తెలంగాణ సేద్యంమత్స్య పరిశ్రమ

Fisheries in Telangana: తెలంగాణలో చేపలపెంపకానికి అనువైన జాతులు, వాటి యొక్క ప్రాముఖ్యత

2
Fisheries
Fisheries

Fisheries in Telangana: ఇరు తెలుగురాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజల ఆర్ధిక సామాజికాభివృద్ధికి ‘‘సమగ్ర వ్యవసాయ సాగు పద్ధతి’’ ప్రాముఖ్యమైనదిగా భావించింది ప్రభుత్వం. దీనికి మత్స్యరంగాభివృద్ధి యొక్క పాత్ర ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు ఐదులక్షల హెక్టార్ల పైబడివున్న నీటి విస్తీర్ణం మనదేశంలో అత్యధిక నీటి వనరులన్న రాష్ట్రాలలో తెలంగాణారాష్ట్రం ప్రస్తుతము మూడవస్థానంలో ఉన్నప్పటికీ ఆశించినంత ఉత్పత్తిని సాధించలేకపోతున్నాము.

ప్రపంచ దేశాలలో మానవ ఆహార పోషక విలువల కొరతను అధిగమించడానికి అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం మత్స్యరంగం కావున మనప్రభుత్వం ఈ మత్స్యరంగాన్ని గుర్తించి దశ మరియు దిశను నిర్దేశించి, ఉపాధి కల్పనతోపాటు, అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి అందించి తనదైన పాత్ర రాష్ట్ర స్థూలఉత్పత్తిలో పోషిస్తూ ఉన్న నీటివనరుల ద్వారా అధిక మొత్తంలో ఉత్పత్తి సాధిస్తూ, ప్రస్తుతం ఎనిమిదవస్థానం నుండి ముందంజ వేసే దిశగా చైతన్య పరచడమే లక్ష్యసాధనగా కృషి చేయడమనేది శుభపరిణామం.

మన రాష్ట్ర మత్స్య ఉత్పత్తి మొదటిగా నదులు, రిజర్వాయర్లుల వలన అయితే రెండోది చెరువులు, కుంటలు, ట్యాంక్‌ల మీద ఆధారపడుతుంది. ముఖ్యంగా చిన్నకారు, సన్నకారు రైతులను సంఘటిత పరచి, మత్స్యకారులను, ఆక్వా రైతులను చైతన్యపరచి, మత్స్యరంగానికి అవసరమైన చెరువు నిర్మాణము. చేప పిల్లలు, నీటి యజమాన్యం, చేపల మేత, ఆరోగ్య పరిరక్షణ, మార్కెటింగ్‌ సదుపాయాలతో పాటు ఋణ సౌకర్యం, సంక్షేమ పథకాలు మరియు మౌలిక వసతులు కల్పించి అంతర్జాతీయ ప్రమాణాలతో సాగుచేసే ఇతర రాష్ట్రాలు, దేశాలకు దీటుగా మన రైతులను సాగులోను మరియు మార్కెటింగ్లోను సమాయాత్తపరచి అధిక లబ్ది చేకూరే విధంగా ఈ చిన్న ప్రయత్నం చేయడమైనది.

Fishing

Fishing

చేపల సాగులో కార్ప్‌ చేపలు- సాగు పద్ధతులు :
ప్రస్తుతం మంచినీటి చెరువులలో కట్ల, రోహు మరియు మ్రిగాల వంటి దేశీయ చేపలు, బంగారు తీగ, అమూర్‌ కార్ప్‌, గడ్డి చేప, వెండి చేప వంటి విదేశీ జాతి తెల్ల చేపలు పెంపకానికి అనువైన రకాలు. వీటి యొక్క పెరుగుదల ఎక్కువగా ఉండి రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఇవేకాకుండా మార్పు, పంగాసియస్‌ వంటి క్యాట్‌ ఫిష్‌ రకాలు తిలాపియా మరియు మాంసాహార చేప అయినటువంటి కొరమీను కూడా మంచినీటిలో పెంచడానికి అనువైన రకాలు, చేపలే కాకుండా రొయ్య జాతులైనటువంటి స్యాంపి, వెనామి మరియు టైగర్‌ రొయ్యలను కూడా మంచినీటి చెరువులలో పెంచవచ్చు.

