో అనేక మార్పులు చేస్తూ, కొత్త విధానాలతో, పంటలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మంచి లాభాలు రావడంతో రైతులు అందరూ కొత్త పంటలు వేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి పంటలో కొత్తగా సాగు చేస్తున్నది వెనీలా పంట. ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా సాగు చేయడం మొదలు పెట్టారు. మన దేశంలో ఎక్కువ ఖరీదు అయిన పంట కుంకుమ పువ్వు, తర్వాత వెనీలా పంట. మడగాస్కర్, పపువా న్యూగినియా, భారత్, యుగాండా దేశంలో వెనీలా పంట సాగు చేస్తున్నారు.
పిల్లల నుంచి పెద్దల వరకి ఎక్కువగా తిన్నె ఐస్‌క్రీమ్‌లో వెనీలా ఫ్లేవర్. వెనీలా పండు సువాసన బాగుంటం వల్ల వెనీలాని కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పర్ఫ్యూమ్స్ వస్తువులలో వాడుతారు. వెనీలా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని వెనిలిన్ అనే రసాయన ద్వారా తొలగిస్తుంది.
Also Read: Subabul Crop: సుబాబుల్ పంట వేసుకొనే రైతులకు సూచనలు.!
వెనీలా పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వ్యాదికి వాడుతారు. వెనీలా పండ్లు పొట్టను శుభ్రం చేయడానికి, రోగ నిరోధక శక్తి పెంచడం, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉండటం వల్ల మార్కెట్‌లో వెనీలా పండ్లు, విత్తనాలకు భారీ డిమాండ్ ఉంది.
వెనిలా సాగు బ్రౌన్ నేలలో చేయాలి, నేల pH 6. – 7. 5 వరకు ఉంటే ఈ భూమిలో మొక్కలు బాగా పెరుగుతాయి. వెనిలా పండ్లు పొడవుగా ఉంది. వెనిలా సాగు 10 నెలల సమయం పడుతుంది. కోతలు కొసాక వాటి నుంచి విత్తనాల్ని వేరు చేయాలి. ఈ విత్తనాలు మనం రోజు తిన్నె ఆహారంలో వాడుతారు. ప్రస్తుతం వెనిలా విత్తనాలు కిలో 40000-50000 ఉంది. వెనిలా పంటను సాగుచేసిన రైతుకు భారీ స్థాయిలో లాభాలు ఉంటాయి.
Also Read: Acharya NG Ranga Birth Anniversary Celebrations: ఘనంగా ఆచార్య ఎన్జి రంగా వర్ధంతి వేడుకలు.!