Subabul Crop: ఈ పంట నుండి గుజ్జు తీసి పేపర్ తయారీలో ప్రధాన ముడి సరుకుగా ఉపయోగిస్తారు.
* ఈ పంట ప్రధానంగా ఉష్ణమండలం,సమసీతోష్ణ మండలాలలో బాగా పెరుగుతుంది. కరువు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది
★ అనువైననేలలు:నల్ల నేలలు,తేలికపాటి చవుడు నేలల్లో బాగా పెరుగుతుంది.లోతయన,సారవంతమయిన ఎక్కువ తేమ లభ్యమయే నేలలు వీటికి మరింత అనుకూలం.కంకర,ఇసుక పొర నేలల్లోనూ పెరుగుతుంది.నీటి నిలువకు తట్టుకోలేదు.
★ దిగుబడి:మూడు సంవత్సరములు నిండిన తరువాత 40 అడుగుల ఎత్తు వరకు పెరిగి ఎకరాకు 40 నుండి 50 టన్నుల దిగుబడి వస్తుంది.ఇలా ప్రతి 3 సంవత్సరాలకు పంట చేతికి వస్తుంది.20 ఏండ్ల జీవిత కాలంలో 5 లేక 6 సార్లు పంటను పొందవొచ్చు.
★ సస్యరక్షణ చర్యలు:ఈ పంట పై ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయనవసరం లేదు.నేలలో సత్తువ ఉంటే బాగా దిగుబడి వస్తుంది.అడవి మొక్కలాగా పెరుగుతుంది.
★ పచ్చిమేత చెట్టు ప్రక్క కొమ్మలను పశువుల మేతగా ఉపయోగించవచ్చు.దీనిలో 34% బలవర్ధక అంశాలు ఉన్నాయి.
★ నాటుటకు అనువైన కాలం:జూన్ నుండి జనవరి
★ నీటి వసతి:ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి మార్చ్ మాసాలలో రెండు సార్లు నీటి తడులు ఇస్తే బాగా పెరుగుతుంది.
★ అనువైన క్లోన్, మొక్కల రకాలు:1851,1852,146,16,636.
★ నాటు విధానం:ఎకరాకు 2700 మొక్కలు పడతాయి.50 × 50 అంగుళాల దూరంతో నాటుకోవాలి.
★ అంతరకృషి:మొక్క నాటిన తరువాత మొక్క చుట్టూ కలుపు తీసుకోవాలి.మరి ఎక్కువవుంటే కలుపు మందు వాడుకోవచ్చు.
★ రాబడి ప్రస్తుత మార్కెట్ ని బట్టి టన్ను ధర మూడు వేల రూపాయలు వరకు పలుకుతుంది.సరాసరి ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది.
★ భవిష్యత్తు:రాబోయే రోజులలో ధర పెరిగే సూచనలు వున్నాయి.
Also Read: Acharya NG Ranga Birth Anniversary Celebrations: ఘనంగా ఆచార్య ఎన్జి రంగా వర్ధంతి వేడుకలు.!