ముఖ్యమైన చేపల రకాలు :
ఎ) బొచ్చె (లేబియో కట్ల): ఈ చేప నీటి పై భాగములో తిరుగాడుతూ సహజ ఆహారాన్ని మరియు అనుబంధ ఆహారాన్ని కూడా తీసుకుని 1 సంవత్సరకాలంలో, చెరువులలో 1 కిలో నుండి 2 కిలోల బరువు వరకు పెరుగుతాయి.
బి) రోహు / శీలావతి (లేబియో రోహిటా) : ఈ చేపలు నీటి మధ్యభాగంలో ఈదుతూ సహజ మరియు అనుబంధ ఆహారాన్ని తీసుకొని మొదటి సంవత్సరకాలంలో 750 గ్రా., రెండవ సంవత్సరకాలంలో 2 కిలోల వరకు బరువు పెరుగుతాయి.
సి) మ్రిగాల / మోసు (సిర్రానస్‌ మ్రిగాల) : ఈ చేపలు చెరువు అడుగు భాగాన తిరుగుతూ అక్కడున్నటువంటి సేంద్రియ వ్యర్ధ పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ చెరువులలో రెండు సంవత్సరకాలంలో 3 కిలోల బరువు వరకు పెరుగుతాయి.
డి) బంగారు తీగ (సిప్రినస్‌ కార్పియో) : బంగారు తీగ చేపలు 6 – 8 నెలల వరకు నీరు నిలువ ఉండు చిన్న నీటిపారుదల చెరువుల్లో పెంచుటకు అనుకూలంగా ఉంటాయి. 6 నెలల్లో ఇవి 1 కిలో బరువు పెరుగుతాయి.
ఇ) వెండి చేప చందున : ఈ చేపలు నీటి పైభాగంలో ఈదుతూ అచ్చట లభ్యమగు సహజ ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి సంవత్సరకాలంలో 2 కేజీల వరకు పెరుగుతాయి.
ఎఫ్‌) గడ్డి చేప గ్రాస్‌ కట్టు : ఈ చేపలు చెరువులోని గడ్డిని, కలుపు మొక్కలను ఆహారంగా తీసుకొని చెరువుగట్ల వెంబడి మరియు చెరువులోని కలుపుమొక్కలను నియంత్రిస్తాయి. ఒక సంవత్సరకాలంలో 2-3 కిలోల బరువును కలిగి ఉంటాయి.

Fish Farming in Telangana

Fish Farming in Telangana

చేపల పెంపకం పద్ధతులు :
ఎ) సాంప్రదాయ పద్ధతి : ఇది చాలా ప్రాచీన పద్ధతి, సహజ సిద్ధముగా నీటి వనరులలో చేరిన చేపలను, కొన్ని నెలలు పెరిగిన తర్వాత, చెరువులో నీరు తగ్గినప్పుడు పట్టుకునే విధానము.
బి) విస్తృత పద్ధతి : సంప్రదాయ పద్ధతి కంటే మెరుగైనది. నీటి వనరులలో చేప పిల్లలను వదిలి. తర్వాత సంవత్సరాంతంలో నీరు తగ్గినప్పుడు చేపలను పట్టుకుంటారు.

సి) పాక్షిక సాంద్రత పద్ధతి : విస్తృత పద్ధతి కంటే మెరుగైనది. తక్కువ మోతాదులో ఎరువులు, కృత్రిమ ఆహారం ఇచ్చి చేపల దిగుబడిని పెంచవచ్చును. హెక్టారుకు 2,500-3,500 చేప పిల్లలను వదలవచ్చు. చేపల ఉత్పత్తిని దాదాపు రెట్టింపు లేదా 3 రెట్లు పెంచే అవకాశం కలదు. ఈపద్దతిలో 2-4 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చు. దాదాపు అన్ని చెరువులు, కుంటలు, చిన్న రిజర్వాయర్లను ఈ పద్ధతి కిందికి తేవచ్చును. సహజ నీటి వనరుల్లో ఈ పద్ధతిలో చేపలు పెంచినప్పుడు నీటి యాజమాన్యంపై రైతులకు ఎలాంటి అదుపు ఉండదు.

