ఉద్యానశోభ

టమాటాలో శనగ పచ్చ పురుగు – నివారణ

0
Tomato
Tomato

కూరగాయలలో ప్రధాన పంట టమాటా. శీతాకాలంలో వేసిన టమాటా పంట మంచి దిగుబడినిస్తుంది. మార్కెట్లో వచ్చే ధరల హెచ్చు తగ్గులకు రైతులు అన్నీ కాలాలలోనూ ఈ పంట సాగుకు మగ్గువ చూపుతున్నారు. సున్నితమైన ఈ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశిస్తాయి. టమాటా పంట వేసిన 15 – 20 రోజుల దశలో శనగ పచ్చ పురుగు ఆశిస్తుంది. శనగ పచ్చ పురుగు చుట్టు పక్కల పొలాల్లో వేసిన కంది పంట నుంచి ఆశిస్తుంది. ఈ పురుగు టమాటా మొక్క లేత ఆకులను గోకి తినేస్తుంది. ఈ పరుగు పెరుగుతున్న కొద్దీ ఆకుల నుంచి కాయలకు రంధ్రాలు చేసి కాయ లోపలి గుజ్జునంతటిని తినేస్తుంది. దీనివల్ల కాయకుళ్ళు తెగులు వస్తుంది.
నివారణ:
పొలంలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి.
బంతి పంటను అంతర పంటగా వేసుకోవాలి.
పురుగు ఆశించిన తొలిదశలో ప్రొపినోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా థయోకార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయెట్ 5 గ్రా. లేదా ట్రేసర్ 4 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 4గ్రా. 10 లీటర్ల నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.

Leave Your Comments

చెరుకులో ఎరువులు- నీటి యాజమాన్యం

Previous article

దేశంలో పసుపు ధర రికార్డ్ స్థాయిలో..

Next article

You may also like