డి) సాంద్రత పద్ధతి : ప్రత్యేకంగా నిర్మించిన చెరువుల్లో ఈ పద్ధతిలో చేపలు పెంచుతారు. దీనిలో ఎక్కువ సంఖ్యలో చేప పిల్లలను వదిలి అధిక మొత్తంలో ఎరువులు, కృత్రిమ ఆహారము వినియోగిస్తారు. దాదాపు ఒక ఎకరానికి 5,000-8,000 వరకు చేపపిల్లలను వదలవచ్చును. ఈ పద్ధతిలో నీటి యాజమాన్యం, ఆహార యాజమాన్యం పూర్తిగా రైతు ఆధీనంలో ఉంటుంది. క్రమ పద్ధతిలో చెరువు యొక్క భౌతిక, రసాయనిక స్థితి, చేపల పెరుగుదల మరియు ఆరోగ్యం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి హెక్టారునకు 5-9 టన్నుల వరకు దిగుబడిని సాధించవచ్చు. చేపల పెంపకంలో ఉపయోగించే చేప రకాల సంఖ్య, విధానాన్ని అనుసరించి ఈ క్రిందిరకాలైనటువంటి చేపల పెంపకం చేపట్టవచ్చును.

మోనో కల్చర్‌ : ఈ పద్ధతిలో ఒకే రకం చేపలను పెంచుతారు. సాధారణంగా మాంసాహారులైన చేపలు. ఈ విధానంలో పెంచబడతాయి. అంతేగాక తిలాపియ, రొయ్యలు మొదలైన వాటిలో ప్రత్యేకించి ఆడ, మగ జాతులను విడిగా పెంచే విధానం కూడా అమల్లో ఉంది.

పాలీకల్చర్‌ : ఈ విధానంలో చేపలతోపాటు మంచినీటి రొయ్యల వంటి ఇతర జాతులను కలిపి పెంచుతారు. దీని వలన అదనపు ఆదాయం పొందే వీలుంది. ఆహారంలో సాధారణంగా ఇచ్చే తవుడు, వేరుశనగ చెక్కతో పాటు రొయ్యలకు అదనంగా నత్తగుల్లల మాంసం, ఫిష్‌ మీల్‌ లేదా పెల్లేట్‌ మేతను ఆహారంగా ఇస్తారు.

మిశ్రమ జాతి చేపల పెంపకం : ఆహారం, స్థలం కోసం పోటీపడని అనేక చేప రకాలను ఈ విధానంలో పెంచుతారు. ఈ పద్ధతిలో చెరువులోని అన్ని స్థాయిల్లో గల ఆహారం పూర్తిగా వినియోగం అవుతుంది. చేపలు వదిలే ముందు చెరువు తయారీకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువును ఎండ బెట్టాలి. తగు మోతాదులో సున్నం, సేంద్రియ ఎరువులు వాడాలి. కృత్రిమ ఆహారం 2-5% వరకు ఇవ్వవచ్చు. పెంపక విధానాలను అనుసరించి చేప పిల్లలను వదలవచ్చు. ఈ పద్ధతిలో 3, 4 లేదా 6 రకాల వరకు దేశీయ, విదేశీయ రకాల చేపలను కలిపి పెంచవచ్చును. దిగుబడి 5-7 టన్నులు వస్తుంది.

సమగ్ర పద్ధతి : ఈ పద్ధతిలో చేపల పెంపకం, ఇతర వ్యవసాయాధార ఉపాధులతో కలిపి దీని వలన పెట్టుబడులు తగ్గడమే కాక, సహజ వనరులను సమర్ధవంతంగా వినియోగించవచ్చు. రైతులు తమకు ఉన్న వనరుల నుండి అదనంగా ఆదాయం పొందుటకు ఈ పద్ధతి అనువైనది. ఈ పద్ధతి ద్వారా ఈ క్రింది పెంపకాలను చేపట్టవచ్చును.

1. వరి – చేపల పెంపకం
2. కోళ్ళు, బాతులు – చేపల పెంపకం
3. పశువులు (డైరీ) – చేపల పెంపకం
4. ఉద్యానవన – చేపల పెంపకం (లేదా) కాయకూరలు – చేపల పెంపకం

Also Read: Fish Farming: వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

మంచినీటి రొయ్యల పెంపకం : మంచినీటి రొయ్యల పెంపకమునకు ‘మాక్రోబ్రేకియం రోజన్బర్గ్‌’ అనువైన రకము. దీనినే స్కాంపి అని అంటారు. ఇది వేగముగా పెరిగి, ప్రతికూల పరిస్థితులను తట్టుకొనే శక్తిని కలిగి అన్ని మంచి నీటి వనరుల్లో పెంచుటకు అనుకూలమైన రకము. మంచినీటి రొయ్యల పెంపకము 1990 సంవత్సరములో మనదేశము లోను, 1994 సంవత్సరములో మన తెలుగు రాష్ట్రములలో మొదలైనది. 1994 సంవత్సరములో వచ్చిన తుఫాను, వరదలకు టైగర్రొయ్యలకు వైరస్వ్యాధి సోకటంతో రైతులందరు మంచినీటి రొయ్యలపెంపకంపై దృష్టి సారించడం తో దేశములోనే ఆంధ్రరాష్ట్రము మొదటి స్థానంలో నిలిచినది.

పెంపకము:
స్టాకింగ్‌ : పోస్టు లార్వాలను చల్లని వాతావరణములో స్టాకు చేయవలెను. పోస్టు లార్వాలను రవాణా చేయు డబ్బాల నీరు మరియు నర్సరీలలో నీటి యొక్క ఉష్ణోగ్రత మరియు పి.హెచ్‌. ముందుగా పరిశీలించి వాటి యొక్క వ్యత్యాసము ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రత మరియు పి. హెచ్‌.లకు నెమ్మదిగా అలవాటు (అక్లిమటైజేషన్‌) చేయాలి. స్టాకింగ్‌ సాంద్రత 25-50 పి.యల్‌./ఒక చ.మీ. వరకు చేయవచ్చును.

అనుబంధ ఆహారము : పోస్ట్‌ లార్వాకు నర్సరీలలో సహజసిద్ధమైన ఆహారము లభిస్తుంది. అయిన అనుబంధ ఆహారము (క్రంబుల్స్‌) రొయ్య పిల్లల శరీర బరువుకు సమాన పరిమాణములో మొదటివారము రోజులు, రోజుకు రెండు పర్యాయములు చొప్పున, తర్వాత శరీర బరువుకు 10 శాతము తగ్గకుండా మేత ఇవ్వాలి.

కొర్రమీను చేపల పెంపకము : మంచినీటిలో పెంచదగిన చేప జాతులలో తెల్ల చేపలైన బొచ్చే, శీలావతి, మోసు, బంగారుతీగ, గడ్డిచేప, వెండిచేప వంటి జాతులే కాకుండా, నల్లచేపలైన కొర్రమెను పెంపకానికి అనువైన రకము. కొర్రమీను జాతి చేపలను ‘‘మర్రేల్స్‌’’ అని అంటారు. ఇవి మాంసాహార చేపలు. వీటి యొక్క తల, పాముతలనుపోలి ఉంటుంది. కనుక వీటిని ‘‘స్నేక్హెడ్ఫిష్‌‘‘ అని కూడా అంటారు.
కొర్రమీనులో నాలుగు జాతులున్నాయి. వీ టిలో చన్నా మరులియస్‌, చన్నా స్ట్రయేటస్‌ పెం పకానికి అనువైన రకాలు.

ఈ జాతిచేపలలో అనుబంధ శ్వాసవయవాలు ఉండటం వలన ఇవి నీటి బయట కూడా తేమగా ఉంచి నట్లైతే గాలిని పీల్చుకొని కొద్దిరోజుల వరకు బ్రతికి ఉండగలవు. అందువలన వీటిని ‘‘గాలిపీల్చేచేపలు’’ అని కూడా అందురు. ఈ ప్రత్యేక లక్షణము వలన వీటిని బ్రతికుండంగానే మార్కెటు చేయవచ్చును. వీటియొక్క మాంసం రుచిగా ఉండటమే కాకుండా ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. కనుక వినియోగదారులు అమితంగా ఈస్టపడతారు. ఈ చేపలను 8 నుండి 10 నెలలు పెంచినట్లైతే, ఇవి సుమారు 750 గ్రాముల వరకు పెరిగి, హెక్టారుకు 3 నుండి 4 టన్నుల ఉత్పత్తి సాదించవచ్చును. చెరువు నీటిని తగ్గించి కొరమీను చేపలను లాగుడువలలు, తేలుడువలలు, విసురుడువలలు మరియు చేతితో పట్టుకోవచ్చును. వీటిధరకే.జి .కిరూ .400/-లవరకు ఉంటుంది.

పంగస్ చేపలపెంపకం: ఇది విదేశీ జాతికి చెందిన చేప. ఆక్వారైతులు మంచినీటిలో మరియు కేజ్లో ‘‘ఫంగస్‌’’ చేపల పెంపకముపై ఆసక్తి చూపుతున్నారు. అయితే పంగస్చేపల పెంపకము చేపట్టే రైతాంగానికి భారత ప్రభుత్వము కొన్నిమార్గదర్శకాలను జారీ చేసింది. సదరు మార్గదర్శకాలను ఆక్వారైతాంగం తుచ తప్పకుండా పాటించవలసి యున్నది.

ఫంగస్ చేపలపెంపకయాజమాన్యం: ఏకజాతి సంవర్ధనము (మోనోకల్చర్‌) మరియు బహుళజాతి సంవర్ధనము (పాలికల్చర్‌) ద్వారా పెంపకము చేపట్టవచ్చు. అయితే ఏకజాతి సంవర్ధనము ద్వారా మనరాష్ట్రంలో ఆక్వారైతాంగం అధిక పంట దిగుబడి సాధించడం జరుగుతుంది. పంగస్చేపలపెంపకములో అనుసరణీయమైన యాజమాన్యపద్ధతులు గురించి పరిశీలిద్దాం.

తిలాపియా చేపల పెంపకము : ఈ మధ్య కాలములో భారతప్రభుత్వము ‘‘నైలు తిలాపియా’’ పెంపకానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగినది. ‘‘తిలాపియా’’ ఆఫ్రికా దేశపు చేప, దీని శాస్త్రీయ నామము ‘‘ఒరియోక్రోమిస్నిలోటికస్‌’’ (నైల్తిలాపియా) ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహారపు చేపగా గుర్తింపు పొందిన ‘‘అందరి చేప’’ (ఎన్రిబడీస్ఫిష్‌), అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండటం వలన దీనిని ‘‘ఆక్వాటిక్చికెన్‌’’గా పరిగణిస్తారు.

నైలుతిలాపియా ఉష్ణమండల దేశాలలో బాగా పెరుగుతుంది. దీనిని పంజరాలు (కేజెస్‌), చెరువులు, ట్యాంకులలో సాగు చేయవచ్చు. ఇది సర్వభక్షకి, ప్లాంక్టాను, చిన్నచిన్న నీటి పురుగులు, క్రుళ్ళిన పదార్థాలను ఆహారముగా తీసుకుంటుంది. వీటిలో మగ చేపలు, ఆడచేపల కంటే వేగముగా పెరుగుతాయి. కనుక ఏకలింగ చేపలను (మగచేపలను) పెంచడము ద్వారా అధికోత్పత్తిని సాధించవచ్చును. ఆడ, మగచేపలను కలిపి పెంపకము చేపట్టినట్లయితే ఆడచేపలు పరిపక్వతకు వచ్చి గ్రుడ్లను విడుదల చేస్తాయి. పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక రెండిరటిని కలిపి పెంపకము సాగించకూడదు.

పెంపక విధానము : తిలాపియా సాగు చేపట్టదలచిన రైతులు తప్పకుండా మత్స్యశాఖ వారికి దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకొనవలెను. తిలాపియా చేపలను చెరువులనుండి బయట సహజ నీటివనరులలోనికి ప్రవేశించకుండా, వరదల బారిన పడకుండా కట్టుదిట్టముగా పెంపకము సాగించాలి. కేవలం మగచేపలను లేదా వంధ్యత్వము గావించబడిన చేపల పెంపకము మాత్రమే చేపట్టవలెను. ఇటువంటి తిలాపియా చేపపిల్లలను, ప్రభుత్వము వారి అనుమతి పొందబడిన హేచరీలు, నర్సరీల నుండి మాత్రమే పొంది, పెంపకము చేపట్టవలెను. పెంపకపు చెరువు విస్తీర్ణము ఒక ఎకరంలో 5 (ఐదు) వేల చేపపిల్లలను వేసుకొని సాగుచేయవచ్చును.

జీవ పరిరక్షణ : తిలాపియా విదేశీ జాతి చేప. ఈ చేపలను మన సహజ నీటి వనరుల లోనికి ప్రవేశింపకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. చెరువుచుట్టూ కంచె, పక్షుల బెడద లేకుండా వలఏర్పాటు, చెరువు చుట్టూ ఎత్తైన గట్లు, మురుగు నీటిని శుద్ధిచేసి వదలడం వంటి జీవపరిరక్షణ చర్యలు చేపట్టవలెను.

Fisheries in Telangana

Fisheries in Telangana

రూప్చందు చేపల పెంపకము :
మంచినీటిలో పెంచదగిన చేపజాతులలో తెల్ల చేపలైన కార్ప్తో పాటు రూపింద్కూడా పెంపకానికి అనువైన రకము, రూప్చంద్జాతిచేపలను ‘పాకు’ అని అంటారు. ఇవి శాకాహార మరియు మాంసాహార రకపు చేపలు. వీటి యొక్క స్వభావము సర్వభక్షకం (అమ్నివోరస్‌). సర్వసాధారణంగా రూప్చందు, పాకు, రెడ్బెల్లీ, రెడ్పాంపేట్‌ అని పిలుస్తారు. శాస్త్రీయనామం పైరక్టస్బ్రాకియో పొమస్‌. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ మరి యు ఒరినీకో నదులలో మొదటగా గుర్తించబడినది. ఈ చేపలుక నిపించడానికి ఫిరాణ చేపల పోలికలు ఉన్నప్పటికీ ఇది ఫిరాణ చేప మాత్రం కాదు. ఈ చేప ప్రత్యేక లక్షణము తీసుకున్న ఆహారాన్నికండరాల ద్వారా ప్రోటీన్గా మార్చుకుంటుంది. నీటి మధ్యస్థ భాగంలో నివసిస్తుంది.

పెంపకం : రూప్చంద్చేపలనుచిన్న నీటికుంటలు, కాలువలు, జలాశయాలు, ఆక్సిజన్తక్కువ ఉన్న మరియు లోతు తక్కువ ఉన్న నీటివనరులలో పెంచవచ్చును. వీటి పిల్లలు ఎక్కువగా మే-సెప్టెంబరు మధ్య దొరుకుతాయి. ఇవి సుమారు 2 ` 4సెం.మీ. పొడవు ఉంటాయి. ఈ చేప హెక్టారుకు 6 వేల నుండి 10 వేల వరకు వేసి పెంచుకోవచ్చును. రూప్చంద్సాగులో అనుబంధ ఆహారంగా పెల్లెట్మేతను కూడా ఆహారంగా వాడవచ్చును. మేతను చెరువు అంత వెదజల్లడం లేదా సంచులలో ఉంచి చెరువులో అక్కడక్కడ ఉంచడం లేదా చెరువు నాలుగుమూలలో మేతవేసి అలవాటు చేయడం వంటి పద్ధతుల ద్వారా మేతను ఇవ్వవచ్చును. సాగులో ప్రతి 2 నెలలకు కొంత నీటి మార్పిడి అవసరము. కార్పు చేపల మాదిరిగానే వీటితో కూడా నీటిగుణాల యాజమాన్యత చేసినచో సరిపోతుంది. ఈ చేపలను 8`10 నెలలు పెంచినట్లయితే, ఇవి సుమారు 850-1000 గ్రాముల వరకు పెరిగి, హెక్టారుకు 5 నుండి 6 టన్నుల ఉత్పత్తి సాధించవచ్చును. చెరువు నీటిని తగ్గించి రూప్చంద్చేపలను లాగుడు వలలు, విసురు వలలు మరియు చేతితో పట్టుకోవచ్చును.

పొడవు బంగారుతీగ (అమూర్‌ కామన్‌ కార్ప్‌) పెంపకం :
మంచినీటిలో పెంచదగిన చేప జాతులలో తెల్ల చేపలైన కార్ప్తోపాటు అమూర్‌ కార్ప్‌ కూడా పెంపకానికి అనువైన రకము, ఈ జాతి చేపలను ‘‘పొడుగు బంగారు తీగ చేప’’ అని అంటారు. వీటి యొక్క స్వభావము సర్వభక్షకం (అమ్నివోరస్‌). సర్వసాధారణంగా దీని అమూర్‌ కామన్‌ కార్ప్‌/ అమూర్‌ కార్ఫ్‌ అనిపిలుస్తారు. శాస్త్రీయనామం సీప్రినస్‌ కార్పియో హేమటోప్టేరస్‌. ఇది చైనా దేశంలోని అమూర్‌ నదిలోమొదటగా గుర్తించబడినది. మొదటగా ఈ చేపను ఏసియన్‌ కార్ప్‌ సెంటర్‌ వారు దీనిని డెవలప్‌ చేసి ప్రపంచానికి అందించారు. మొట్టమొదటగా మనదేశంలో 2010 సంవత్సరంలో అమూర్‌ కార్ప్‌ చేపలను మేఘాలయలో హంగేరీ దేశం నుండి ప్రవేశపెట్టారు. ఈ చేపలురెండు జతల మీసాలను కలిగి ఉంటాయి.

అమూర్‌ కార్ఫ్‌ చేపల పెంపకంలో ఉన్న ప్రయోజనాలను పరిశీలిస్తే : వేగంగా పెరుగును (27% పేరుదలలో వేగం మాములు బంగారుతీగ కంటే) ఆలస్యంగా పక్వత చెంది మాములు బంగారు తీగవలే ఆహారపు అలవాటు కలిగి ఉండి కృత్రిమ ఆహారం కూడా తింటుంది. వ్యాధి నిరధక శక్తి ఎక్కువ మరియు మాములు బంగారుతీగ వలే శరీరం పొట్టగా ఉండక పొడవుగా ఉంటుంది
పెంపకం : ఈ రకపు చేపలను సర్వసాధారణంగా పాలి కల్చర్‌/ మోనో కల్చర్‌ చేపలపెంపకంలో వాడుకొని రైతులు మంచి లాభాలను పొందవచ్చును.

Also Read: Commercial Mushroom Cultivation: 6 వేల పెట్టుబడితో రెండున్నర లక్షలు ఆదాయం సంపాదించడం ఎలా ..?

Leave Your Comments

Tulsi Cultivation: తులసి సాగుతో వ్యాపారం.. రైతులకు మంచి ఆదాయం.!

Previous article

Livestock Management: వర్షాకాలంలో పాడి పశువుల ఆరోగ్య పరిరక్షణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Next article

You may also like